Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Why do you wash mango leaves at home even on festivals or auspicious occasions?

పండుగులైనా, శుభకార్యాలు అయినా ఇంటికి మామిడి ఆకులు ఎందుకు కడతారు.?

Why do you wash mango leaves at home even on festivals or auspicious occasions?

ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నా, పండుగలు వచ్చినా.. హిందువులు ముందు ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కడతారు.. అప్పుడే ఆ కళ వస్తుంది.. కానీ ఎందుకు మామిడి ఆకులే కడతారు.

పచ్చగా ఉండాలంటే.. ఇంకా ఏ ఆకును అయినా కట్టుకోవచ్చు కదా..! శుభకార్యాల్లో అయితే మామిడి ఆకులకు ఇంకా ప్రాధాన్యత ఎక్కువ.. పెళ్లిలో ఇదే మామిడి ఆకులను దోర్నపాకు అంటారు. ఈ సంప్రదాయం వెనుక కారణమేంటి..?

మామిడి, రావి, జువ్వి, మర్రి, ఉత్తరేణి- ఆకులను పంచపల్లవాలని పిలుస్తారు. వీటిని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. అయితే తోరణాలుగా మాత్రం మామిడాకులనే వినియోగిస్తారు. పండుగలు, వేడుకలు, వివాహాది సమయాల్లో గుమ్మానికి మామిడాకులను కట్టడం శుభసూచకంగా భావిస్తారు. యజ్ఞ యాగాదుల్లో మామిడాకులతో కూడిన ధ్వజారోహణం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. పూజా కలశంలోనూ మామిడాకులను ఉపయోగిస్తాం.

ప్రతి ఇంట్లో శుభకార్యాలు, పండుగ సమయాల్లో గడపలకు పసుపు, కుంకుమ రాసి బొట్టు పెడతారు. అలాగే గుమ్మాలపై పచ్చటి మామిడి తోరణాలతో అలంకరిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ధనలక్ష్మితో పాటు సకల దేవతా పరివారం వస్తారని పండితులు అంటున్నారు.. ఫలితంగా ఆ ఇంట్లోకి ధనం వచ్చి చేరడంతో ఆర్థిక సమస్యలు పోతాయని విశ్వసిస్తారు. ఇంటి అలంకరణ ఎంత బాగుంటే.. అంతలా దేవుళ్లు ఇంట్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయట. మామిడి ప్రేమ, సంపద, సంతానాభివృద్ధికి సంకేతమని రామాయణ, భారతాల్లో ప్రస్తావించారు.

మన పురాణాల్లో కూడా మామిడాకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.. మామిడి చెట్టు కోరికలను తీరుస్తుందనీ, భక్తి ప్రేమకు సంకేతమని భారతీయ పురాణాలలో పేర్కొన్నారు. ఇది సృష్టికర్త బ్రహ్మకు అర్పించిన వృక్షం. దీని పువ్వులు చంద్రునికి అర్పించబడ్డాయి. కాళిదాసు ఈ చెట్టును మన్మథుడి పంచబాణాలలో ఒకటిగా వర్ణించాడు. శివపార్వతుల కల్యాణం మామిడి చెట్టు కిందనే జరిగిందనీ, అందుకే శుభకార్యాలలో మామిడి ఆకులను ఉపయోగిస్తారని, చివరికి అంత్యక్రియలో కూడా మామిడికట్టెను ఉపయోగిస్తారని చెపుతారు.

మామిడి ఆకులు నిద్రలేమిని పోగొడతాయి అని, పండుగల వేళ పని ఒత్తిడిని, శ్రమను తగ్గేలా చేస్తాయని, అంతే కాదు మామిడి కోరికలు నెరవేరేలా చేస్తుందని భావిస్తారు. ఆలయాలలోనూ ఎలాంటి శుభసందర్భం అయినా మామిడాకుల తోరణాలు కడతారు.. భగవంతుడు కొలువై ఉండే ఆలయాలలోనే మామిడాకుల తోరణాలకు ప్రాధాన్యత ఉంటే అలాంటి మామిడాకులను ఇంట్లో కడితే ఫలితం తప్పకుండా ఉంటుందని పెద్దలు విశ్వసిస్తారు.

అంతేకాదు.. గ్రామాల్లో బావిలోనికి దిగి శుభ్రం చేసేవారికి మొదట మామిడాకులు ఎక్కువగా ఉన్న ఓ కొమ్మను బావిలోకి దించి, చుట్టూ కొంతసేపు తిప్పమని చెప్పేవారట. ఇలా చేయడం వలన బావిలో ఉన్న విషవాయువులు తొలగిపోతాయట… ఇప్పటికి ఇలా చేసేవారు ఉన్నారు.

ఇక మామిడాకుల్లోంచి విడుదలయ్యే ప్రాణవాయువు వాతావరణాన్ని స్వచ్ఛంగా ఉంచుతుంది. ఎక్కువమంది గుమిగూడినప్పుడు ఎదురయ్యే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. గుమ్మాలకు మామిడాకులను తోరణాలుగా కట్టడం వలన పరిసరాల్లోని గాలి పరిశుభ్రమై ఆక్సిజన్‌ శాతం పెరుగుతుంది. ఇంటి ప్రధాన ద్వారం పైన, ఇంటి ఆవరణలోని ద్వారానికి మామిడి ఆకుల తోరణాలు కడితే ఆ ఇంట్లోని వాస్తు దోషం పోతుందట. అంటే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ ప్రసారమవుతుందట. తద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుందని పెద్దలు చెబుతారు.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Why do you wash mango leaves at home even on festivals or auspicious occasions?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0