Health Workers
Health Workers: భారతీయలకు మరో గుడ్ న్యూస్.. H1-B వీసాతో విదేశీ హెల్త్ వర్కర్స్ నియామించేలా అమెరికా కొత్త బిల్లు.
అభివృద్ధి చెందిన దేశమైన అమెరికా.. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందిస్తూ, ఇతర దేశాల ప్రజలను కూడా ఆకర్షిస్తోంది. వివిధ రంగాల్లో మంచి అవకాశాల కోసం యూఎస్‌కు వలసలు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి.
తాజాగా వైద్య అవసరాల కోసం ఇతర దేశాల ప్రజలను నియమించుకునేలా మరో కీలక మార్పు తీసుకొస్తోంది. USలో వెటరన్స్ కోసం హెల్త్‌కేర్ ప్రొవైడర్ల కొరతను పరిష్కరించేందుకు ఎక్స్‌ప్యాండింగ్ హెల్త్ కేర్ ప్రొవైడెర్స్ ఫర్ వెటరన్స్ యాక్ట్‌ను(Expanding healthcare providers for veterns act) అమెరికన్ కాంగ్రెస్‌లో సభ్యులు రషీదా త్లైబ్, డెలియా రామిరేజ్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ వెటరన్ అఫైర్స్(VA)కి H1-B వీసాలపై విదేశీ ఉద్యోగులను నియమించుకునే అవకాశం ఉంటుంది.
ప్రతిపాదిత చట్టం ప్రకారం.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ వెటరన్స్ అఫైర్స్, స్టేట్ వెటరన్స్ హోమ్‌లను H1-B వీసా ప్రోగ్రామ్‌లో క్యాప్ ఎగ్జమ్ట్ ఇన్‌స్టిట్యూట్‌లుగా పేర్కొంటారు. అంటే H1-B వీసాలు కలిగి ఉన్న ఇమిగ్రెంట్ హెల్త్ వర్కర్స్‌కు వెటరన్స్ హెల్త్‌కేర్ నీడ్స్ తీర్చడానికి సేవలను అందించే అవకాశం ఉంటుంది.
బిల్లు నేపథ్యం
డెట్రాయిట్ VA మెడికల్ సెంటర్‌లో ఇటీవల జరిగిన ఓ సంఘటన కారణంగా ఈ బిల్లు ముందుకొచ్చింది. H1-B వీసా క్యాప్ కారణంగా హెల్త్‌కేర్ ప్రొవైడర్స్‌ను నియమించుకోలేని పరిస్థితి నెలకొంది. సరిపడా సిబ్బంది లేక క్లినిక్ మూసివేయాల్సిన స్థితి నెలకొంది. యూఎస్ చట్టసభ మెంబర్ త్లైబ్ జోక్యంతో క్లినిక్ మూసివేత ఆగింది. ఎక్స్‌పాండింగ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఫర్ వెటరన్స్ యాక్ట్ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూస్తుంది.
వెటరన్స్ అఫైర్స్ హౌస్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ ఉమెన్ రామిరేజ్.. వెటరన్స్ కమిట్‌మెంట్స్‌ను నెరవేర్చడం, దేశంలో హెల్త్ కేర్ వర్కర్స్ కొరత సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతను నొక్కి చెప్పారు. అక్కడి కమ్యూనిటీలలో పని చేయడానికి సిద్ధంగా ఉన్న వలసదారులు ఈ కొరతను పరిష్కరించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారని ఆమె భావిస్తున్నారు.
గుర్తుండిపోయేలా సేవలు
ఈ వ్యాఖ్యలను, అభిప్రాయాలను కాంగ్రెస్ ఉమెన్ త్లైబ్ సమర్థించారు. ఆమె మాట్లాడుతూ.. వెటరన్స్‌కు హై-క్వాలిటీ హెల్త్ కకేర్, ముఖ్యంగా మానసిక ఆరోగ్య సేవలను అందించడం ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. వెటరన్స్ కోసం హెల్త్ కేర్ ప్రొవైడర్స్‌ను ఎక్స్‌ప్యాండ్ చేయడానికి ఉపయోగపడే చట్టాన్ని ప్రవేశపెట్టడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
ది వెటరన్స్ ఫర్ పీస్ సేవ్ అవర్ VA నేషనల్ ప్రాజెక్ట్, ది అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ వంటి సంస్థల నుంచి బిల్లు ఆమోదం పొందింది. దీని ప్రతిపాదకులు వెటరన్స్‌కు అవసరమైన మెరుగైన సంరక్షణ అందించాలని, వారు ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాత కూడా అందించిన సేవలను గుర్తుంచుకోవాలని భావిస్తున్నారు.
ఈ బిల్లు పాస్ అయితే, ఎక్స్‌ప్యాండింగ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఫర్ వెటరన్స్ యాక్ట్.. H1-B వీసాలపై అర్హత కలిగిన విదేశీ నిపుణులను తమ దేశానికి సేవ చేసిన వారి అవసరాలను తీర్చడానికి ఉపయోగించుకోవచ్చు. వారి నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ, సపోర్ట్ అందించడం వల్ల యూఎస్ వెటరన్స్‌కు మెరుగైన సేవలు అందుతాయి.
0 Response to "Health Workers"
Post a Comment