When the issue of transfers and promotions was mentioned, the words of the minister were with the teachers unions
బదిలీలు ప్రమోషన్ల విషయం ప్రస్తావించినప్పుడు ఉపాధ్యాయ సంఘాలతో మంత్రిగారు అన్న మాటలు.
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల విషయంలో కోర్టు తీర్పుకు అనుగుణంగా నిర్ణ యం తీసుకుంటాము.
కోర్టు తీర్పు ఆలస్యమ య్యే సందర్భంలో ప్రస్తుతం ఇచ్చిన జీవోను రద్దు చేసి, బదిలీ కోడ్ రూపొందించి.
ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి..
బదిలీలు, పదోన్నతులు ప్రక్రియ చేపడుతాము..
ఉపాధ్యాయ సంఘాలతో గౌ.ఏ.పి. విద్యాశాఖ మంత్రివ ర్యులు.
విద్యా మంత్రి గారితో కొన్ని సంఘాల చర్చలు- సారాంశము
1998 DSC నియామకాలలో మెరిట్ కమ్ కమ్యూనల్ రోస్టర్ ను అమలు చేయాలని విద్యాశాఖా మంత్రిగారికి ప్రాతినిధ్యం చేయడం జరిగింది.
త్వరలో ఉపాధ్యాయ, అధ్యాపకుల నూతన నియామకాలు (DSC) దాదాపు 15 వేల వరకు చేపట్టే యోచనలో ఉన్నట్లు మంత్రి తెల్పారు.
ఆయా పాఠశాలల్లో ఉపాద్యాయులు దీర్ఘకాలిక లేదా ఇతర సెలవులు పెట్టిన సందర్భంలో బోధనకు ఆటంకం కలగకుండా మండల కేంద్రాల్లో పూల్ (అదనపు టీచర్లు ) టీచర్స్ వుండేలా చూడాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి వున్నట్లు , చర్చ జరిగినట్లు మంత్రి గారు తెల్పారు.
మున్సిపల్ డిడిఓ లకు ఇంకా శాలరీ పవర్స్ డెలిగేట్ కాలేదని ఆలస్యం కావడం వలన వార్షిక ఇంక్రిమెంట్లు పెండింగ్ లో పడుతున్నాయని తెలియజేయడం జరిగింది. CFMS లో పెండింగ్లో వున్న ఫైల్ ను త్వరగా ప్రాసెస్ చేసి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
చీఫ్ సెక్రటరీ స్థాయిలో పనిచేసి రిటైర్ అయిన అధికారులు ఒక ఫోరమ్ గా ఏర్పడి స్వచ్ఛందంగా విద్య మరియు అభివృద్ది మీద ప్రభుత్వాలకు సూచనలు చేస్తున్నట్లు మంత్రిగారు తెలియజేయడం జరిగింది.
ఏకోణంలో చూసిన మౌళిక అభివృద్ధిలో ఉపాధ్యాయులే ప్రధాన భాగస్వామ్యం అవుతారని ఆ ఫోరమ్ సూచించినట్లు మంత్రిగారు తెలియజేశారు.
అందులో భాగంగా డిజిటల్ శిక్షణ టీచర్స్ కు అవసరమని అందరికీ ఆమేరకు శిక్షణ ఇస్తామని తెలియజేశారు.
పెండింగ్లో ఉన్న గురుకులాలలు, సొసైటీలు, యూనివర్సిటీలోని కొన్ని కేడర్లకు 62సంll సర్వీసు పెంపుదలను చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరడం జరిగింది.
సరెండర్ లీవు, పెండింగ్ డి.ఎ లు,డి.ఎ బకాయిలు, పి.ఆర్.సి బకాయిలు ఇవ్వాలని పట్టుపట్టగా ,మంత్రిగారు స్పందిస్తూ ఇప్పటి వరకు పి.యఫ్, ఏపిజిఎల్ ఐ రుణాలు మంజూరు మొదలు పెట్టామని, మేనెలలో సరెండర్ లీవు బకాయిలు, ఒక డి.ఎ. ఇస్తామని తెలియజేశారు. మిగతా బకాయిలు కూడా త్వరలో మంజూరు చేయగలమని అన్నారు.
ప్రవీణ్ ప్రకాష్ గారి పర్యటన టీచర్స్ ను కొంత భయపెట్టే విధంగా ఉందని,ఏదైనా ఉపాధ్యాయులకు సూచనలు చేయదలిస్తే స్టాఫ్ రూమ్ లో చెప్పవచ్చని అలా కాకుండా మీడియా ముందు,విద్యార్థుల దగ్గర కించపరిచే విధంగా మాట్లాడడాన్ని మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది.
మంత్రిగారు మాట్లాడుతూ ప్రవీణ్ ప్రకాష్ గారి విజిట్స్ లో పాజిటివ్ అంశాలు తీసుకోవాలని, మిమ్మల్ని ఇబ్బందులు కల్గించే అంశాల పట్ల మాట్లాడతానని చెప్పారు.
బదిలీల అంశం కోర్టులో అనేక పిటిషన్ల కారణంగా పెండింగ్లో వున్నాయని, ఎలాగైనా వేసవిలో ప్రక్రియ పూర్తి చేసేలా చూస్తామని అన్నారు.
0 Response to "When the issue of transfers and promotions was mentioned, the words of the minister were with the teachers unions"
Post a Comment