Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Day - 21 : Students Summer Holidays Activities

 Day - 21 : Students Summer Holidays Activities

Day6: Students Summer Holidays Activities

Students Summer Holidays Activities -  - Summer vacation- summer activities

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు  వేస
వి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:21 Activities

ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు

Keep = ఉంచు.

Tree = చెట్టు.

Never =ఎప్పుడునూ లేని.

Start = మొదలు పెట్టు.

City = నగరము.

Earth = భూమి.

Eye =కన్ను

Light =కాంతి

Thought =ఆలోచన

Head =తల

Under =క్రింద

Story =కథ

Saw =రంపము

Left =ఎడమ ప్రక్క

Don’t =కాదు

Class :3,4,5
21 వ రోజు 
Q) ఒక చీము మరియు పావురం కథను మీ సొంత మాటల్లో మీ నోటు పుస్తకం లో రాసి గ్రూప్ లో పోస్ట్ చేయండి.
Q ) Wrire the Story  'The Ant and the Dove ' in your own words in your note book and post in the group.💎నేటి ఆణిముత్యం
హానినిజప్రబుద్ధి తిరమైనవిధంబున బెట్టుబుద్ధులా
వేళలకంతెకాని మరివెన్కకు నిల్వవు హేమకాంతి యె
న్నాళుల కుండు గానియొకనాడు పదంపడి సానబట్టినన్
దాళియు నుండునే యినుపతాటక జాయలుపోక భాస్కరా

భావం:

ఎవరికైనా స్వంతబుద్ధి బంగారుకాంతివలె నిలుచును.పరులుచెప్పినబుద్ధి సానబట్టిన ఇనుము తళుకువలె తాత్కాలికము.

🤘నేటి సుభాషితం

చదువుకుని నేర్చుకున్న అక్షరం
కష్టపడి నేర్చుకున్న పని
జీవితంలో నిన్ను ఎప్పటికైనా
ఉన్నత స్థితికి చేరుస్తాయి

👬 నేటి చిన్నారి గీతం

చెమ్మచెక్క

చెమ్మ చెక్క ఆడుదమా!
చేతులు రెండు కలుపుదమా!
చప్పట్లోయ్ తాళాలోయ్
అంటు పాడుదమా!
దేవునికి దాండాలు పెట్టెదమా!
కాళ్ల గజ్జె ఆడుదమా!
కాళ్ళు రెండు చాచుదమా!
ఒప్పులకుప్ప ఆడుదమా!
ఒయ్యారంగా తిరుగుదమా!
దాగుడుమూతలు ఆడుదమా!
కళ్ళకు గంతలు కట్టుదమా!
బొమ్మలపెళ్ళి చేద్దామా!
తూతూబాకా లూదుదమా!
పప్పు బెల్లాం కమ్మగ తిందామా!!
చెమ్మ చెక్క ఆడుదమా! చేతులు రెండు కలుపుదమా!!!

🗣నేటి జాతీయం

అందని గోచి, చీకుల మొలతాడు

తీవ్ర స్థాయిలో దరిద్రం, ధనలేమి. వస్త్రధారణ, గోచీ స్థాయికి వచ్చిందంటేనే అది దరిద్రానికి చిహ్నం. పోనీ ఆ గోచి అన్నా సరిపోయినంతగా లేదట. ఎలాగో ఒకలాగా సర్దుకుందామన్నా మొలతాడూ చివికి చివికి ఉందట.
నేటి సామెత 

రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు

ఎవరైనా తాము తినాలనుకున్న రొట్టె తనంతట తాను విరిగి నేతిలో పడితే దాని రుచి పెరుగుతుంది, దన్ని త్రుంచే శ్రమ తప్పుతుంది. అదే విధంగా అనుకున్న పని వేరొక సంఘటన వలన మనకు సౌకర్యంగాను, సులభతరంగాను మారితే ఈ సామెతను వాడుతారు.

