Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Sri Prasanna Venkateswara swami vari Brahmotsavalu

తిరుమల నుండి వస్తున్న వేంకటేశ్వరస్వామికి ఆతిధ్యం ఇచ్చిన మల్లవరం దేవస్థానం గురించి తెలుసుకుందాం.

శ్రీ వేంకటేశ్వరస్వామి తిరుమల నుండి ఒకరోజు ఆకాశమార్గాన వస్తుండగా ఒక గిరి పైన విశ్రాంతి తీసుకున్నాడని అదియే ఇప్పుడు ఒక ప్రసిద్ధ దేవాలయంగా మారిందని స్థల పురాణం చెబుతుంది. మరి శ్రీ వెంకటేశ్శ్వరస్వామికి ఆతిధ్యం ఇచ్చిన ఆ గిరి ఎక్కడ ఉంది? ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sri Prasanna Venkateswara swami vari Brahmotsavalu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మద్దిపాడు మండలంలో పేరుగాంచిన గ్రామం మల్లవరం. ఈ గ్రామంలో అతిపురాతనమైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ గ్రామాన్ని గుండ్లకమ్మ నది స్పర్శిస్తూ దక్షిణ ముఖంగా ప్రవహిస్తుంది. ప్రకృతి సౌందర్యలతో భాసిల్లే మల్లవర గిరిపైనా శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇక్కడ వెలసిన స్వామి గురించి మహాభారత అరణ్య పర్వాన్ని పూరించి మహాకవి ఎర్రన్న తన హరివంశ పీఠికలో ప్రస్తుతించారు. దీనిని బట్టి ఈ దేవాలయం సుమారు క్రీ.శ. 1100 సంవత్సరాల ముందే ఉందని చెబుతారు.

మల్లవరం శ్రీ వేంకటేశ్వరస్వామి

ఇక స్థల పురాణానికి వస్తే, పూర్వం ఒక రోజు తిరుమల గిరి నుండి శ్రీ వేంకటేశ్వరస్వామి బయలుదేరి ఆకాశమార్గాన ప్రయాణిస్తూ గుండిక నది తీరాన్ని చేరి, అచట విస్తరించి ఉన్న గిరిపై విశ్రాంతి తీసుకోవాలని అనుకోగా, మళ్లవరగిరి తనపై ఆతిధ్యం ఇచ్చింది. అప్పుడు స్వామి సంతోషంతో విశ్రమించాడు. అప్పుడు మల్లవరాద్రిపై తేజోమయ రూపమున వెలుగుచున్న శ్రీ వేంకటేశ్వరుని చూసిన నారద మహర్షి భక్తి భావంతో స్వామిని ప్రార్ధించి వారి అనుమతితో మళ్లవరగిరి ఆనందించేలా స్వామిని అచట ప్రతిష్ట గావించి స్వామివారిని అర్చించినట్లు స్థల పురాణం.

మల్లవరం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం

ఇక శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆలయం గోపురం, ప్రాకారం కట్టించినట్లు అచట ఉన్న శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇలా వెలసిన ఆ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ప్రతి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ విదియ వరకు తొమ్మిది రోజులు బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ తొమ్మిది రోజులు స్వామివారికి వివిధ అలంకరణలు, అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ గ్రామ ప్రజలేకాక, చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలు కూడా ఈ కార్యక్రమములో పాల్గొని తమ జన్మ ధన్యమైనట్లు భావిస్తారు. భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న వేంకటేశ్వరస్వామి తిరునాళ్ల నిర్వహించడం ఆనవాయితీ.ఆప్రకారం ఇక్కడ వేడుకలకు రంగం సిద్ధమైంది.

కార్యక్రమముల వివరాలు:

ఏప్రిల్ 30  శుద్ధ దశమి రాత్రి: నుంచి అంకురారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

 మే 1  న ఏకాదశి రాత్రి శేషవాహనము.

 మే 2  న  ద్వాదశి రాత్రి హంసవాహనము.

మే 3  న  త్రయోదశి రాత్రి సింహవాసనము

మే4  న  చతుర్దశి రాత్రి హనుద్వాహనము

మే 5  న పూర్ణిమ రాత్రి గరుడసేవ

మే 6  న  బహుళ పాడ్యమి రాత్రి గజోత్సవం

మే 7  న  విదియ ఉదయం కళ్యాణ మహోత్సవము,

సకలజనుల సహాయ సహకారాలతో గుడి వద్ద అన్న సంతర్పణ కార్యక్రమం జరుగును

సాయంత్రం 4 గంటలకు తెప్ప మహోత్సవం

 రాత్రి: 8 గంటలకు మల్లవరం పురవీధులలో రథోత్సవము కార్యక్రమము జరుగును.

మే 8  న  తదియ రాత్రికి అశ్వవాహనము

మే 9  న  చవితి అవరోహణ

మే 10  న  పంచమి ఉదయం చక్రతీర్ధం మరియు రాత్రి 8.00 గంటలకు స్వామివారి ఏకాంత సేవ.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Sri Prasanna Venkateswara swami vari Brahmotsavalu"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0