Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Driving Licence

Driving Licence: కేంద్రం కొత్త రూల్స్..డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్.

Driving Licence: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి సులువుగా డ్రైవింగ్ లైసెన్స్(Driving licence) పొందేలా నిబంధనలను సవరించింది.

ఆర్టీవో(RTO) ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందేలా వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వీటిని వెంటనే అమల్లోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. తాజా నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ జారీ తీరు, తదితర విషయాలు తెలుసుకుందాం.

ఇండియాలో వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అయితే ఈ లైసెన్స్ పొందడానికి సాధారణ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వారు. రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసులు(ఆర్టీవో) చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్ పొందవచ్చు. లైసెన్స్ మంజూరు చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ స్కూల్స్‌కి బదిలీ చేసింది. గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్స్‌లో చేరి ట్రైనింగ్ తీసుకుని పరీక్షలో పాసైన వారు డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అర్హులు. డ్రైవింగ్ స్కూల్ ఇచ్చే ఈ సర్టిఫికెట్ ఆధారంగానే లైసెన్స్ జారీ అవుతుంది.

ఇక నో పెండింగ్

ఆర్టీవో ఆఫీస్‌లలో చాలా దరఖాస్తులు ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉంటున్నాయి. జనాభాకు తగిన విధంగా ఆఫీసులు లేకపోవడం, పనిభారం పెరిగిపోవడం వల్ల లైసెన్స్‌ల మంజూరు నిర్ణీత కాలంలో పూర్తి కావడం లేదు. ఈ నేపథ్యంలో లైసెన్స్ ఇచ్చే అధికారాలను కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ స్కూల్స్‌కు అందించింది.

డ్రైవింగ్ లైసెన్స్ మంజూరులో పూర్తి అధికారాన్ని ప్రభుత్వం డ్రైవింగ్ స్కూల్స్‌కి అప్పజెప్పింది. అయితే, డ్రైవింగ్ సెంటర్లకు కేంద్రం కొన్ని షరతులు విధించింది. డ్రైవింగ్ స్కూల్ నిర్వహించాలంటే కావాల్సిన అర్హతలు, అవసరాల గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేసింది. టూ వీలర్ నుంచి హెవీ వెహికల్స్ వరకు వివిధ నిబంధనలను పొందుపర్చింది. అవేంటో చూద్దాం.

ఐదేళ్ల అనుభవం

డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలంటే నిర్వహకులు కొన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. టూ వీలర్, త్రీ వీలర్, నాన్ ట్రాన్స్‌పోర్ట్ లైట్ మోటార్ వెహికల్స్‌ లైసెన్స్ కోసం ట్రైనింగ్ ఇవ్వడానికి కనీసం ఒక ఎకరం ఖాళీ ప్రదేశం ఉండాలి. అదే ట్రాన్స్‌పోర్ట్, గూడ్స్, హెవీ వెహికల్స్ కోసమైతే కచ్చితంగా కనీసం 2 ఎకరాలు ఉండాలి. అదే విధంగా ట్రైనర్‌కి కనీసం 5 ఏళ్ల పాటు డ్రైవింగ్ అనుభవం ఉండాలి. దీంతో పాటు కనీసం 12వ తరగతి పాసై ఉండాలి. ట్రాఫిక్ నియమాల గురించి క్షుణ్నంగా తెలిసి ఉండాలి.

సిలబస్

డ్రైవింగ్ లైసెన్స్ ట్రైనింగ్ సిలబస్, డ్యురేషన్‌ని కేంద్రం వెల్లడించింది. లైట్ మోటార్ వెహికల్స్ వరకు లైసెన్స్ కోసం 4 వారాల పాటు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సిలబస్‌ని రెండు విధాలుగా విభజించారు. ఒకటి థియరీ, రెండోది ప్రాక్టికల్. మొత్తంగా ట్రైనింగ్ సెషన్‌లో 29 గంటల పాటు క్లాసులు జరగాలి. ఇందులో 21 గంటలు ప్రాక్టికల్ క్లాసులు అంటే.. రోడ్డుపై డ్రైవింగ్ శిక్షణ, మిగిలిన 8 గంటలు థియరీ క్లాసులు నిర్వహించాలి. అదే హెవీ వెహికల్స్ లైసెన్స్ కోసమైతే శిక్షణ కాలం 6 వారాల పాటు ఉండాలి. 8 గంటలు థియరీ, మరో 31 గంటలు ప్రాక్టికల్ తరగతులు జరపాలి. డ్రైవింగ్ ట్రైనింగ్ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్‌ని పై అధికారులు చెక్ చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్లు పైబడిన వారికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయాలి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Driving Licence"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0