Day - 29 : Students Summer Holidays Activities
Day - 29 : Students Summer Holidays Activities
Summer Holidays Activities - - Summer vacation- summer activities
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు వేస
వి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:29 Activities
Class: 1,2
29 వ రోజు
Q) వివిధ రకాల Balloons / trees / flowers Shapes draw చేసి colour వేయండి.
తెలుగు:
Q) కింది అక్షరాలకు ఎత్వం, ఎత్వం దీర్ఘం చేర్చి రాయండి. చదవండి.
క, గ, చ, జ, ట, డ, త, ద, న, ప, బ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, క్ష
English:
Q) Learn and write ' O ' words.
Onion 🧅
Orange 🍊
One 1️⃣
Owl 🦉
October
Maths:
Q) Write the expanded form.
80 = 80 + 0
81 = 80 + 1
82 = 80 + 2
83 = .... + ......
84 = .... + ......
85 = .... + ......
86 = .... + ......
87 = .... + ......
88 = .... + ......
89 = .... + ......
90 = .... + ......
91 = .... + ......
92 = .... + ......
93 = .... + ......
94 = .... + ......
95 = .... + ......
96 = .... + ......
97 = .... + ......
98 = .... + ......
99 = .... + ......
100 = ...... + ...... + .......
ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు
Himself = తనకుతాను.
Toward = వైపునకు.
Five = ఐదు.
Step = అడుగు.
Morning = ఉదయము.
Passed = ఉత్తీర్ణుడయ్యెను.
Vowel =అచ్చు.
True =నిజము, సత్యము.
Hundred = వంద.
Against =వ్యతిరేకము.
Pattern = వరుసలు.
Numeral = నంఖ్యాత్మకమైన.
Table = బెంచి బల్ల.
North = ఉత్తర దిక్కు.
Slowly = నెమ్మదిగా.
Class :3,4,5
29వ రోజు
Q) సింహం మరియు ఎలుక కథ లోని కీలక పదాలను గుర్తించి ' సున్నా ' చుట్టండి. చదువుతూ 5 సార్లు మీ నోటు పుస్తకం లో రాయండి.
ఎలుక కథ లోని కీలక పదాలను గుర్తించి ' సున్నా ' చుట్టండి. చదువుతూ 5 సార్లు మీ నోటు పుస్తకం లో రాయండి.
Q) Identify and circle the key words in the story 'The Lion and The Mouse '. Read and write the key words 5 times in your note book.
💎నేటి ఆణిముత్యం
అహము నిండ, మంచి ఆలోచనలు రావు,
మనసు వికలమగును, మదము హెచ్చు;
తాను దూరమౌను, తనవారి నుండియే
ఏవగింపబడును, హీను డౌను
భావము : అహంభావికి మంచి ఆలోచనలు రావు. మనసు వికలమౌతుంది. మదం పెరుగుతుంది. తాను దూరమవుతూ తనవారి చేతనే అసహ్యింపబడి హీనుడౌతాడు.
🤘నేటి సుభాషితం
దుర్బలున్ని ఆశ్రయిస్తే లేని కస్టాలు తెచ్చిపెట్టుకున్నట్లు అవుతుంది.
🗣నేటి జాతీయం
ఉడకేసుకొని తిని...తడికేసుకొని పడుకున్నట్టు
పని ఒత్తిడేమీ లేకుండా సాఫీగా కాలం సాగిపోవటం హాయిగా కావాల్సింది వండుకుని తినటం, చక్కగా నిద్రపోవటం
👬 నేటి చిన్నారి గీతం
గుమ్మాడమ్మా గుమ్మాడీ
గుమ్మాడమ్మా గుమ్మాడీ
గుమ్మాడమ్మా గుమ్మాడీ !
అమ్మ ఒడిలో గుమ్మాడీ
అల్లరి చేసే గుమ్మాడీ !
నాన్న ఒడిలో గుమ్మాడీ
అందాల పాప గుమ్మాడీ !
మామ్మ ఒడిలో గుమ్మాడీ
మాటలు నేర్చే గుమ్మాడీ !
అక్క ఒడిలో గుమ్మాడీ
ఆటలు నేర్చే గుమ్మాడీ !
గురువుల చెంత గుమ్మాడీ
చదువులు నేర్చే గుమ్మాడీ !
చక్కని తెలివి గుమ్మాడీ
చుక్కల వెలుగు గుమ్మాడీ !
గుమ్మాడమ్మా గుమ్మాడీ
🤠 నేటి సామెత
వసుదేవుడంతటివాడే గాడిదకాళ్ళు పట్టుకున్నాడు
ఎంతటి వానికైనా ఒక్కోసారి కాల కలసి రాకపోతె చాల కష్టాలు పడవలసి వస్తుంది. ఈ సామెతలో అదే అర్థం వున్నది
Day-29 Class 3-5 We Love Reading: English Story: The King’s Painting
There was a king with only one leg and one eye but was generous and competent as a ruler. One day while walking in his palace, the king noticed the portraits of his ancestors along the hallway.
