Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ongoing review of the Education Department in the camp office of Hon'ble Chief Minister.

విద్యాశాఖపై గౌరవ ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయంలో కొనసాగిన సమీక్ష ముఖ్యాంశాలు

Ongoing review of the Education Department in the camp office of Hon'ble Chief Minister.

విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, ఇంటర్మీడియట్‌ విద్య కమిషనర్‌ ఎంవీ శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలికవసతులు) కమిషనర్‌ కాటమనేని భాస్కర్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..

  • స్కూళ్లుకు వచ్చే విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్‌ ఉండాలి
  • సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్ధాయిలో విద్యాశాఖ ఇప్పటికే సినర్జీతో ఉంది
  • దీన్ని మరింత సమర్ధవంతంగా వాడుకోవాలి
  • పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్‌ వెళ్తుంది
  • అయినా పిల్లలు బడికి రాని పక్షంలో తల్లిదండ్రులను ఆరా తీస్తున్నారు
  • పిల్లలను బడికి పంపేలా అమ్మ ఒడిని అందిస్తున్నాం
  • ఇంటర్మీడియట్‌ వరకూ అమ్మ ఒడి వర్తిస్తుంది
  • ఆ తర్వాత కూడా విద్యాదీవెన, వసతి దీవెన ఉన్నాయి
  • ఇలా ప్రతి దశలోనూ చదువులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది
  • ఇలా ప్రతి విద్యార్థిని కూడా ట్రాక్‌ చేస్తున్నాం
  • -అందుకే డ్రాప్‌అవుట్‌ అనే ప్రశ్నే ఉత్పన్నం కాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నాం
  • దీనిపై ఎప్పటికప్పుడు సమర్థవంతమైన పర్యవేక్షణ జరగాలి

    వచ్చే విద్యాసంవత్సరంలో విద్యాకానుకపై సీఎం సమీక్ష

    విద్యార్థులకు పంపిణీచేయాల్సిన పుస్తకాల ముద్రణ ముందుగానే పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు
    మే 15 నాటికి అన్నిరకాలుగా సిద్ధమవుతున్నామన్న అధికారులు

    సబ్జెక్టు టీచర్ల పైనా సీఎం సమీక్ష

  • పిల్లలకు ప్రతి సబ్జెక్టులోనూ పట్టుకోసం ఈ విధానాన్ని తీసుకు వచ్చామన్న సీఎం
  • దీనివల్ల చక్కటి పునాది ఏర్పడుతుందని, పిల్లల్లో నైపుణ్యాలు మెరుగుపడుతాయన్న సీఎం
  • గతంలో సబ్జెక్టు టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశాల నేపథ్యంలో సబ్జెక్టు టీచర్లకు బోధనా పద్ధతులపై ఐఐటీ మద్రాస్‌ ఆధ్వర్యంలో సర్టిఫికెట్‌ కోర్సులు ఏర్పాటుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌
  • మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో బోధనా పద్ధతుల్లో నైపుణ్యాలను పెంచేలా కోర్సు
  • వచ్చే రెండేళ్లపాటు ఈ సర్టిఫికెట్‌ కోర్సు కొనసాగుతుందన్న అధికారులు
  • 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఈ వేసవిలో శిక్షణా తరగతులు
  • పిల్లల సంఖ్యకు తగినట్టుగా సమీక్ష చేసుకుని వారి అవసరాలకు అనుగుణంగా టీచర్లను నియమించాలని సీఎం ఆదేశం
  • ఇక ప్రతిఏటా కూడా దీనిపై సమీక్ష చేసుకోవాలన్న సీఎం. ఆ మేరకు మార్పులు, చేర్పులు చేసుకోవాలన్న సియం
  • పిల్లలకు ఎక్కడా కూడా టీచర్లు సరిపోలేదన్న మాట రాకూడదన్న సీఎం
  • ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్‌ (ఐఎఫ్‌పీ) ఏర్పాటుపై సీఎం సమీక్ష
  • ►సీఎం ఆదేశాల మేరకు జూన్‌ నాటికి తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్టు అధికారుల వెల్లడి
    ►స్కూలు పిల్లలకు టోఫెల్‌ సర్టిఫికేట్‌ పరీక్షలపై సీఎం సమీక్ష
    ►3 నుంచి 5గ్రేడ్ల ప్రైమరీ విద్యార్థులకు టోఫెల్‌ పరీక్షలు
    ►ఉత్తీర్ణులైన వారికి టోఫెల్‌ ప్రైమరీ సర్టిఫికెట్‌
    ►6 నుంచి 10 గ్రేడ్ల వారికి జూనియర్‌ టోఫెల్‌ పరీక్షలు
    ►వీరికి జూనియర్‌ స్టాండర్డ్‌ టోఫెల్‌ పరీక్షలు
    ►మొత్తం మూడు దశల్లో వీరికి టోఫెల్‌ పరీక్ష
    ►ప్రైమరీ స్థాయిలో లిజనింగ్, రీడింగ్‌ నైపుణ్యాల పరీక్ష
    ►జూనియర్‌ స్టాండర్డ్‌ స్ధాయిలో లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్‌ నైపుణ్యాల పరీక్ష
    ►ఈ పరీక్షలకోసం విద్యార్థులను, టీచర్లను సన్నద్ధం చేసేలా ఇ- కంటెంట్‌ రూపొందించాలని సీఎం ఆదేశం.

