Asteroid coming closest to Earth.. NASA's sensational revelation.
NASA: భూమికి అతిదగ్గరగా దూసుకు రానున్న ఆస్ట్రాయిడ్.. నాసా సంచలన వెల్లడి.
అంతరిక్షంలో భూమి గుండా ఎల్లప్పడు ఆస్ట్రాయిడ్ లు వెళ్తుంటాయి.
కానీ అవి భూమికి అతి దగ్గరగా వచ్చి వాటి ప్రభావాన్ని భూమిపై చూపించలేవు. కానీ ఆ ఆస్ట్రాయిడ్లు దగ్గరకి రావడం కూడా భూమికి ప్రమదకరమే. ఒకవేళ అవి భూమిని ఢీకొంటే పెను విషాదమే జరుగుతుంది. అందుకే నాసా , ఈఎస్ఏ లాంటి సంస్థలు ఈ ఆస్ట్రాయిడ్లపై ఎల్లప్పుడు ఓ కన్నేసి ఉంచుతాయి. అయితే తాజాగా నాసా కీలక వ్యాఖ్యలు చేసింది. ఏప్రిల్ 10 సోమవారం రోజున ఓ పెద్ద అస్ట్రాయిడ్ భూమి వైపు అతిదగ్గరగా రానుందని తెలిపింది. ఈ ఆస్ట్రాయిడ్ అపోలో గ్రూప్ కు చెందినదని, ఓ ఎయిర్ క్రాఫ్డ్ అంత దీని సైజ్ తో,110 ఫీట్ల వెడల్పు ఉందని పేర్కొంది. అలాగే ఇది గంటకు 23,790 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తుందని స్పష్టం చేసింది. దీనికి ఆస్ట్రాయిడ్ 2023 FT1 అనే నామకరణం కూడా చేసింది.
అయితే ఇలాంటి ఆస్ట్రాయిడ్లను ఎదుర్కొనేందుకు నాసా ఇప్పటికే భూ రక్షణ కోసం డార్డ్ మిషన్ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షలో డైమార్ఫస్ అనే ఆస్ట్రాయిడ్ ను ధ్వంసం చేసి దాని దారి మళ్లించడంలో విజయం సాధించింది. అలాగే ఆస్ట్రాయిడ్ల ముదంస్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఈఎస్ఏ కూడా పనులు చేపడుతోంది. తాము తయారు చేసే ‘నీయర్ ఎర్త్ ఆబ్జెక్ట్ మిషన్ ఇన్ ద ఇన్ ఫ్రారెడ్'(NEOMIR) అనే అంతరిక్ష నౌక ఎల్1 లాంగ్రెంజ్ పాయింట్ వద్ద భూమి,సూర్యుడి మధ్య కక్ష్యలో తిరుగుతూ..సూర్యుని కాంతిలో తప్పిపోయే ఆస్ట్రాయిడ్లను కనిపెడుతుందని ఈఎస్ఏ తెలిపింది. 20 మీటర్లు అంతకన్న పెద్దవిగా ఉన్న ఆస్ట్రాయిడ్లను గుర్తించే సామార్థ్యం ఈ అంతరిక్ష నౌకకు ఉంటుందని స్పష్టం చేసింది.
0 Response to "Asteroid coming closest to Earth.. NASA's sensational revelation."
Post a Comment