Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

A planet like Earth.. Discovered by NASA.. Are aliens living there?

 భూమి లాంటి గ్రహం.కనిపెట్టిన NASA.. అక్కడ ఏలియన్స్ జీవిస్తున్నారా?

A planet like Earth.. Discovered by NASA.. Are aliens living there?

అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ (NASA) 

రికొత్త గ్రహాన్ని కనిపెట్టింది. ఆ Girls భూమి లక్షణాల (Earth-size exoplanet)తో ఉంది. భూమి కంటే కొద్దిగా పెద్దగా ఉంది. నిండా అగ్ని పర్వతాలతో ఉంది. అది మన సౌర వ్యవస్థకు అవతల ఉంది. దానికి శాస్త్రవేత్తలు LP 791-18 d అనే పేరు పెట్టారు. ఈ గ్రహంపై తరచూ అగ్ని పర్వతాలు పేలుతూ ఉండొచ్చని నాసా అంచనా వేసింది. (Image credit - www.nasa.gov)

నాసాకి చెందిన ట్రాన్సిటింగ్ ఎగ్జోప్లానెట్ సర్వే శాటిలైట్ (TESS) ద్వారా ఈ కొత్త గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. రిటైర్ అయిన స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ సాయం కూడా తీసుకున్నారు. అలాగే.. భూమిపై ఉన్న కొన్ని అబ్జర్వేటరీలు కూడా ఇందుకు ఉపయోగపడ్డాయి. (Image credit - twitter - @iishmalkhan)

ఈ గ్రహానికి సంబంధించిన వివరాలను.. సైంటిఫిక్ జర్నల్ నేచర్‌లో మే 17న ప్రచురించారు. ఈ గ్రహంపై అగ్నిపర్వతాలతోపాటూ.. నీరు కూడా ఉన్నట్లు కనిపిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. (Image credit - twitter - SergioMartinGu3)


ఈ గ్రహం భూమికి.. 90 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. బహుశా ఈ గ్రహం లోపల మండుతూ ఉండొచ్చనే అంచనా వేశారు. మన సౌర వ్యవస్థలో గురుగ్రహ ఉపగ్రహమైన Io కూడా ఇదే విధంగా అగ్నిపర్వత పేలుళ్లతో ఉంది. 

ఈ గ్రహం.. ఓ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. ఈ కొత్త గ్రహం మన భూమి కంటే కొద్దిగా ఎక్కువ వేడిగా ఉంటుంది అంటున్నారు. దీనికి ఎప్పుడూ ఒకేవైపు వేడి, ఎండ పడుతున్నాయనీ, రెండోవైపు ఎలా ఉందో తెలియట్లేదని తెలిపారు. రెండోవైపు ప్రాంతంలో అగ్ని పర్వతాలతోపాటూ... నీరు ఉండొచ్చనే అంచనా వేశారు.

ఆ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ మరో 2 గ్రహాలు కూడా తిరుగుతున్నాయి. ఈ కొత్త గ్రహం.. తన సూర్యుడి నుంచి ఉన్న దూరం మరీ ఎక్కువ వేడి, మరీ ఎక్కువ చల్లదనం లేకుండా ఉంది. అందువల్ల దీనిపై జీవించే అవకాశాలు ఉంటాయనే అంచనా ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "A planet like Earth.. Discovered by NASA.. Are aliens living there?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0