Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

A note to teachers considering web options

వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఉపాధ్యాయులకు గమనిక

A note to teachers considering web options


మీరు అనుకున్న వెబ్ ఆప్షన్స్ ముందుగానే ఒక క్రమంలో పేపర్ పై  రాసుకొని కంప్యూటర్ ముందు కూర్చుని వెబ్ ఆప్షన్స్ నమోదు చేయండి.

దాని  వలన మీరు అనుకున్న ఏ స్థానం మిస్ కాదు. కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. వర్కు త్వరగా పూర్తవుతుంది.

వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో ఇతరులకు ఫోన్ చేసి స్థానాల గురించి విచారణ చేయవద్దు. అది మిమ్మల్ని ఇంకా కన్ఫ్యూజన్ లోకి  నెడుతుంది.

నీ వెనక వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వచ్చినవారికి కూడా అవకాశం కల్పించాలి..

ఫోన్లో కన్నా కంప్యూటర్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం సులువు.

పదేపదే ఫోన్లో వెబ్ ఆప్షన్స్ లింకును ఓపెన్ చేయకండి. దానివలన సర్వర్ పై ఒత్తిడి పెరిగి వెబ్సైట్ ఇంకా స్లో అవుతుంది.

మీరు ఎంచుకునే పాఠశాలలో ఎటువంటి వేకెన్సీ అయినా ఒకటే.. అనగా క్లియర్, లాంగ్ స్టాండింగ్, రిపోర్ట్స్నైట్ అని తేడా ఉండదు.. ఒకసారి ఆ పాఠశాలలో చేరితే అందరూ సమానమే.. కావున వేకెన్సీ రకాలు గురించి కంగారు పడకండి.

ప్రిఫరెన్షియల్ వారు సాధ్యమైనంత వరకు 1,2 కేటగిరీలు కోరుకోవటం మంచిది..(ఇది కేవలం  సలహా మాత్రమే)... లాంగ్ స్టాండింగ్ తరువాత మరలా మీరు ఏటూ ఆ కాటగిరిని వాడుకోవచ్చు.

తప్పనిసరి బదిలీ వారు జిల్లా లోని అన్ని స్థానాలను పెట్టుకోవాలి.

రిక్వెస్ట్ బదిలీ వారు తమ స్థానాన్ని తప్పనిసరిగా చివరకు పెట్టుకోవాలి..This is most important.

ఒకే పంచాయతీలో మరొక పాఠశాలను కూడా మనం కోరుకోవచ్చు.

SPOUSE వారు తప్పనిసరిగా మీ ప్రియారిటిలో  మీ SPOUSE పని చేస్తున్న మండలాలనే ముందుగా పెట్టండి.. తర్వాత మిగిలినవి పెట్టండి.. లేకపోతే బదిలీల అనంతరమైన చర్యలు ఉంటాయని GO లో స్పష్టంగా పేర్కొన్నారు.

వెబ్ ఆప్షన్స్ పూర్తి అయిన తదుపరి మీరు పెట్టిన ఆప్షన్స్ తప్పనిసరిగా ప్రింట్ తీయించుకోండి.. ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఇస్తే మరలా వెబ్ ఆప్షన్స్ మార్చుకోవడం మరింత సులువు...ప్రింటింగ్ ఖర్చుకు వెనుకాడవద్దు.

మీకు ఏ స్థానం కేటాయించబడినా మీరు సమర్థవంతంగా పనిచేస్తారు కాబట్టి... అంతా పాజిటివ్ గా ఉండండి...మీరు కోరుకున్న ప్లేస్ తప్పనిసరిగా వస్తుంది..

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "A note to teachers considering web options"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0