Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Dr. Epuri Harsha Vardhan is a wise man

 స్థితప్రజ్ఞుడు డాక్టర్ ఏపూరి హర్ష వర్ధన్

Dr. Epuri Harsha Vardhan is a wise man

డాక్టర్ ఏపూరి హర్ష వర్ధన్, ఖమ్మం,వృత్తి రీత్యా ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ లో  జనరల్ మెడిసిన్ లో వైద్య సేవలు ఇస్తున్నాడు 

 పెళ్లి సమయం వచ్చింది 

వైరా దగ్గరలోని మేనత్త ఊరిలో సింధు అనే అమ్మాయిని పరస్పరం వీడియోలో చూసుకున్నారు ఇష్టపడ్డారు కరోనాకాలం మొదలవుతుంది ముందుగా నిర్ణయించిన సమయానికి అనగా ఫిబ్రవరి 12 2020 నాడు హర్ష సింధుల వివాహం అత్యంత ఘనంగా ఖమ్మంలో జరిగింది వారం రోజులపాటు తిరుపతి గుళ్ళు గోపురాలు అత్యంత ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరిగారు

 డాక్టర్ హర్ష ఫిబ్రవరి 29  అనగా లీఫ్ సంవత్సరం నాడు ఆస్ట్రేలియా వెళ్ళాడు

 సింధు ఏప్రిల్ మొదటి వారంలో ఆస్ట్రేలియా వెళ్లడానికి ప్లాన్ చేసుకుంది 

కానీ ఆ అమ్మాయి అదృష్టమో దురదృష్టమో కానీ 23 2020 నుండి కరోనా డేంజర్ బెల్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ విధించబడింది

సింధు ఆస్ట్రేలియా వెళ్లలేకపోయింది

స్వతహాగా డాక్టర్ అయినా హర్ష కి పరిశుభ్రత అంటే ప్రాణం ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు స్వయంగా వంట చేసుకునేవాడు జంక్ ఫుడ్ కూల్ డ్రింక్స్  పిజ్జా  బర్గర్  వంటి  వాటిని దగ్గరికి రానిచ్చేవాడు కాదు 

డాక్టర్ హర్ష కి బాడీ ఫిట్ నెస్  అంటే ఇష్టం దాని కొరకు ప్రతిరోజు జిమ్ చేసేవాడు

 అక్టోబర్ 2020లో జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తుంటే ఆయాసం కొంచెం దగ్గు రావడం మొదలైంది వెంటనే డాక్టర్ హర్ష పరీక్ష చేయించుకోగా ఉప్పెన లాంటి వార్త లంగ్ క్యాన్సర్ గా నిర్ధారణ జరిగింది కుటుంబ సభ్యులందరూ కనీసం మూడు నెలల పాటు షాక్ లో ఉన్నారు

 లాక్ డౌన్ కారణంగా తల్లిదండ్రులు ఆస్ట్రేలియా వెళ్లలేని పరిస్థితి హర్ష ఇండియా రాలేని పరిస్థితి విమానాలు నడవటం లేదు 

క్యాన్సర్ సోకింది అన్న భయంకరమైన నిజాన్ని నేను భరించక తప్పదు అని భావించిన హర్ష తన తల్లిదండ్రుల్ని బంధువుల్ని తను ఇష్టపడే వాళ్ళందరినీ నాకు ఏమి కాదు తగ్గిపోతుందిలే అని మోటివేట్ చేశాడు చికిత్స తీసుకుంటున్నాడు

