Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

If your smartphone has fallen into water, what to do immediately?

మీ స్మార్ట్ ఫోన్ నీళ్లలో పడిందా.అయితే వెంటనే ఏమి చేయాలో  వివరణ

If your smartphone has fallen into water, what to do immediately?

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే కొన్ని సార్లు ఫోన్ ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోవడం లేదా వర్షంలో తడవడం జరుగుతుంది.

దీంతో వెంటనే కంగారుపడి తడిచిన ఫోన్‌ను ఆరబెట్టడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. కొన్ని సార్లు అవి సక్సెస్ అవుతాయి, మరికొన్ని సార్లు ఫెయిల్ అవుతాయి. అయితే తడిచిన ఫోన్‌ను ఆరబెట్టడానికి కొన్ని రకాల చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. అందులో ముఖ్యంగా ఒక ట్రిక్ చాలా వరకు పనిచేస్తుంది. ఇప్పుడు ఆ ట్రిక్ ఏంటో ఒకసారి చూద్దాం..

స్మార్ట్ ఫోన్ వాటర్‌లో పడితే వెంటనే ఆ ఫోన్‌ను బయటికి తీసి ప్రక్కన పెట్టాలి. నీళ్లు బయటికి పోవడానికి ఫోన్‌ను కొందరు షేక్ చేస్తారు. కానీ ఇలా చేయకూడదు. షేక్ చేయడం వల్ల ఫోన్ లోపలి భాగాల్లోకి నీరు చేరే ప్రమాదం ఉంది. అలాగే మరికొందరు హెయిర్ డ్రయ్యర్‌ను కూడా వాడుతుంటారు. ఇలా చేయడం వలన కూడా ఫోన్ భాగాలు ఎక్కువగా వేడి అయి పనికిరాకుండా పోయే అవకాశం ఉంది.

ఫోన్ నీళ్లలో పడితే వెంటనే పొడి బట్టతో దాన్ని తుడవాలి. తరువాత దాదాపు ఒక 24 గంటల పాటు స్మార్ట్‌ఫోన్‌ను వాడకూడదు. అలాగే, బియ్యం సంచిలో కనీసం 14 గంటల పాటు ఉంచాలి. ఇలా చేయడం వలన బియ్యంలో ఉన్న వేడి స్మార్ట్ ఫోన్ వాటర్‌ను గ్రహించి వేగంగా ఫోన్‌ను ఆరేలా చేస్తోంది. బియ్యంతో పాటు, పప్పు ప్యాకెట్‌లు, కొంచెం వేడి కలిగిన క్లాత్‌లను కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేసేటప్పుడు సిమ్ కార్డు ట్రేలను, మెమరీ కార్డులను బయటికి తీయాలి. బియ్యం గింజలు హెడ్‌ఫోన్ జాక్, ఛార్జింగ్ పోర్టులో వెళ్లకుండా చూసుకోవాలి. కొన్ని గంటల తర్వాత ఫోన్ పూర్తిగా ఆరిపోతుంది. అప్పుడు ఫోన్ ఆన్ చేయవచ్చు.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "If your smartphone has fallen into water, what to do immediately?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0