Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Day - 19 : Students Summer Holidays Activities

 Day - 19 : Students Summer Holidays Activities

Day6: Students Summer Holidays Activities

Students Summer Holidays Activities -  - Summer vacation- summer activities

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు  వేస
వి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:19 Activities

Class: 1,2

19 వ రోజు 

To develop motor skills

Q) Prepare lemon juice and serve your family members .

తెలుగు:

Q) అక్షరాలలో తేడాను గుర్తిస్తూ కింది పదాలను చదవండి. రాయండి.

కుండ - కూజా
తుపాకీ - తూనీగ
బురద - బూడిద
గుడి - గూడు
రుచి - రూపాయి

English:

Q) Learn and write ' J ' words.

Jug          🏺 

Jar           🫙

Joker       🃏  
  
Juice       🧃

Jacket     🧥

Maths:

Q) Write the Short form.

10 + 0 = 10
10 + 1 = 11
10 + 2 = 12 
10 + 3 = .....
10 + 4 = .....
10 + 5 = .....
10 + 6 = .....
10 + 7 = .....
10 + 8 = .....
10 + 9 = .....
20 + 0 = .....

ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు

Big =పెద్ద, గొప్ప

Even =నున్నని

Such =వంటి విధమైన

Because =కారణముచేత

Turn =వెనుకకు తిరుగు

Here =ఇక్కడ

Why =ఎందుకు

Ask =అడుగు

Went = వెళ్ళెను.

Men =మగవారు

Read =చదువుట

Need = ఆవసరం.

Land = భూమి.

Different = రకరకాలైన.

Home = ఇల్లు.


Class :3,4,5
19వ రోజు 

Q) చీమ మరియు పావురం  కథను చదువుతూ మీ నోటు పుస్తకం లో రాయండి.

Q) Read and write the story 'An Ant  And The Dove' in your note book.


💎నేటి ఆణిముత్యం

అందముగ నుండు పుష్పాల యందు సౌర
భమ్ము లేమియు లేకున్న వ్యర్ధమౌను;
క్రియల శూన్యపు మాటలు కేవలమ్ము
ఇంపుగా నుండు వినుటకే యేరికైన

భావము:  పుష్పాలెంత అందంగా ఉన్నా సువాసన లేకుంటే వాటి ఉపయోగం లేదు. క్రియా శూన్యపు మాటలు వినటానికి మాత్రమే ఇంపుగా ఉంటాయి.

🤘నేటి సుభాషితం

అన్నదానం ఆకలిని తీర్చగలుగుతుంది.అక్షరదానం అజ్ఞానాన్ని తొలగించ గలుగుతుంది.

👬 నేటి చిన్నారి గీతం

గడియారం - గడియారం

గడియారం - గడియారం
గంటలు కొట్టె గడియారం
కాలాన్ని కొలిచే గడియారం
పొద్దుట లేపే గడియారం
బడికి పంపే గడియారం
చదువులు నేర్పే గడియారం
మంచి మార్కులు తెప్పించే గడియారం
అనా అక్కకు కావాలి గడియారం
నాకూ కావాలి గడియారం
గణ గణ గంటలు కొట్టె గడియారం
నీకూ నాకూ కావాలి గడియారం
గడియారం! గడియారం!
మా మంచి గడియారం!!

🤠 నేటి సామెత 

లంక మేత గోదారి ఈతకు సరి పోయింది
గోదావరి గట్టున వుండే పల్లెల లోని గేదెలు నది మధ్యలో వుండే లంకలలోని ఏపుగా పెరిగిన పచ్చ గడ్డిని మేయడానికి అంత దూరం గోదావరి ఈదు కుంటూ వెళ్లి బాగా మేసి తిరిగి గోదారిని ఈదు కుంటూ ఇంటికి వస్తాయి. ఆ పచ్చ గడ్డిని మేయగా వచ్చిన శక్తి గోదారిని ఈదడానికి సరిపోతుంది. పలితమేముంది. ఆ సందర్భంగా పుట్టిందే ఈ సామెత. ఫలితం లేని పని చేసే వారిని గురించి ఈ సామెత చెప్తారు.

