Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Even if the loan is not paid, the vehicle cannot be seized.. Court's sensational verdict!

లోన్‌ కట్టకపోయినా వాహనాన్ని లాక్కెళ్లడానికి వీల్లేదు.. కోర్టు సంచలన తీర్పు!

Even if the loan is not paid, the vehicle cannot be seized.. Court's sensational verdict!

డబ్బుతో ఎప్పుడు? ఎవరికి? ఏ అవసరం పడుతుంతో ఎవ్వరమూ చెప్పలేం. చేతిలో డబ్బులు లేనప్పుడు ఏదైనా అవసరం ఏర్పడితే ఇతరుల నుంచి అప్పు తీసుకోవాల్సి వస్తుంది.

అయితే, చాలా మంది ఇప్పుడు బయట అప్పులు తీసుకోవటం మానేశారు. అప్పు కోసం బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటున్నారు. బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకు నేడు రుణాన్ని అందిస్తున్నాయి. అంతేకాదు.. మంచి మంచి ఆఫర్లు ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇక, తీసుకున్న మొత్తం చెల్లించడానికి ఇన్‌స్టాల్‌మెంట్‌ పద్దతులు ఉండనే ఉన్నాయి.

అప్పు తీసుకున్న వారు ఇన్‌స్టాల్‌మెంట్‌ పద్దతుల్లో బ్యాంక్ లోన్‌ను కొంచెం కొంచెంగా తీరుస్తూ ఉన్నారు. అయితే, ఒక్కోసారి చేతిలో డబ్బులేక, ఎక్కడ డబ్బు దొరక్క కొన్ని నెలల పాటు ఇన్‌స్టాల్‌మెంట్లు కట్టలేని పరిస్థితి వస్తుంది. అలా ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లించకపోతే.. బ్యాంకుల్లో ఉన్న ఏజెంట్లు వచ్చి డబ్బులు కట్టాలంటూ ఇబ్బంది పెట్టడం పరిపాటి. డబ్బు కట్టకపోతే ఇంట్లోని వాహానాలను తీసుకెళ్లిన ఘటనలు కూడా ఎన్నో జరిగాయి. అయితే.. ఈ విషయంపై తాజాగా పాట్నా హైకోర్టు ఓ సంచలన తీర్పు ఇచ్చింది.

ప్రస్తుత కాలంలో లోన్ తీసుకున్న వాహానాల యజమానులు ఒకవేళ లోన్ డబ్బులు చెల్లించకపోతే కండబలమున్న మనుషులను పంపించి, దౌర్జన్యం చేసి మరీ అప్పు తీసుకున్న వారి వాహనాలను స్వాధీనం చేసుకోవటాన్ని కోర్టు తప్పుబట్టింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ పద్దతిని మార్చుకోవాలని పాట్నా హైకోర్టు ఆదేశించింది. లోన్ రికవరీని రాజ్యాంగ పరిధిలోని చట్టాల ప్రకారంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయా బ్యాంకుల మీద, ఆర్థిక సంస్థల మీద రూ. 50 వేల జరిమానా విధిస్తామని కోర్టు హెచ్చరిచ్చింది. మరి, పాట్నా హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Even if the loan is not paid, the vehicle cannot be seized.. Court's sensational verdict!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0