Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

YS Jagan is another good news for AP government employees.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వైఎస్ జగన్ మరో గుడ్ న్యూస్.

పీలో ఎన్నికలకు ఏడాది మాత్రమే మిగిలున్న నేపథ్యంలో ఉద్యోగులు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారంతో వైఎస్ జగన్ అప్రమత్తమవుతున్నారు.

ఉద్యోగులకు ఇవాల్సిన ప్రయోజనాలపై ఇప్పటికే వారి నుంచి వివరాలు తీసుకున్న ప్రభుత్వం వాటిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది.

అదే సమయంలో వారి ఆరోగ్య ప్రయోజనాలకు సంబంధించి ఇవాళ మరో కీలక ఉత్తర్వు జారీ చేసింది. దీంతో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న మరో సమస్య తీరినట్లయింది.

ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం ఈహెచ్ఎస్ పేరుతో ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య చికిత్సలకు అవసరమయ్యే మొత్తాన్ని ఆస్పత్రులకు సమకూరుస్తోంది. ఉద్యోగులు అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తే ఈహెచ్ఎస్ పథకం ద్వారా వారికి ఉచితంగా ఆస్పత్రులు చికిత్స అందించందుకు ఉద్దేశించిన పథకం ఇది. అలా చికిత్స ఇచ్చేందుకు వీలుగా ఈహెచ్ఎస్ పథకంలో వివిధ రకాల చికిత్సలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాల్సి ఉంది. కానీ అలా జరగడం లేదు. దీంతో ఉద్యోగులకు ఆస్పత్రుల్లో సమస్యలు తప్పడం లేదు.

ఈ నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించిన ఆరోగ్య పథకంలో క్యాన్సర్ కు సంబంధించిన 46 చికిత్సలను ప్రతీ ఏటా రెన్యువల్ చేస్తున్నారు. ఇలా రెన్యువల్ కాకపోతే మాత్రం ఉద్యోగులకు ఆస్పత్రుల్లో సదరు చికిత్సలు అందవు. దీనిపై వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ట్రస్టు నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది కూడా 46 క్యాన్సర్ చికిత్సలకు సంబంధించి రెన్యువల్ చేసేలా ప్రభుత్వం ఆమోదించి వైద్యారోగ్య శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు ప్రతీ ఏటా ఈ 46 క్యాన్సర్ చికిత్సలను రెన్యువల్ చేయాల్సిన అవసరం లేకుండా ఇకపై ఆటోమేటిగ్గా ప్రతీ ఏటా రెన్యువల్ అయ్యేలా ఇందులో మార్పు చేశారు. దీంతో ఆరోగ్యశ్రీతో సమానంగా ఉద్యోగుల ఆరోగ్య పథకంలోనూ ఆయా క్యాన్సర్ చికిత్సలు ఎలాంటి అంతరాయం లేకుండా ఉద్యోగులకు అందే అవకాశం ఉంటుంది. దీంతో ఉద్యోగులకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు. ఇప్పటికే ఉద్యోగులు ఈహెచ్ఎస్ విషయంలో పలు మార్లు చర్చల్లో ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "YS Jagan is another good news for AP government employees."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0