Have you updated your Aadhaar?
మీ ఆధార్ ను అప్డేట్ చేశారా.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావాలన్నా.. బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగించాలన్నా.. సెల్‌ఫోన్ సిమ్‌కార్డు పొందాలన్నా.. ఇలా ఒకటేమిటి ప్రతి అవసరానికి ఇప్పుడు ఆధార్ తప్పనిసరి. ఇంతటి కీలకమైన ఆధార్‌కార్డును అప్‌డేట్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆధార్ కార్డు పొంది పది సంవత్సరాలు గడిచిన వారు తప్పనిసరిగా అప్‌డేషన్ చేసుకోవాలని, లేదంటే ఆగస్టు నెలతో ఆధార్ కార్డు పని చేయదని ప్రభుత్వం చెబుతోంది.
ఉచితంగానే అప్‌డేట్.
ఆధార్ కార్డు అప్‌డేట్ కోసం ఆధార్ కేంద్రాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. ఈ నెల 15 నుంచి అప్‌డేట్ ప్రక్రియ ప్రారంభించారు. జూన్ 14 వరకు మూడు నెలల పాటు ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవచ్చు. కంప్యూటర్లో ఆధార్ అఫీషియల్ వైబ్‌సైట్ ద్వారా గానీ, మొబైల్‌లో ఎంఆధార్ యాప్‌లోనైనా ఈ ప్రక్రియను పూర్తిచేసుకోవచ్చు. దీనికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అరచేతిలోనే ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం అందించింది. బ్యాంకులు, కామన్ సర్వీస్ కేంద్రాలు, సచివాలయాల్లో కూడా ఆధార్ ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు.
గుర్తింపు పత్రం జత చేయాలి.
కొన్నిసార్లు వ్యక్తిగత వివరాలున్న ధ్రువపత్రాలు సమర్పించకపోయినా కేవలం ఒక అప్లికేషన్‌తో అప్పట్లో ఆధార్‌కార్డు మంజూరు చేశారు. అలాంటి వారితో పాటు కార్డు పొంది పదేళ్లు దాటిన వారు తప్పకుండా గుర్తింపు పత్రాలు, ఇతర ధ్రువపత్రాలను ఆధార్‌కు జతచేసి డాక్యుమెంట్ అప్‌డేషన్ చేసుకోవాలి. లేనిపక్షంలో ఈ ఏడాది ఆగస్టు 31 తరువాత కార్డు చెల్లుబాటులో ఉండదని అధికారులు చెబుతున్నారు.
మార్పులు, చేర్పులకు అవకాశం.
ప్రస్తుత అప్‌డేషన్‌లో భాగంగా ఆధార్‌కార్డులో మార్పులు, చేర్పులకు కూడా ప్రభుత్వం అవకాశం ఉంది. చిరునామా, ఫోన్‌నంబర్, తదితర వివరాలను మార్చుకోవచ్చు. ప్రభుత్వం ఆమోదించిన పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ఐడీ, పాన్‌కార్డు, బ్యాంక్/పోస్టల్ పాస్‌బుక్, ఫొటోతో కూడిన రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్‌కార్డు, గుర్తింపు పొందిన విద్యా సంస్థలు జారీచేసే పత్రాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు కార్డులు తదితర 13 రకాల ధ్రువపత్రాల ద్వారా ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవచ్చు.
సచివాలయాల్లోనూ అప్‌డేట్
ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌ను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలి. ఆధార్ పొందిన పదేళ్ల కాలంలో ఎప్పుడైనా డాక్యుమెంట్ అప్‌డేట్ చేసుకున్న వారికి ఫర్వాలేదు. మిగిలిన వారు మాత్రం అప్‌డేట్ చేసుకోవాలి. మండలానికి ఆధార్ అప్‌డేట్ కిట్లు ఐదు మాత్రమే ఇవ్వడం వల్ల రోజుకు 5 సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహించి ఆధార్ అప్‌డేట్ చేయిస్తున్నాం.
0 Response to "Have you updated your Aadhaar?"
Post a Comment