Stamps And Registration User Charges Increased
User Charges Hike: సైలెంట్‌గా షాకిచ్చిన ప్రభుత్వం.. భారీగా ధరలు పెంపు
Stamps And Registration User Charges Increased: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైలెంట్‌గా షాకిచ్చింది. ముందస్తు సమాచారం లేకుండా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ యూజర్ ఛార్జీలను భారీ మొత్తంలో పెంచింది.
ఏకంగా పదిరెట్టు పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 24 గంటల్లో ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. వేర్వేరు సేవలకు డాక్యుమెంట్లకు యూజర్ ఛార్జీలను పెంచింది. ధరలు పెంచడంతో ఒక్కో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌పై రూ.750 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
పెంచిన ధరల వివరాలు
ఏ ప్రాంతంలో మార్కెట్ ప్రకారం ఆస్తుల విలువ ఎంత ఉందని.. ఆయా ప్రాంతాల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ధ్రువీకరణ పత్రాలను అందజేస్తుంది. ఇందుకు యూజర్ ఛార్జీ ప్రస్తుతం రూ.10 ఉండగా.. నేటి నుంచి రూ.50 వసూలు చేస్తారు. ఈసీ జారీకి యూజర్ ఛార్జీ రూ.10 నుంచి 100 రూపాయలకు పెంచారు.
ప్రస్తుతం ప్రతి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జీ కింద 100 రూపాయల నుంచి రెండొందల వరకు వసూలు చేస్తున్నారు. దీనిని ఏకంగా 500 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి రిజిస్ట్రేషన్ చేసిన ప్రతీ డాక్యుమెంట్‌కూ రూ.500 యూజర్ ఛార్జీ చెల్లించాల్సిందే.
రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తరువాత ఆస్తికి సంబంధించిన దస్తావేజు నకలుకు ప్రస్తుతం రూ.20 వసూలు చేస్తుండగా.. రూ.100కు పెంచారు.
30 ఏళ్లలోపు కాలానికి వివరాలు తెలుసుకునేందుకు ఈసీ కోసం రూ.200, అంతకంటే ఎక్కువ కాలానికి రూ.500 చెల్లించాల్సి. ఇందుకోసం యూజర్ ఛార్జీ రూ.10 ఉండగా.. దీనిని రూ.100కు పెంచారు.
లక్షలోపు విలువ ఉన్న ఆస్తికి స్టాంపు ఫీజు ఇక నుంచి 50 రూపాయలు చెల్లించాలి. అదే లక్షదాటితే 100 రూపాయలు యూజర్ ఛార్జీ వసూలు చేస్తారు.
కమర్షియల్ కంపెనీ, బైలా సొసైటీల రిజిస్ట్రేషన్ ధృవపత్రం కోసం 100 రూపాయల యూజర్ ఛార్జీ వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలు మంగళవారం నుంచే అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు నాన్ జ్యుడిషియల్ స్టాంపులకు కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కక్షిదారుల అవసరాలకు తగినట్లు ఇవి అందుబాటులో లేవు. కొన్ని చోట్ల కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల రూ.10, 50, 20 స్టాంపులు లేవని చెబుతూ.. కేవలం రూ.100 స్టాంపులు అమ్ముతున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో రూ.100 స్టాంపులనే కొనాల్సి వస్తోంది. రిజిస్ట్రేషన్స్, స్టాంపుల శాఖ వైఫల్యంపై ప్రజలు మండిపడుతున్నారు.
0 Response to "Stamps And Registration User Charges Increased"
Post a Comment