    ►విద్యార్థులకు ట్యాబుల పంపిణీ, వారు వినియోగస్తున్న తీరుపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు
    ►ట్యాబులు ఎక్కడ రిపేరు వచ్చినా వెంటనే దానికి మరమ్మతు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం

    ►దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్‌ఓపీ తయారుచేశామన్న అధికారులు.
    ►ట్యాబులకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా.. వెంటనే ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక ఫిర్యాదు నంబరును స్కూల్లో ఉంచాలన్న సీఎం.
    ►ఏ సమస్య వచ్చినా, రెండు మూడు రోజుల్లో పరిష్కరించి తిరిగి విద్యార్థులకు అప్పగిస్తున్నామన్న అధికారులు.
  • సీఎం ఆదేశాల మేరకు పదోతరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్న అధికారులు
  • ►గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్న అధికారులు.
    ►ఎక్కడా ప్రశ్నపత్రాల లీకేజీలకు ఆస్కారం లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామన్న అధికారులు.
    ►నో మొబైల్‌ జోన్స్‌గా పరీక్ష కేంద్రాలను మార్చామని, ఎవ్వరికీ కూడా మొబైల్‌ అనుమతిలేదని తేల్చిచెప్పిన అధికారులు.
    ►ప్రశ్న ప్రత్రాల్లో క్యూ ఆర్‌ కోడ్‌ ప్రతీ ప్రశ్నకూ ఇచ్చామన్న అధికారులు.
    ►దీనివల్ల ఎక్కడ నుంచి, ఏ సెంటర్‌ నుంచి, ఏ విద్యార్థికి సంబంధించిన ప్రశ్నపత్రం లీక్‌ అయ్యిందో సులభంగా తెలుసుకునే అవకాశం ఉందని తెలిపిన అధికారులు.
    ►ఈ చర్యలు కారణంగా ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్షలు జరుగుతున్నాయన్న అధికారులు.

    ►ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో కూడా ఇలాంటి చర్యలే తీసుకున్నామన్న అధికారులు.
    ►ప్రతి పరీక్షా గదిలో కూడా సీసీ కెమెరాలు పెట్టామన్న అధికారులు.

    ►మధ్యాహ్న భోజనం నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగాలని సీఎం ఆదేశం.

  • ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ పూర్తిస్థాయిలో చేయాలన్న సీఎం.

  • ►ఇప్పటికే వేయి ప్రభుత్వ స్కూళ్లు అఫిలియేట్‌ అయ్యాయని, మిగిలిన స్కూళ్లు కూడా చేసేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.

    ►ప్రభుత్వ పాఠశాలల్లో రెండో దశ నాడు - నేడు కింద పనులపైనా సమీక్షించిన సీఎం.
    ►ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్న అధికారులు.



  • SUBSCRIBE TO OUR NEWSLETTER

    Seorang Blogger pemula yang sedang belajar

    0 Response to "Ongoing review of the Education Department in the camp office of Hon'ble Chief Minister."

    Post a Comment

    google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0