Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Day - 25 : Students Summer Holidays Activities

 Day - 25 : Students Summer Holidays Activities

Day6: Students Summer Holidays Activities

 Summer Holidays Activities -  - Summer vacation- summer activities

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు  వేస
వి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:25 Activities
Class: 1,2

25 వ రోజు 
To develop drawing and classification skills

Q) Different Fruits ( పండ్లు ) , Vegetables ( కూరగాయలు ) ను మీ డ్రాయింగ్ బుక్ లో  Draw చేసి colour వేయండి. గ్రూప్ లో పోస్ట్ చేయండి.

తెలుగు:

Q) సరైన పదాలతో ఖాళీలను పూరించండి.

( తీపి, ఆకుకూరలు, మందార, గుడి )

1. ........... పూలు అందంగా ఉంటాయి.
2. చెరకు గడ .............
3. మనం ........... తినాలి.
4. కాకి ........... మీద ఉంది.

English:

Q) Write the missing letters.

L i - n        🦁

L - m p      🪔

L o - k        🔒

L - p s         👄

L a - d e r     🪜

Maths:

Q) Write the Short form.

10 + 5 = .........
60 + 9 = .........
80 + 0 = .........
600 + 50 + 3 = ..........
700 + 0 + 9 = ...........

ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు

Second = రెండవ.

Later = తరువాత.

Miss = గురితప్పు,పెండ్లికాని యువతి.

Body = శరీరము, ఏదేని విషయము.

Music = సంగీతము.

Colour = రంగు.

Stand = నిలబడు.

Sun =సూర్యుడు.

Questions = ప్రశ్నలు.

Fish = చేప.

Area = ప్రాంతము, వైశాల్యము.

Mark =గుర్తు, చిహ్నం, అంశం.

Dog =కుక్క.

Horse =గుర్రం.

Birds =పక్షులు.
🤘నేటి సుభాషితం
ప్రేమ గొప్పదే కాని స్నేహం అంతకంటే గొప్పది. స్నేహం ఆనందాన్ని పెంచుతుంది. విచారాన్ని పంచుతుంది(తెంచుతుంది).

👬 నేటి చిన్నారి గీతం 

పిల్లలకే పెత్తనమిస్తే...
                   
పిల్లలకే మా పిల్లలకే
పెత్తనమంతా ఇచ్చేస్తే
పిల్లలమంతా పెద్దలమై
దేశాలన్నీ ఏలేస్తాం
మంత్రులము మేమైతే
తీర్మానాలు చేసేస్తాం
అమలు చేసేస్తాం
లంచాలన్నీ ఎగరగొట్టేస్తాం
అన్యాయాలు అరికట్టేస్తాం
అధికారులము మేమైతే
నిరుద్యోగసమస్యను తరిమేస్తాం
ధరలను అదుపున పెట్టేస్తాం
దేశం సుభిక్షం చేసేస్తాం !పప్

🤠 నేటి సామెత 

వడ్డించే వాడు మనవాడైతే వెనక బంతిలో కూర్చున్నా ఫరవాలేదు

భోజనాలకు బంతిలో కూర్చున్నప్పుడు మొదటగా వున్నావారికి అన్ని పదార్థాలు వడ్డిస్తారు. చివరకు వచ్చేసరికి కొన్ని పదార్థాలు అయిపోవచ్చు. ఆ కారణంగా చివర బంతిలో కూర్చున్న వారుకి అన్ని భోజన పదార్థాలు అందక పోవచ్చు. కాని వడ్డించే వాడు మన వాడైతే మనం చివరన లేదా వెనకగా కూర్చున్నా మన కోసమని మనవాడైన వడ్డించే వాడు మన వద్దకు వచ్చి కావలసిన పదార్థములను వడ్డిస్తాడస్ని అర్థము.

🗣నేటి జాతీయం

ఉడకేసుకొని తిని...తడికేసుకొని పడుకున్నట్టు

పని ఒత్తిడేమీ లేకుండా సాఫీగా కాలం సాగిపోవటం హాయిగా కావాల్సింది వండుకుని తినటం, చక్కగా నిద్రపోవటం
🎯DAY-25🎯

📒WE LOVE READING📒

🐀The Hungry Mouse🐀

💁‍♀️A mouse was having a very thought time. She had no food for many days and made strenuous efforts get her food. All her efforts went in vain. She looked everywhere to find her food. As the days pass by, she became very thin.

One day, the mouse found a basket with corns. She also noticed a tiny hole in the bas- ket, which was sufficient enough to move her in. She easi- ly moved inside the hole.
Since she had no foods for many days, she ate a large amount of corn. Without realizing her, she continuously ate more and more corns. She realized very later that she ate a lot more than she actually required. After eating a whole lot of corn, she became very fat!

Satisfied with corns, the fat mouse tried to come out of the basket through the small hole. Unfortunately, the tiny hole could not accommodate the big mouse!!!!

The mouse started screaming 'Oh god! Let me come out, how can I come out?'

A rat after hearing mouse's screaming voice from the basket, asked her what happened!

Mouse told the story and asked rat a solution. Rat told, 'if you want to come out the basket, wait for sometime or even days to lose your all your fat until you grow thin.'

