Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

J.D. Services Muvva Ramalingam's explanation on transfer issues

బదిలీల సమస్యలపై జె.డి.సర్వీసెస్ మువ్వా రామలింగం గారు వివరణ

J.D. Services Muvva Ramalingam's explanation on transfer issues

ఖాళీలు బ్లాక్:- ఇంగ్లీషు, గణితం,ఫిజిక్స్,బయాలజి,సోషల్ సబ్జెక్టు లలో బ్లాకింగ్ చాలా తక్కువగా ఉంటుంది.తెలుగు,హిందీ ప్రమోషన్ ఇవ్వడం లేదు కాబట్టి 870 పోస్టులు బ్లాక్ చేయబడతాయి.కేటగిరీ 3,4లను‌ బ్లాక్ చేయరు

జిల్లా స్థాయి కమిటీ దగ్గర నమోదు అయిన ప్రిఫరెన్షియల్ దరఖాస్తులను రాష్ట్రంలో స్క్రూటినీ చేసిన తరువాత ఆమోదించబడతాయి

కన్వర్షన్ కు విల్లింగ్/ నాట్ విల్లింగ్ అవకాశం ఇవ్వమని ప్రాతినిధ్యం చేయగా అనుమతించలేదు

పాత స్టేషను పాయింట్లు వచ్చేవారికి డీఫాల్ట్ గా పాయింట్లు రావడం సాఫ్ట్‌వేర్ లో సాధ్యం కాదని ఐటి అధికారులు తెలియజేశారు.సంబంధిత ఉపాధ్యాయులు  మాన్యువల్ గా జాయినింగ్ తేదీని నమోదు చేయాలి.అక్రమాలకు వారే బాధ్యత వహించాలి.ఎం.ఇ.ఓ/ హెచ్.ఎం పరిశీలనాధికారిగా ఉంటారు

వెబ్ ఆప్షన్ ఇచ్చే క్రమంలో ఒకసారి సెలక్టు చేసుకొన్న ఖాళీలు సేవ్ మోడ్ లో ఉండేవిధంగా ప్రాతినిధ్యం చేయగా ఐ.టి. వారు డెవలప్ చేస్తామన్నారు

ప్రమోషన్ జాబితాలు తయారు చేసేటప్పుడు జిల్లాల డి.ఇ.ఓలు వేరు వేరు పద్దతి పాటించడం గురించి ప్రాతినిధ్యం చేయగా ఒకేవిధంగా సూచన చేస్తామన్నారు

ఒరిజనల్ మెడికల్ సర్టిఫికేట్ లు ఇప్పటికే డి.ఇ.ఓ కార్యాలయమునకు ఇచ్చి ఉన్నవారు  ఇక ఇవ్వనవసరం లేదు

గతంలో స్పౌజ్ వాడుకొని ఎనిమిది అకడమిక్ సంవత్సరాలు పూర్తి అయిన వారికి స్పౌజ్ పాయింట్లు రాని విషయం జె.డి. గారి దృష్టికి తీసుకెళ్ళగా పరిశీలిస్తామని అన్నారు

MTS ఖాళీలు బదిలీకి చూపిస్తారు

PSHM ను ఫౌండేషన్ ప్లస్ లో డిసెండింగ్ ఆర్డర్ లో నమోదు చేస్తారు

2500/- బడ్జెట్ రిలీజ్ అయినది వెంటనే ఇస్తారు

ఉర్దూ పి.యస్.హెచ్.ఎం మరియు స్కూల్ అసిస్టెంట్, యస్.జి.టిలను కేటాయించమని అడుగగా ప్రభుత్వానికి రాస్తామని‌ జె.డి సర్వీసెస్ నోట్ చేసుకోవడం జరిగింది

8 అకడమిక్ సంవత్సరాలు పూర్తి కాబడి హైస్కూల్ ప్లస్ లోకి వెళ్ళిన వారిని లాంగ్ స్టాండింగ్ గా పరిగణిస్తారు

పదోన్నతులను మ్యానువల్ గా చేయమని డిమాండ్ చేయగా,సమయం దృష్టా వెబ్ పద్దతిలో చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది. కాని ప్రమోషన్ కు వెబ్ పద్ధతి సరికాదని మరొక సారి పరిశీలించమని కోరడం జరిగింది

డి.ఇ.ఓ పూల్ తో పాటు ఓటిపి రానివారికి నో యువర్ ఓటిపి ఆప్షన్ ద్వారా పొందవచ్చు

పాత స్టేషను పాయింట్లు, ప్రస్తుత స్టేషను పాయింట్లు ఏదైనా ఒకటి కోరుకొనే పద్దతి సాధ్యం కాదని జి.ఓ కరెక్షన్ సాధ్యం కాదని అన్నారు


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "J.D. Services Muvva Ramalingam's explanation on transfer issues"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0