4,200 teachers who lost promotions
పదోన్నతులు కోల్పోయిన 4,200 మంది ఉపాధ్యాయులు
- మొన్న బదిలీలు.ఇప్పుడు పదోన్నతుల ఉత్తర్వుల రద్దు
- పాఠశాల విద్యాశాఖలో అంత రివర్స్
పాఠశాల విద్యాశాఖలో అన్నీ రద్దులే కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఉపాధ్యాయ బదిలీల ఉత్తర్వులను ఉపసంహరించుకున్న అధికారులు.. మంగళవారంనాడు పదోన్నతులనూ రద్దు చేశారు. విద్యాశాఖలో హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం ఆ తర్వాత రివర్స్ చేయడం సహజంగా మారింది. 2022-23 విద్యాసంవత్సరం మొత్తం నిర్ణయాలు తీసుకోవడం..ఆ తర్వాత వాటిని వెనక్కి తీసుకోవడమే కొనసాగింది.రాష్ట్రంలో సుమారు 4,200 మంది ఉపాధ్యాయులకు ఇచ్చిన పదోన్నతులను విద్యాశాఖ రద్దు చేసింది. గతేడాది ఆగస్టులో సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ)నుంచి స్కూల్ అసిస్టెంట్లు, స్కూల్ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయులు గ్రేడ్-2గా పదోన్నతులు కల్పించారు.ఆ తర్వాత వీరికి ఖాళీల్లో సర్దుబాటుగా పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇప్పుడు ఈ వేసవి సెలవుల్లో వీటిని రద్దు చేశారు. ఇందుకు సంబంధించి న్యాయస్థానంలో ఉన్న కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.యాజమాన్యాల వారీగా విద్యాసంవత్సరం ప్రారంభంలో తాత్కాలిక పదోన్నతులు కల్పించారు. వాటన్నింటినీ రద్దు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. విద్యాశాఖ మాత్రం పదోన్నతులు రద్దైనా ఉపాధ్యాయులు వెనక్కి రావాల్సిన అవసరం లేదని చెబుతోంది. అయితే పదోన్నతుల ఉత్తర్వులే రద్దైతే అవి ఏవిధంగా ఉంటాయో ఉన్నతాధికారులకే తెలియాలనే మాట వినిపిస్తోంది.
0 Response to "4,200 teachers who lost promotions"
Post a Comment