Mouse started to starve now but with lots of food to come out of the trap!

🔮Moral: Anything too much is good for nothing!

✍🏼 నేటి కథ 

కలిసి ఉంటే

రంగాపురం గ్రామం లో చలపతి అనే ఓ వ్యాపారి ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. ముగ్గురు చాలా తెలివైన వాళ్ళు.

పట్టణానికి వెళ్ళి చౌకగా సరుకుల్ని కొని తేవడం లో మొదటివాడు దిట్ట. రెండో వాడు ఆ సరుకులను చుట్టుప్రక్కల గ్రామాల్లో తిరిగి ఎక్కువ లాభాలను అమ్మగల సమర్ధుడు. ఇక మూడో వాడు లాభనష్టాలను అంచనా వేస్తూ అన్నలకి సలహాలిచ్చేవాడు. కొడుకుల సహాయంతో చలపతి వ్యాపారం రెండింతలైంది.

ముగ్గురికి వివాహాలు చేశాడు చలపతి. అందరూ ఒకే ఇంట్లోనే ఉండేవారు. కొన్నాళ్ళు గడిచాక ఆ కుటుంబసభ్యుల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి.

'నావల్లే వ్యాపారం పెద్దదైంది' అని ఒకరంటే 'కాదు నా సలహాతోనే ఇంత సంపాదించామంటూ మరొకరు.. ఇలా ముగ్గురు కొడుకులూ వాదులాడుకోవటం ప్రారంభించారు.
ఈ పరిస్ధితిని గమనించిన చలపతి ఆస్తిని ముగ్గురు కొడుకులకీ పంచేశాడు.ముగ్గురు ఎవరికి వారు సొంత వ్యాపారాలు ప్రారంభించుకున్నారు. పెద్దవాడు సరుకుల్ని తక్కువ ధరకే కొనేవాడు, కానీ గ్రామాల్లో తిరిగి అమ్మే నైపుణ్యం తెలియక ఇబ్బందిపడ్డాడు.

రెండో వాడికి పట్టణం వెళ్ళి సరుకులు ఎలా కొనాలో తెలియదు. ఇక ఎప్పుడు సలహాలిస్తూ ఇంటి దగ్గర ఉండే మూడోవాడికి సరుకులు కొనాలన్నా, అమ్మాలన్నా కష్టంగానే తోచింది.

కొద్దిరోజులకే ముగ్గురి వ్యాపారాలు దివాలా తీశాయి. అప్పులపాలయ్యారు. సిగ్గుతో తల వంచుకొని తండ్రి వద్దకు వచ్చారు. 'చూశారుగా ఏంజరిగిందో. ముగ్గురూ కలిసిమెలిసి ఉన్నంతకాలం వ్యాపారం పచ్చగా వుండేది. విడిపోయి ఎవరికివారు అనుకునేసరికి అన్నీ నష్టాలే వచ్చాయి. కలిసి ఉంటే కలదు సుఖమని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఇకనైనా అందరూ కలిసి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండీ' అన్నాడు చలపతి.
తమవల్ల జరిగిన తప్పును తెలుసుకున్న ముగ్గురు అన్నదమ్ములూ మళ్ళీ ఒకటయ్యారు. ఐకమత్యంగా ఉంటూ వ్యాపారాన్ని లాభాల బాట పట్టించారు. 

తెలుసు కుందాం

🐍విషపూరితమైన పాము కాటేస్తే వేరే పాము చనిపోతుందా?

🟩విషపూరితమైన పాము కోరలకు అనుసంధానంగా విషగ్రంథులు ఉంటాయి. పాము కాటేసినప్పుడు ఆ గ్రంథులలో ద్రవరూపంలో ఉండే విషం, కోరల గుండా ప్రవహించి బయటకి వస్తుంది. కోరలు చేసిన గాయం ద్వారా కాటుకు గురైన జీవి దేహంలోకి ప్రవేశిస్తుంది. ఆ విషం ఆ జీవి రక్తంలో కలిస్తే అది చనిపోయే అవకాశం ఉంటుంది. అది మరో పామైనా సరే. చనిపోవడం అనేది విషం మోతాదుపై ఆధారపడి ఉంటుంది. కొన్ని వ్యాధుల నివారణకు పాము విషాన్ని మందుగా వాడతారు. అప్పుడు ఆ విషం వ్యక్తి రక్తంలో కలవకుండా జీర్ణవ్యవస్థలో జీర్ణమవడంతో హాని జరగదు. కాటు వేసిన పాముకి కూడా ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఉంటాయి. పొటాషియం సైనైడ్‌ లాంటి విషపదార్థాలను సేవించి చనిపోయిన వ్యక్తి దేహాన్ని పాము కాటు వేస్తే దాని కోరల గుండా ఆ విషం దాని రక్తంలోకి ప్రవేశించి పాము చనిపోయే అవకాశం ఉంది. అలాగే డ్రగ్స్‌, మాదక ద్రవ్యాలను చాలా కాలంగా వాడే వ్యక్తి రక్తం కూడా విషపూరితమవుతుంది. అతడిని కాటేసినా పాముకే ప్రమాదం.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Day - 25 : Students Summer Holidays Activities"

Post a Comment