Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Guidelines for Transfers and Promotions

బదిలీలు మరియు పదోన్నతుల గైడ్లైన్స్

Guidelines for Transfers and Promotions

బదిలీలు పదోన్నతులు ఏకకాలంలో ఒకే షెడ్యూల్లో పూర్తి చేయబడతాయి

అంటే ముందుగా అన్ని క్యాడర్లలో బదిలీలు కొరకు అప్లై చేసుకోవడానికి రేపటినుండి 28వ తేదీ వరకు అవకాశం కల్పిస్తారు. జూన్ 28 తర్వాత అన్ని క్యాడర్ ఉపాధ్యాయుల బదిలీ సీనియార్టీ జాబితాను తయారు చేస్తారు. 

తదుపరి  ప్రధానోపాధ్యాయుల బదిలీ జాబితాను రూపొందించి దాని చివరన willing ఇచ్చిన HM పదోన్నతి ఉపాధ్యాయుల జాబితాను చేర్చి ఏకకాలంలో బదిలీలు మరియు పదోన్నతుల స్థానాలను కేటాయించడానికి జూన్ 5వ తేదీన వెబ్ ఆప్షన్స్ ద్వారా సేకరించి బదిలీ పదోన్నతి ఆర్డర్లను జూన్ 12వ తేదీ నాటికి ఇచ్చి కొత్త పాఠశాలలో చేరేలాగున షెడ్యూల్ రూపొందించబడింది.

 అంటే అన్ని క్యాడర్లో కూడా బదిలీ సీనియార్టీ జాబితాను తయారుచేసి ఆ క్యాడర్లో పదోన్నతికి willing ఇచ్చిన ఉపాధ్యాయుల సినీ సీనియారిటీ జాబితాను చేర్చి జూన్ 5 తర్వాత వెబ్ ఆప్షన్స్ ద్వారా స్థానాన్ని కేటాయించి బదిలీ మరియు పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు ఏకకాలంలో ఆర్డర్స్ ఇచ్చి జూన్ 12 నాటికి కొత్త పాఠశాలలో చేరేలాగా ఈ షెడ్యూల్ రూపొందించబడింది.

బదిలీలలో తీసుకోవలసిన జాగ్రత్తలు :-  తప్పనిసరి బదిలీ అయ్యే ఉపాధ్యాయులు సర్ప్లస్ గా 117, 128 GO ల ద్వారా గుర్తించబడిన ఉపాధ్యాయులు బదిలీ కొరకు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. ఏ కారణం చేతనైనా 28వ తేదీ లోపు అప్లై చేసుకో లేకపోతే తదుపరి వారికి సమయం ఉండని కారణంగా తీవ్రంగా నష్టపోతారు  జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుచున్నాము.

 2500 ఇన్సెంటివ్తో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు మరల వారి సీనియార్టీ ప్రకారం పదోన్నతుల్లో పాల్గొనవలసి ఉంటుంది.

ఎల్ పి ఉపాధ్యాయులు వారి జీతం పొందుతున్న పాఠశాల నుండి సీనియార్టీని claim చేసుకుని వారు ప్రీ హై స్కూల్ లో నియమించబడతారు.

 సర్ప్లస్ ఉపాధ్యాయులు రెండు రకాలుగా గుర్తించబడతారు 

1. వర్కింగ్ సర్ప్లస్ :- అంటే ఆ జిల్లాలో అవసరమైన వారి కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఆ సబ్జెక్టులో ఉన్నప్పుడు వారిని ఎక్కువ రోలు నుండి తక్కువ రోల్ ఉన్న పాఠశాలలకు డిస్ండింగ్ ఆర్డర్లో నియమిస్తారు ఎందుకంటే వారికి జీతం చెల్లించాలి కాబట్టి.

2. సర్ప్లస్ వేకెన్సీ :- ఆ జిల్లాలో ఆ సబ్జెక్టులో వేకెన్సీ ఉన్నప్పటికీ ( cadre strength ప్రకారం) అవసరం లేని కారణంగా వాటిలోకి ఏ ఉపాధ్యాయుడిని బదిలీకి అనుమతించరు దానిని ఏదో ఒక పాఠశాలల్లో వేకెంట్ గానే ఉంచుతారు.

 NCC ఉపాధ్యాయులు 8 సంవత్సరాల నిండినప్పటికీ ఈ Online బదిలీలో వారు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు వారిని మాన్యువల్ గా ఈ బదిలీ ప్రక్రియ అనంతరం చేస్తారు.

ప్రిఫరెన్స్ కేటగిరీలో అప్లై చేసుకునే ఉపాధ్యాయులు డిపెండెన్స్ విషయంలో కేవలం మెంటల్లీ రిటర్డెడ్ వారికి పిల్లలకు తల సేమియా హిమోఫిలియా జువైనల్ డయాబెటిస్ వంటి వ్యాధులకు మాత్రమే అవకాశం కల్పించారు అది కాకుండా మిగిలిన జాబితాలో లేని వ్యాధుల కొరకు జిల్లా బదిలీ కమిటీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఎయిడెడ్ పాఠశాల నుండి జిల్లాపరిషత్/ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన వారికి ఎయిడెడ్ సర్వీసు నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరానికి 0.5 పాయింట్లు చొప్పున, కొత్తగా చేరిన పాఠశాలలో స్టేషన్ సర్వీస్ పాయింట్లను కేటాయిస్తారు.

అదేవిధంగా అంతర్జిల్లా బదిలీలో వచ్చిన ఉపాధ్యాయులకు పాత జిల్లా నుండి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం సర్వీసుకు 0.5 points కొత్త జిల్లాలో స్టేషన్ సర్వీస్కు పాయింట్లను కేటాయిస్తారు.

ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయులను ఫౌండేషన్ ప్లస్ పాఠశాలల్లో 150 కంటే ఎక్కువ రోలు ఉన్న పాఠశాలలో నియమిస్తారు అది సాధ్యం కానప్పుడు ఆ జిల్లాలోని అత్యధిక రోలు కలిగిన ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలకు డిసెండింగ్ ఆర్డర్లో కేటాయిస్తారు.

 పదోన్నతుల కొరకు తప్పనిసరిగా 28వ తేదీ లోపు గానే అన్ని క్యాడర్లలో ఉపాధ్యాయులు willing తెలియజేయాల్సి ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Guidelines for Transfers and Promotions"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0