He also wanted his portrait painted by an artist but was unsure how it would turn out due to his physical abnormalities.
The King invited all the painters across the kingdoms and asked who could paint a beautiful picture of him.
The painters were confused about how to make a beautiful picture of the King with only one leg and one eye.
All the painters politely refused to make a painting of the King.
Then one young painter came forward and ensured to make a beautiful portrait of the King.
After a few days, the young painter unveiled the portrait in the court in which the King was seen sitting on the horse with one leg visible, holding his bow and aiming the arrow with one eye closed.
There was no sign of physical deficiencies in the king in the painting.
The King was pleased to see that the painter had creatively presented the King’s positive characteristics but not highlighted the abnormalities.
Moral: Look at the positive aspects of someone without emphasizing the limitations.
నేటి కథ
3,4,5 తరగతులు
ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచుక వుండేది.
మనసులో ఏ కల్మషంలేని ఆ పిచుకకో ఒక రోజు ఒక కాకుల గుంపు పరిచయం అయ్యింది. ఆ కాకులతో పిచుకకి స్నేహం అయ్యింది.
పిచుకకి అందరూ చెప్పారు – ఆ కాకులతో స్నేహం చేయద్దు, అవి మంచివి కావు, అని. కాని ఆ పిచుక మాట వినలేదు.
ఒక రోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయక పిచుక ఎక్కడకి, ఎందుకు అని అడగకుండా, ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది.
కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నిటిని ధ్వంసం చేయ సాగాయి. పిచుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలీకా అటూ ఇటూ గెంతుతూ వుంది.
ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు. కాకుల గుంపుకు ఇది అలవాటే, అవి తుర్రున ఎగిరిపోయాయి.
పిచుక రైతులకు దొరికిపోయింది.
“బాబోయ్! బాబోయ్! నా తప్పేమీ లేదు, నేను అమాయకురాలిని, నేనేమీ చేయలేదు, నన్ను వదిలేయండి!” అని పిచుక ప్రాధేయ పడింది.
కాని పంట నాశనం అయిన రైతులు కోపం మీద ఉన్నారు. పిచుక మాట నమ్మలేదు కదా, దాని వైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేసారు.
ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్దారించుకుంటారు. అందుకే మనం మంచి గా వున్న, మన స్నేహితులు చేడువారైతే మనం కూడా చెడ్డ వాళమనే అనుకుంటారు.
✅తెలుసు కుందాం
🟥ఎప్పుడూ నీటిలోనే ఉండే చేపలకి దాహం వేస్తుందా? అవి నీటిని తాగుతాయా?
🟩ఈ ప్రశ్నకు జవాబు అవును, కాదు అని రెండు విధాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఉప్పునీటి చేపలు నీళ్లు తాగుతాయి. అదే మంచినీటిలో ఉండే చేపలు నీళ్లు తాగవు. దీనికి కారణం తెలుసుకోవాలంటే భౌతిక శాస్త్రంలోని ద్రవాభిసరణము (osmosis) అనే ప్రవాహుల (fluids) ధర్మాలను తెలుసుకోవాలి. వీటి ప్రకారం రెండు వేర్వేరు గాఢతలు (concentrations) గల ద్రవాలను ఒక సన్నని పొర (మెంబ్రేన్) విడదీస్తుంటే, నీరు ఎక్కువ గాఢతగల ద్రవం వైపు ప్రవహిస్తుంది.
మంచి నీటిలో ఉండే చేప శరీరంలోని ద్రవం, దాని చుట్టూ ఉండే నీటి గాఢత కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ చేప శరీరంలోకి బయటి నీరు దాని చర్మం, మొప్పల ద్వారా శోషింపబడుతుంది. అలా దాని శరీరంలోకి ప్రవేశించిన నీటిని చేప బయటకు వదలక పోతే సమయం గడిచే కొద్దీ ఎక్కువ నీరు చేరడం వల్ల దాని శరీరం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వస్తుంది. ఇక ఉప్పునీటి చేప విషయంలో ఈ ప్రక్రియ వ్యతిరేక దిశలో జరుగుతుంది. ఇక్కడ చేప చుట్టూ ఉండే నీటి గాఢత ఎక్కువగా ఉండడంతో చేప శరీరంలోని నీరు బయటకి స్రవిస్తుంది. అందువల్ల ఉప్పునీటి చేప సమయం గడిచే కొద్దీ శరీరంలోని నీటిని కోల్పోవడం వల్ల శుష్కించి, ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. ఇలా జరగకుండా ఉండేందుకు ఆ చేప తన చుట్టూ ఉండే నీటిని మొప్పలు, నోటి ద్వారా తాగుతుంది. ఆ నీరు దాని శరీరంలోకి చేరక ముందే మొప్పలు ఉప్పునీటిలోని ఉప్పును విసర్జిస్తాయి.
0 Response to "Day - 29 : Students Summer Holidays Activities"
Post a Comment