✍🏼 నేటి కథ 

కాకి కొంగ

తగ్గుపర్తి అనే గ్రామ శివార్లలో ఒక పంటకాలువ వుంది. కాలువ ఇరుపక్కలా వరిపొలాలు, కాలువగట్టు వెంబడీ మామిడి, సపోటా, అరటి వంటి చెట్లతో చిత్రకారుని చిత్రంలా ఉంటొంది ఆప్రదేశమంతా. ఆచెట్ల మధ్య ఉన్న గున్నమామిడి చెట్టుమీద ఒక కాకి దాని సంతానంతో కాపురముంటోంది. ఆకిందనేఉన్న కాలువగట్టునే ఓ కొంగల జంట తమ పిల్లతో నివాసముండేవి. రోజూ పైనించి కాకిపిల్లలు తెల్లగా అందంగా కనిపిస్తున్న బాతు పిల్లనిచూసి తెగ ముచ్చట పడుతూండేవి."అమ్మా చూడవే ఆబాతుపిల్ల ఎంత అందంగా ఉందో?" చందమామ రంగు, ఎర్రనిముక్కూ బుల్లి బుల్లి రెక్కలు, వాటితో అది టపటప నీళ్ళమీద కొట్టుకుంటూ తిరుగుతోంటే ఎంత బాగుందో?మరి మనమెందుకమ్మ ఇంతనల్లగా ఉన్నాము? అందరూ చీదరించుకునేలా" అంటూ ఉండేవి. వాటిమాటలకి తల్లికాకి"భగవంతుని సృస్టి లో రకరకాల రంగుల పక్షులు ఉన్నాయికదా. మనది ఈరంగుమరి. ఐనా రంగుదేముందమ్మా మనసు తెల్లనిదైఉండాలిగాని"అంటూ సుద్దులు చెప్పేది. తల్లిమాటలు సరిగా అర్ధం కాక తికమకపడుతూ ఉండేవి. దానికిసాయం కొంగపిల్లతో అమాటకలపడానికి ఎంత ప్రయత్నించిన అది ముఖం తిప్పుకునేది.

ఒకరోజు పెద్దకొంగలు లేని సమయంలో పిల్లకొంగ ఎగరడానికి ప్రయత్నిస్తూ నాచుపట్టిన నాపరాయి మీదకాలువేసి దబ్బున జారిపడింది. కుయ్యో మొర్రోమంటూ అరవసాగింది. దాని అరుపులకి పైనగూట్లోంచి కాకిపిల్లలు తొంగిచూసాయి. కొంగపిల్ల నొప్పితో విలవిల్లాడుతూ పైన ఎగురుతున్న కొంగలబారుని రక్షింపమని అరుస్తోంది. అవి దీని అరుపులని పట్టించుకోకుండానే వెళ్ళిపోయాయి. కాకిపిల్లలకి కొంగబావని చూస్తే జాలేసింది. అవి ఒక్కసారిగా కావు కావు మంటూ తమ బంధువులందరి పిలిచి విషయం చెప్పాయి. కాకులన్నీ కలసి కొంగపిల్లని జాగ్రత్తగా గట్టుకు చేర్చి అక్కడి ఆకులని ముక్కులతో తెంపి కొంగకాలుకి మందు రాసి, దానికికాస్త తిండిపెట్టి పెద్దకొంగలు వచ్చే వవరకూ వుండి అప్పగించి వెళ్ళాయి.

మరునాడు కొంగపిల్ల కోలుకుని కాకిపిల్లలతో"నిన్నమీరునాకు చాలా సాయం చేసారు.అందమైనదాన్నని ఇన్నాళ్ళూ గర్వపడ్డాను.కాని సాయం చేసే గుణమే అందమైనదని తెలుసుకొన్నాను.మరి నాతో స్నేహం చెస్తారా?అని జాలిగా అడిగింది.కాకిపిల్లలు ఆనందంగా సరేనన్నాయి. అప్పుడే వాటికి వాళ్ళమ్మ మాటలు అర్ధమవసాగాయి.
తెలుసు కుందాం

ఏడుపు (కన్నీరు)వచ్చేదాకా నవ్వుతారెందుకు ?(Why do people laugh until they get tear?)

