Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Origin Of Water

 Origin Of Water: భూమిపైకి నీరు ఎలా వచ్చింది? శాస్త్రవేత్తల తాజా పరిశోధన ఏం చెబుతుందో వివరణ.

Origin Of Water

Origin Of Water: సృష్టికి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. అయితే చాలా అంశాలకు సంబంధించిన గుట్టును సైన్స్‌ విప్పింది.

ఇప్పుడు టెక్నాలజీ సాయంతో శాస్త్రవేత్తలు(Scientists) వివిధ అంతుచిక్కని రహస్యాలను తెలుసుకునేందుకు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే భూమిపైకి నీరు(Water on earth) ఎక్కడి నుంచి వచ్చింది? అది జీవం అభివృద్ధికి ఎలా సహాయపడింది? అనే దానిపై చాలా కాలంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. అయితే నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ కొత్త అధ్యయనం, చాలా కాలం క్రితం భూమి సొంతంగా నీటిని తయారు చేసి ఉండవచ్చని రుజువు చేసింది. ఈ ఆవిష్కరణ ద్వారా భూమి ఎలా ఏర్పడింది, ఇతర గ్రహాలపై నీరు, జీవం ఎలా ఉండవచ్చు? అనే అంశాలను మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు.

నీరు ఉన్న గ్రహశకలాల ద్వారా భూమిపైకి నీరు వచ్చి ఉండవచ్చని గతంలో భావించారు. అయితే ఇప్పుడు కొత్త రిసెర్చ్ మాత్రం ఇందుకు భిన్నంగా భూమి పైనే నీటి పుట్టుక జరిగిందని తెలిపింది. భూమి(Earth) వంటి గ్రహాలు సూర్యుని చుట్టూ ఉండే ధూళి, వాయువు నుంచి క్రియేట్‌ అయ్యాయి. కాలక్రమేణా, ఈ కణాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ప్లానెటిసిమల్స్ అని పిలిచే చిన్న రాళ్లను ఏర్పరచాయి. ఇవి క్రమంగా పెద్దవిగా మారడంతో, విపరీతంగా వేడెక్కి, మాగ్మా మహాసముద్రాలుగా ఏర్పడ్డాయి.

భూమి పుట్టుక

ప్లానెటరీ ఎంబ్రియోస్‌గా పేర్కొనే చిన్న వస్తువులు, గ్రహాలుగా మారాయి. హైడ్రోజన్ (Hydrozen) అధికంగా ఉండే వాతావరణంలోకి ఇవి క్రాష్ అయ్యాయని భావిస్తున్నారు. ఈ తాకిడి మాగ్మా మహాసముద్రాల ఉపరితలంపై నీరు ఏర్పడటానికి కారణమైంది. భూమి మొదట ఏర్పడినప్పుడు, అది వేడిగా ఉంది. చల్లబడిన తర్వాత, దానిలోని బరువైన పదార్థాలో మధ్యలో మునిగిపోయాయి, తేలికైన వస్తువులు పైకి లేచాయి. ఇది భూమి లోపల ఉల్లిపాయ పొరల వంటి లేయర్‌లను క్రియేట్‌ చేసింది.

నీటి సృష్టి

అంతరిక్షంలోని రాళ్లు మాగ్మాలోకి కరిగిపోయినప్పుడు, అవి హైడ్రోజన్ అణువులతో ఇంటరాక్ట్‌ అయ్యి నీరు, ఆక్సిజన్ వాయువును తయారు చేశాయి. రాళ్లలో నీరు లేకపోయినా ఇది జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రక్రియ భూమిపై నీరు, ఆక్సిజన్‌ను సృష్టించేందుకు సహాయపడి ఉండవచ్చని పేర్కొన్నారు.

ఆ వాదనలకు భిన్నం

చాలా కాలంగా అంతరిక్షం నుంచి పడిన గ్రహశకలాల ద్వారా భూమిపైకి నీరు వచ్చిందనే సిద్ధాంతం ఉంది. ఈ విషయాన్ని చాలా మంది నమ్మారు. అయితే ఆదే కాకుండా భూమి వంటి గ్రహాలు వాటి నీటిని ఎలా పొందాయో వివరించే ఇతర ఆలోచనలు ఉన్నాయి. సౌర వ్యవస్థ వెలుపల ఉన్న గ్రహాల చుట్టూ ఉన్న గాలిని (ఎక్సోప్లానెట్స్ అని పిలుస్తారు) చూడటానికి శక్తివంతమైన టెలిస్కోప్‌లను ఉపయోగించగలిగితే, అక్కడ జీవం ఉందో లేదో కనుగొనగలమని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఇతర గ్రహాలపై జీవించడం సాధ్యమవుతుందా ? లేదా తెలుసుకునే మార్గంగా మారుతుందని వారు భావిస్తున్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Origin Of Water"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0