Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Are you drinking tea on an empty stomach

ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా..? అయితే తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి.

Are you drinking tea on an empty stomach

సహజంగా అందరూ ఉదయం నిద్ర లేవగానే టీ తాగకుండా ఏ పని మొదలుపెట్టరు. టీలో ఉండే కెఫిన్ మెదడుని ఉత్సాహంగా ఉంచుతుంది. అలాగే మనసుని ఉల్లాసపరుస్తుంది.

ఒత్తిడికి గురయ్యేవారు కప్పుటి తీసుకోవడం వలన మంచి ఉపశమనం పొందుతారు. ఈ ప్రయోజనాలు ఉండడంతో కొంతమంది బ్రష్ చేయకుండానే టీ తాగడం అలవాటు చేసుకుంటూ ఉంటారు. దీనినే బెడ్ కాఫీ అని పిలుస్తారు. బెడ్ కాఫీ తీసుకోవడం వలన రోజంతా యాక్టివ్ గా ఉంటారని నమ్ముతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఉపయోగాలకంటే ఆరోగ్య నష్టాలే చాలా ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. బెడ్ కాఫీ తాగడం వలన వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. ఉదయం లేవగానే ఏమి తినకుండా టీ తాగితే ఎసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ లాంటి సమస్యలు వస్తాయని వైద్యనిపుణులు చెప్తున్నారు.

అలాగే దీర్ఘకాల వ్యాధులకు కూడా దారితీస్తుందని చెప్తున్నారు. ఏదైనా మోతాదు మించితే విషమవుతుంది అన్న సంగతి అందరికీ తెలిసిన ఈ విషయమే. టీ ని అతిగా తీసుకోవడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే కాళీ కడుపున ఒక కప్పు టీ తాగిన ఎన్నో వ్యాధులు సంభవిస్తాయని చెప్తున్నారు. టీ లేదా కాఫీలో ఆమ్లం అనే పదార్థం ఉంటుంది. సహజంగానే మన శరీరంలో ఆమ్లం ఉంటుంది. ఖాళీ కడుపున టీ తీసుకోవడం వలన ఇది పరిమాణం పెరిగి ఎస్డిటికీ దోహదపడుతుంది. అదేవిధంగా నోట్లోనే బ్యాక్టీరియా షుగర్ లెవెల్స్ ను పెంచుతాయి. పరిగడుపున టీ తాగడం వలన డిహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంది. టీ లో ఉండే కెఫిన్ అనే పదార్థం శరీరంలో మూత్ర లెవెల్స్ ని పెంచుతాయి. దీనివలన శరీరంలోని నీరంతా బయటికి పోతుంది. ఇది నిర్జలీకరణ సమస్యకు దారితీస్తుంది.


అలాగే బెడ్ కాఫీ తాగడం వలన ఈ సమస్య తప్పకుండా వస్తుందని వైద్యనిపుణులు చెప్తున్నారు. ఖాలి కడుపుతో టీ తీసుకోవడం వలన జీర్ణ క్రియ క్షీణిస్తుంది. జీర్ణ వ్యవస్థ దెబ్బ తినడం వల్ల శరీరానికి శక్తి ఉండదు. దాంతో ఎప్పుడు అలసిపోయినట్లు ఉంటారు. ఇటువంటి సమయంలో జ్వరం తదితర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి టీ ని మొత్తానికి మానేయాల అంటే.. అలా చేయాల్సిన అవసరం లేదు. మోతాదుకు మించి టీ తీసుకోవడంతో పాటు టీ తో పాటు బిస్కెట్లు తీసుకోవడం వల్ల మంచి రిలీఫ్ ఉంటుంది. అదేవిధంగా ఆహారం తిన్న తర్వాత రెండు లేదా మూడు గంటల తర్వాత టీ తాగడం చాలా మంచిది. ఎక్కువ టి తీసుకోవడం వలన డీహైడ్రేషన్తో పాటు కడుపునొప్పి సమస్యలు ఆకలి మందగించడం, రక్తపోటు సమస్యలు దీంతో బరువు పెరగడం లాంటి సమస్యలు వస్తాయి. కావున పరిగడుపున టి తాగడం మానుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Are you drinking tea on an empty stomach"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0