Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

What rJD and DEO said in webex meetings

RJD గారు‌ మరియు DEO గారు వెబెక్స్ మీటింగ్స్ లో చెప్పిన విషయాలు

What rJD and DEO said in webex meetings

1. పదవ తరగతి పరీక్షలు మరియు స్పాట్ చక్కగా నిర్వహించినందుకు అందరికీ అభినందనలు

2.వేసవి సెలవులు పిల్లలకే...విద్యాశాఖ సిబ్బందికి కాదు అని అనుకోవాలి

3.JVK కిట్స్....టెక్స్ట్ బుక్స్ త్వరలో మండల పాయింట్స్ కి చేరుతాయి

4. పదవ తరగతి విద్యార్ధుల ఫలితాలు మే రెండవ వారంలో వస్తాయి

5. 8 వ తరగతి విద్యార్ధులకు ఇచ్చిన టాబ్స్ వేసవి సెలవుల్లో వారి దగ్గరే ఉంటాయి కాబట్టి ఆ టాబ్స్ పాడుచెయ్యకుండా ఉండాలంటే పిల్లల దగ్గరనుండి ఒక డిక్లరేషన్ తీసుకోవాలి

ఏమైనా ట్యాబ్ పాడైతే వారే బాధ్యులు అనేది వారికి తెలిసేలా చెప్పాలి....అలా డిక్లరేషన్ తీసుకోవాలి

6. JVK కిట్స్ లో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. షూస్ సరిపడా సైజ్ తీసుకోవాలి. ఏ పిల్లవాడికి షూ లేకపోయినా ప్రధానోపాధ్యాయుడిదే బాధ్యత. నోటు పుస్తకాలు...యూనిఫారం.. బెల్ట్... టెక్స్ట్ బుక్స్ అందరికీ అందాలి.

7. ప్రధానోపాధ్యాయులదే పూర్తి బాధ్యత

8. వియ్ లవ్ రీడింగ్ ఖచ్చితంగా అమలుజరగాలి. పిల్లలతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చెయ్యాలి

9. PM SHRI స్కూల్స్ సెలెక్టెడ్ స్కూల్ కాస్టింగ్ షీట్ వెంటనే పూర్తిచేసి APC గారికి ఇవ్వాలి

10. సమ్మర్ ఏక్టివిటీస్ (SCERT వారు ఇచ్చిన గైడ్ లైన్స్ పాటించాలి). సమ్మర్ హాలిడేస్ లో విద్యార్ధులు ఏం చేసారో ఒక నోట్ బుక్ లో రాసి, సెలవుల తరువాత క్లాస్ టీచర్ కి ఇవ్వాలి* *ఖచ్చితంగా అమలు జరగాలి*మొబైల్ ఫోన్లు మరియు టి వి నుండి దూరం అవ్వడానికి ఈ సమ్మర్ ఏక్టివిటీస్ ఉపయోగపడతాయి

11. గ్రంధాలయ ఉత్సవాల  సందర్భంగా  పిల్లలు గ్రంధాలయాలకు వెళ్ళేలా చూడాలి.

12.  హైస్కూల్ వాచ్ మెన్ మే 1 నుండి విధులలోకి రావాలి

ఉన్న నిబంధనల మేరకు నైట్ వాచ్ మెన్ నియమించుకోవాలి నియమించకపోతే ప్రధానోపాధ్యాయుడు బాధ్యత వహించాలి

13. ఐరన్ ఫోలిక్ టాబ్లెట్స్ అనిమిక్ గా పిల్లలందరికీ PHC నుండి తెచ్చుకుని ఇవ్వాలి అందరు పిల్లలకి అందాలి

14. RBI వారి ఫైనాన్షియల్ లిటరసీ క్విజ్ లో ప్రతి పాఠశాల పాల్గొనేలా చూడాలి

15. 5 పూర్తి అయిన ప్రతి పిల్లవాడు 6 వ తరగతిలో మన ప్రభుత్వ పాఠశాలలో చేరేలా చూడాలి. హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు బాధ్యత వహించాలి

16. RTE ప్రకారం పిల్లలను ప్రవేటు పాఠశాలల్లో చేర్చే ఏర్పాటు చెయ్యాలి. MEO లు బాధ్యత వహించాలి

17. నిష్ట 4.0 ని MEO లు..CRO లు శిక్షణ పొందాలి

18. పదవ తరగతి పిల్లవాడిలాగే ఆరవ తరగతి పిల్లవాడిని ట్రీట్ చెయ్యాలి. బాగా చదువు రావాలి

19. పిల్లలకు నైతిక విలువలు నేర్పాలి. అసాంఘికంగా తయారవ్వకూడదు. పిల్లవాడి ఎడల ఉపాధ్యాయులు బాధ్యత వహించాలి. ఉపాధ్యాయులే తల్లిదండ్రులు లా ఉండాలి

పదవ తరగతి ఔట్ గోయింగ్..6వ తరగతి ఇన్ కమింగ్ పై ఖచ్చితంగా దృష్టి పెట్టాలి

21.  పాఠశాల పరిశుభ్రంగా ఉండాలి. తీర్మానం రాసి పరిశుభ్రతకి చర్యలు తీసుకోవాలి. కిచెన్ షెడ్ శుభ్రత పాటించాలి

22. నాడు నేడు పై పూర్తి శ్రద్ధ వహించాలి

పాఠశాలల పునఃప్రారంభం నాటికి నాడు నేడు పూర్తి చెయ్యాలి ప్రయారిటీ ప్రకారం డబ్బులు ఖర్చు పెట్టాలి

23. హైస్కూల్ HMs, టీచర్స్ ,MEO లకు సహకరించాలి

23 SSC సెంటర్ లు ఉన్న పాఠశాలలు మాత్రమే కాకుండా అన్ని పాఠశాలకు 30.4.23 ఆఖరి పనిదినం

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "What rJD and DEO said in webex meetings"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0