మరి అమాయకురాలైన సిందూ భవిష్యత్తు 

డాక్టర్ హర్ష ముందు తనకొచ్చిన క్యాన్సర్ వ్యాధి కంటే పెద్ద సమస్య సింధు భవిష్యత్తు 

సింధు మెరుగ్గా ఉండాలని ఆలోచించాడు అసలే సింధు వాళ్ళ నాన్న ఆక్సిడెంట్ కు గురై ఎనిమిది సంవత్సరాల నుండి శరీరం చచ్చుబడి బెడ్ మీదనే ఉంటున్న అతనిని అత్యంత ఓపికస్తురాలైన సిందూ తల్లి అన్నీ తానై చూసుకుంటుంది సింధు గురించి మెరుగ్గా ఆలోచించాడు విడాకులు కోరాడు కానీ సింధు ఒప్పుకోలేదు లాక్ డౌన్ ఎత్తివేయగానే నేను ఆస్ట్రేలియా వచ్చి నీకు తోడు గా ఉంటాను అంది కానీ ఏ ముచ్చట తీరకుండానే విదవరాలు కావడం హర్ష కు ఇష్టం లేదు 

ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి విడాకులు తీసుకున్నాడు విడాకుల సమయంలో ఆ అమ్మాయికి అన్నీ అదనంగానే ఇచ్చాడు ఇప్పటికీ ఒక స్నేహితురాలిగా ఇస్తూనే ఉన్నాడు సిందు  ఎమ్మెస్ చదవడానికి అమెరికా వెళ్ళింది సింధుకి పెళ్లి సంబంధాలు వచ్చినా నచ్చలేదు అంటుంది 

డాక్టర్ తీసుకుంటున్న చికిత్స ఫలితంగా తగ్గిపోయింది అనుకున్న మహమ్మారి ఈసారి మరింత ఉధృతంగా దాడి చేసింది డాక్టర్ హర్ష కి విషయం తెలిసింది తను ఈ భూమిపై ఉండేది కొన్ని రోజులేనని తల్లిదండ్రులు ఆస్ట్రేలియా వస్తా అన్నా కూడా వద్దు అన్నాడు ఎందుకంటే ఆ వ్యాధి వల్ల తను పడే బాధలు వాళ్ళు చూడకూడదు అని బలంగా అనుకున్నాడు

వ్యాధి తీవ్రత తెలిసిన దగ్గర నుండి చికిత్స తీసుకుంటూనే ప్రతి క్షణం తన తల్లిదండ్రులను అత్యంత సున్నితంగా మానసికంగా తనకు ఏది జరిగినా భరించడానికి సిద్ధం చేస్తున్నాడు 

2020 ఫిబ్రవరిలో వెళ్లిన డాక్టర్ హర్ష రెండున్నర సంవత్సరాల తర్వాత 2022 అక్టోబర్లో చిట్ట చివరిసారిగా తన తల్లిదండ్రులను చూడడానికి ఇండియా ఖమ్మం వచ్చాడు

15 రోజులు ఉండి ఒకేరోజు తన తల్లిదండ్రులను అమెరికాలోని తన తమ్ముడి దగ్గరకు పంపి తనకు ఆస్ట్రేలియాలోనే మెరుగైన వైద్యం లభిస్తుంది అని చెప్పి తను ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు 

డాక్టర్ హర్ష ఆస్ట్రేలియాలో 100 మందికి పైగా  అనాధలు ఉన్న ఆశ్రమంలో వారికి అత్యంత ఓపికగా ప్రేమగా కావాల్సిన వైద్యం అందిస్తూ ఉంటాడు డాక్టర్ హర్ష కి వాళ్లు అన్న వారికి హర్ష అన్న  పిచ్చి ప్రేమ 

కానీ డాక్టర్ హర్షా కి తెలుసు తన అనుకున్న వాళ్ళందరినీ ఈ భూమి మీద నుండి వెళ్లిపోవడానికి తనకి చికిత్స చేస్తున్న వైద్యులు మూడు ముందస్తు డెత్ తేదీలు ఇచ్చారని

 ఈ సమయంలోనే అత్యంత స్థితప్రజ్ఞత ప్రదర్శిస్తూ తన తల్లిదండ్రులను అందరూ ఆశ్చర్యపోయే విధంగా మానసికంగా సిద్ధం చేసిన విధానం వల్ల హర్ష  అంటే అందరికీ మరింత గౌరవం ఏర్పడింది 