🗣నేటి జాతీయం

ఈనిన పులి

అదుపు లేని ఆగ్రహంతో తన, మన చూసుకోకుండా ప్రవర్తించటం.పులి తాను ఈనిన పిల్లల్ని కూడా తినేస్తుందట.

🎯DAY-19🎯

📒WE LOVE READING📒

🌊A Pit Brimmed with Water

💁‍♀️Long ago, a pond was dug by a very affluent king and it was announced that one person from each household would have to bring a glass of milk during the night and pour it into the pond. So, the pond should be full of milk by the morning.

After receiving the order, everybody went home. One of the denizens of the kingdom made up his mind to take milk but after pondering for a while he thought, "Since everyone will bring milk, I could pour water in place of milk because it would be hard to see in the twilight." He quickly poured the water and came back.

In the morning the king was astonished to see the pond filled with water only. It so happened that everyone thought like the denizen, "I will not pour the milk; someone else will do."

🔮Moral: Don't neglect your duty.

✍🏼 నేటి కథ 

సాయం చేసిన సాయం!

నెమళ్లపాలెంలోని అరుంధతమ్మకు శివయ్య ఒక్కడే కొడుకు. వాడు ఏదైనా పని సంపాదించి అమ్మను కంటికిరెప్పలా చూసుకోవాలని కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. ఒకరోజు దానవులపాడులోని జమీందారు తన దగ్గర కొలువు కోసం చాటింపు వేయించాడని తెలిసి వెళ్లాడు. అక్కడ జమీందారు, ఆయన భార్య వసుంధర వచ్చిన వారికి కొన్ని రకాల పరీక్షలు పెట్టారు. వాటిలో నలుగురు ఎంపికయ్యారు. వారి ఊరిపేరు, అమ్మానాన్నల గురించిన వ్యక్తిగత వివరాలు అడిగారు. మా మనుషులు మీ ఊరికొచ్చి మీ వ్యక్తిత్వం గురించి విచారిస్తారు. తర్వాత కొలువులో చేరడానికి మీకు కబురందుతుందని చెప్పి పంపారు.
శివయ్య ఊరికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయమే అరుంధతమ్మ ఇంటి ముందు గుర్రపుబగ్గీ ఆగింది. ఓ యువతి దిగి ఇంట్లోకొచ్చింది. ఆమెను చూసి శివయ్య ఆశ్చర్యపడ్డాడు. ఆమె జమీందారు భార్య వసుంధర. ఆమె అరుంధతమ్మ దగ్గర కూర్చుని ‘అమ్మా! నన్ను గుర్తుపట్టావా?’ అంది. అరుంధతమ్మ ఆమెను పరిశీలనగా చూసి ‘నువ్వు వసుంధరవు కదూ! మీ అమ్మ సరోజ ఎలా ఉంది?’ అని అడిగింది.
ఒకప్పుడు అరుంధతమ్మ, సరోజ ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. అరుంధతమ్మ భర్త చిన్న కొలువులో ఉండేవాడు. సరోజమ్మ భర్త పాముకాటుతో చనిపోయాడు. ఆమెకు వసుంధర అనే కూతురు ఉండేది. సరోజ కూలి పనికి వెళ్లేది. ఒకసారి వసుంధరకు తీవ్రమైన జబ్బు చేసింది. వైద్యుడిని సంప్రదిస్తే ఆరునెలలు మందులు వాడాలని చికిత్సకయ్యే ఖర్చు గురించి చెప్పాడు. ఆలస్యం చేస్తే ప్రాణం దక్కదన్నాడు.
