Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Diabetes: It is a wonder drug for controlling diabetes and has a special place in Ayurveda

Diabetes: షుగర్ వ్యాధిని అదుపులో పెట్టే అద్భుత ఔషధం ఇది, ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం

Diabetes: It is a wonder drug for controlling diabetes and has a special place in Ayurveda

డయాబెటిస్ ప్రపంచంలో ఎంతోమందిని ఇబ్బంది పెడుతోంది. మన దేశంలో కూడా కొన్ని లక్షల మంది డయాబెటిస్ బారినపడి ఇబ్బంది పడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరగడమే మధుమేహం.

రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నా ప్రమాదమే, తక్కువగా ఉన్న ప్రమాదమే. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. డయాబెటిస్ వల్ల అతి మూత్ర విసర్జన, బరువు తగ్గడం, అలసట, దృష్టి మసకబారడం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏమిటంటే మధుమేహం అదుపులో లేకపోతే గుండెపోటు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. నాడీ వ్యవస్థ పనితీరు తగ్గిపోతుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడం చాలా అవసరం. దీనికి ఆయుర్వేదంలో అద్భుతమైన మూలిక బ్రహ్మీ.

బ్రహ్మీ లేదా బకోప మొన్నీరి. ఇది అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఆయుర్వేద మూలిక. ఆయుర్వేదంలో వాడే మ్యాజిక్ మూలికలలో ఇది ఒకటి. ఈ బ్రహ్మీ మౌలిక ఉష్ణ మండల వాతావరణంలోనే పెరుగుతుంది. నీటి అడుగున ఇది పెరుగుతుంది. అక్వేరియంలో ఎక్కువగా దీన్ని వినియోగిస్తూ ఉంటారు. ఈ ఔషధమూలికకు యాంటీ హైపర్ గ్లైసిమిక్ లక్షణాలు ఉంటాయి. అంటే టైప్1, టైప్2 మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని వాడవచ్చు. మధుమేహాన్ని అదుపులో ఉంచే లక్షణాలు దీనిలో ఎక్కువ.

బ్రహ్మీ ఆకులను నేరుగా తినడం వల్ల రక్తంలో అధిక చక్కెర స్థాయిలు తగ్గుతాయి. మధుమేహం వల్ల కలిగే లక్షణాలు కూడా తగ్గుతూ ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవితం గడిపేందుకు ఈ బ్రహ్మీ ఆకులు సహాయపడతాయి. బ్రహ్మీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో చేరే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. హానికర టాక్సిన్లను బయటకు పంపిస్తాయి. శరీరంపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీనివల్ల గుండె, కాలేయం, ఊపిరితిత్తులు వంటి ముఖ్యమైన అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. బ్రహ్మీ ఆకులను తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. మానసిక ఆందోళన తగ్గుతుంది. మూర్ఛ వంటివి తగ్గే అవకాశం ఉంది. మెదడు పనితీరును పెంచడంతోపాటు ఒత్తిడిని తగ్గించడంలో బ్రహ్మీ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి.

 ఎలా తీసుకోవాలి?

బ్రహ్మీ ఆకులతో తయారుచేసిన క్యాప్సుల్స్, సిరప్, పొడి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఏ రూపంలో తీసుకోవాలనుకుంటున్నారో వాటిని ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా ఆయుర్వేద వైద్యులను కలిసి మీ సమస్యను చెప్పి దానికి తగ్గ బ్రాహ్మితో తయారు చేసిన మందులను కొనుక్కోవచ్చు. ఎంత మోతాదులో రోజుకు వేసుకోవాలో వైద్యుల సలహా తీసుకోవాలి. నీటితో కలిపి తీసుకుంటే ఉత్తమంగా పనిచేస్తుంది. 


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Diabetes: It is a wonder drug for controlling diabetes and has a special place in Ayurveda"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0