🟩ఏడుపు (కన్నీరు ) వచ్చేదాకా నవ్వుతారు ఎందుకు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ . నవ్వినా , ఏడ్చినా కన్నీరు వస్తుంది . నవ్వు ... ఏడ్పూ రెండూ కూడా సైకలాజికల్ చర్యలే . ఎమోషన్‌ కు లోనైనప్పుడే రెండూ అనుభవిస్తాము . ఆ సమయములో కార్టిసాల్ , ఎడ్రినాలిన్‌ బాగా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి . సుఖ దు:ఖాలలో అత్యున్నత స్థాయికి చేరితే కన్నీళ్ళు పర్వంతం అవుతుంది . ఈ రెండు అవస్థలలోనూ స్ట్రెస్ తగ్గుతుంది . మనసు ప్రశాంతము తయారవుతుంది . భారము తగ్గుతుంది . అందువల్ల ఈ విషయము మనిషి ఆరో్గ్యానికి మరింత అనుకూలమైనదిగా బావించవచ్చు .

కన్నీరు మూడు రకాలు అంటున్నారు - కనీసం ఏడుపు మూడు రకాలు! కన్నీరు కంటిలో వెలుపలి, పై మూలలో తయారవుతుంది. అది బయటికి రావడం మాత్రం లోపలి కింద మూలనుంచి జరుగుతుంది. అంటే కన్నీరు మొత్తం కంటిలో పరుచుకుంటుందని అర్థం. మిల్లి మీటరులో మూడవ వంతు మందం ఉండే ‘పంక్టా’ అనే గొట్టాలు నీటిని ముక్కులోకి, నోట్లో గొంతు మొదట్లోకి కూడా పంపుతాయి. అందుకే ఏడ్చిన తర్వాత నోట్లో కూడా రుచి మారిన భావం కలుగుతుంది. కనుబొమ్మలు కదిలినందుకు నీరు కన్ను అంతటా పరచుకుంటుంది. కన్ను ఆర్పడానికి 0.2 నుంచి 0.3 సెకండ్ల కాలం పడుతుంది. ప్రతి రెండు నుంచి పది సెకండ్ల కొకసారి, మనం, కళ్ళు ఆర్పుతాము. కొంతమంది ఎక్కువగానూ, ఎక్కువ సేపూ కళ్ళార్పుతుంటారు. అలాంటి వారు, జీవిత కాలంలో ఏడు సంవత్సరాలు అదనంగా (నిద్ర కాక) కళ్ళు మూసుకుని బతుకుతారని లెక్క తేలింది.
కన్నీటిలో మూడు రకాల ద్రవాలుంటాయి. అవి మూడు వేరువేరు గ్రంధులలో తయారవుతాయి. మొదటిది తెల్లగుడ్డలో పుట్టే జిగురు ద్రవం. అది కనుగుడ్డు మీద సమంగా అంతటా పరుచుకునే ద్రవం.
రెండవ పొర నీళ్లుగా ఉంటుంది. ఇది లాక్రిమల్ గ్రంధులలో తయారవుతుంది ఇందులో రకరకాల ప్రొటీన్లు, ఆంటి బయోటిక్స్, ఖనిజ లవణాలు ఉంటాయంటే ఆశ్చర్యం కదూ! ఈ కంటినీరు, కనుగుడ్లను సూక్ష్మ జీవుల నుండి కాపాడి వేడిని నియంత్రించి, ఉప్పుదనాన్ని అందించి, రకరకాలుగా సాయపడుతుంది. ఇక కనుబొమ్మల చివరన ఉండే మైలోమియన్ గ్రంధుల నుంచి కొవ్వుతో వచ్చేది మూడవ పొర. ఈ పొర లేకుంటే కన్నీరు వెంటనే కారిపోతుంది. ఆరిపోతుంది కూడా! కన్నీళ్ళకు
మూడు రకాల ద్రవాలున్నట్లే ఏడుపు కూడా మూడు రకాలు, దుమ్ముపడితే వచ్చేవి ఒక రకం. కాంతి, పొగలాంటి వాటి కారణంగా ఏడుపు మరో రకం, భావోద్వేగంతో నవ్వినా, ఏడ్చినా వచ్చేవి మూడవరకం! ఇదీ కన్నీటి గాధ!

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Day - 21 : Students Summer Holidays Activities"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0