అంత డబ్బు ఆమె దగ్గర లేకపోవడంతో ఏం చేయాలో తోచక బాధపడసాగింది. విషయం తెలుసుకున్న అరుంధతమ్మ తాను ఎంతోకాలం నుంచి పొదుపు చేసుకున్న డబ్బును ఇచ్చి ఆదుకుంది. వసుంధరను కాపాడింది.
ఆమె మంచితనం, దయాగుణానికి తల్లీకూతురు చేతులెత్తి నమస్కరించారు. జరిగిపోయిన సంగతులు గుర్తు చేసుకుంటూ.. తర్వాత జరిగిన విషయాలు చెప్పింది వసుంధర. ఆ రోజు నుంచి వసుంధరకు వైద్యం నేర్చుకోవాలనే పట్టుదల కలిగింది. పేదవాళ్లెవరూ తమలాగా ఇబ్బంది పడకుండా వారికి ఉచిత వైద్యం అందించాలని మనసులో ఆశయం ఏర్పడింది. అమ్మతో వెళ్లి చాలా మంది వైద్యులను కలిసింది. చివరకు దానవులపాడులో ఉన్న వైద్యుడు నీలకంఠయ్య ఆ అమ్మాయికి వైద్యవిద్యను నేర్పడానికి ఒప్పుకొన్నాడు.
వసుంధర చాలా కష్టపడి నీలకంఠయ్య దగ్గర వైద్యం నేర్చుకుంది. సంతానంలేని ఆయన తన వైద్యశాలను శిష్యురాలైన వసుంధరకు అప్పజెప్పి కన్నుమూశాడు. తక్కువ సమయంలో ఆమె మంచివైద్యురాలిగా పేరు తెచ్చుకుంది. ఒకసారి దానవులపాడు జమీందారు కొడుకు అనారోగ్యంతో వసుంధర దగ్గర కొంతకాలం చికిత్స పొందాడు. ఆమె సేవాభావం, మంచితనానికి ముచ్చటపడ్డాడు. నాన్నను ఒప్పించి వసుంధరను వివాహమాడాడు. పెళ్లి తర్వాత ఆమె తన వైద్యసేవలను మరింత మందికి చేరువయ్యేలా చేసింది. ఈ విషయాలన్నీ అరుంధతమ్మ, శివయ్యకు వివరించి చెప్పింది వసుంధర.
‘అమ్మా! మేము ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఆపదలో ఆదుకున్నారు. పని కోసం వచ్చిన శివయ్యను గుర్తుపట్టాను. ఉన్నత కొలువుకు ఎంపిక చేశాం. అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది. మీరు ఉండటానికి అన్ని ఏర్పాట్లూ చేశాం’ అని చెప్పింది వసుంధర. అరుంధతమ్మ కళ్లలో ఆనందభాష్పాలు తిరిగాయి.

తెలుసు కుందాం
🟥పిడుగు పడటం అంటే ఏమిటి ? , What is thunderbolt fall on a rainy day?⚡
పిడుగు అనేది విద్యుత్ శక్తి . పైనున్న మేఘాలు దుమ్ము , ధూళి , నీటీఅవిరితో నిండి ఉంటాయి . అవి ఒకదానితో ఒకటి వేగంగా ధీకొన్నప్పుడు విద్యుత్ పుడుతుంది . ఆ విద్యుత్ వల్ల చుట్టు ఉన్న గాలి హఠాత్తుగా వేడెక్కి వ్యాకోచిస్తుంది . అలా వ్యాకోచించిన గాలి చల్లటి గాలని బలం గా తాకినపుడు ఉరిమిన శబ్దము విడుదల అవుతుంది . అదే సమయము లో ఆ విద్యుత్ భూమిపైన మొనదేలిన కొనలు , ఎత్తయిన ప్రదేశాలపై వదలబడుతుంది . దీనినే పిడుగు పడటం అంటారు .


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Day - 19 : Students Summer Holidays Activities"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0