చక్కటి మనస్తత్వం కలిగి సహాయం చేసే సుగుణవంతుడైన డాక్టర్ హర్షకు స్నేహితులు ఇండియాలో ఆస్ట్రేలియాలో అనేకమంది ఉన్నారు 

అవసరం ఉండి స్నేహితుల మెసేజ్ పెడితే ఎంత పనిలో ఉన్నా ఖచ్చితంగా సాధ్యమైనంత త్వరగా స్పందించేవాడు ఫోన్ లో నేను ఒక గంట లేదా రెండు గంటల్లో స్పందించలేదు అంటే ఇక హర్ష లేడు అనుకోమని స్నేహితులతో ముందుగానే అన్నాడు 

సమయం రానే వచ్చింది డాక్టర్లు ముందుగా ఇచ్చిన ఒక డెత్ డేట్ మార్చి 27 2023 దీనికి ముందుగానే తను చనిపోయినప్పుడు ఎవ్వరికీ బరువు భారం కాకుండా లాయర్ తో మాట్లాడి ఆథరైజేషన్ అక్కడి తన స్నేహితులకు ఇచ్చాడు  

అలాగే శవపేటికను స్వయంగా ఆర్డర్ చేసుకున్నాడు తన కారు  అమ్మేశాడు నిర్జీవమైన స్థితిలో తన తల్లిదండ్రుల వద్దకు రావడానికి కనీసం సింగిల్ డాలర్ కూడా ఖర్చు పెట్టుకోవడానికి తన స్నేహితులకు అవకాశం ఇవ్వకుండా ప్రతిదీ తనే ప్లాన్  చేసుకున్నాడు 

సిడ్నీలో ఉండే సైంటిస్ట్ అయినా తన బంధువుని మార్చ్ 24 వ తారీకు రమ్మన్నాడు మార్చి 23 తను రెగ్యులర్ గా వైద్య సేవలు అందించే ఆశ్రమానికి వెళ్ళాడు నేను ఇండియాకు వెళ్తున్నాను అని బాయ్ బాయ్ చెప్పి వారి దగ్గర నుండి వీడ్కోలు తీసుకున్నాడు 

24 మార్చి ఉదయం బ్రౌన్ కలర్ జాకెట్  వేసుకొని తెల్లటి పాయింట్  తెల్లటి  షూ ధరించి  చక్కగా ఉన్నాడు తన స్నేహితులతో కలిసి చాలాసేపు తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడాడు అనంతరం అందరూ కలిసి టిఫిన్ చేసి వచ్చారు ఒక గంట తర్వాత మళ్లీ ఫోన్ చేస్తా అని తల్లికి చెప్పాడు 

నాకు మళ్ళీ కాఫీ తాగాలనిపిస్తుంది వెళ్లొద్దాం పద అని స్నేహితులతో అంటే ఎందుకురా ఇప్పుడే కదా తాగాము అని స్నేహితులు అంటే తను ఒక్కడే స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లి కాఫీ తాగి వచ్చాడు 

అనంతరం మూత్ర విసర్జనకు వాష్ రూమ్ కి వెళ్ళగా మూత్రం బదులు రక్తం రావడం గమనించాడు స్నేహితులకు చెప్పాడు నేను మరొక గంట కంటే ఎక్కువ సమయం మీ ముందు ఉండకపోవచ్చు అని 

నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా అని పడుకున్నాడు అంతే రెండు నిమిషాల తర్వాత 32 సంవత్సరాల హర్ష వర్ధన్ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు

 ఇలాంటి పరిస్థితుల్లో కూడా అంతిమ దశలో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి కావలసిన ఏర్పాట్లు తనే స్వయంగా చేసుకొని ఇలా కూడా చేయొచ్చా అని చూపి అందరికీ ఆదర్శవంతుడు  అయ్యాడు 


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Dr. Epuri Harsha Vardhan is a wise man"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0