Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Day - 36 : Students Summer Holidays Activities

 Day - 36 : Students Summer Holidays Activities

Day6: Students Summer Holidays Activities

 Summer Holidays Activities -  - Summer vacation- summer activities

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు  వేస
వి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:36 Activities
Class: 1,2
36వ రోజు
To develop health and well - being

Q) Practice physical exercises daily for 15 minutes.

తెలుగు:

Q) కింది ఓత్వం ఉన్న పదాలు చదువుతో రాయండి.

టోపీ
దోమ
కోడి
జోడి
లోటు
పోటు
కోట
తోట
సమోస
సపోట 

English:

Write the missing letters.

R - t       🐀

R o - e     🌹

R - n g       💍

R o - d      🛣️

R - i n       🌧️

Maths:

Q) Do the following Subtractions.

              4   8  
           -  1   9  
           ................
           ................


              5   4  
           -  2   8 
           ................
           ................


              3   6  
           -  2   9 
           ................
           ................

ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు

Anything =ఏదైననూ.

Divided = విభాగించెను.

General =సామాన్యము.

Energy = శక్తి.

Subject = విషయము.

Europe = యూరప్ ఖండం.

Moon = చందమామ.

Region = ప్రాంతము.

Return = తిరిగి ఇచ్చు.

Believe =నమ్మకము.

Dance = నాట్యము.

Members = సభ్యులు.

Picked =ఏరెను.

Simple =సులభమైన, సామాన్యమైన.

Cells = కణములు.


Class :3,4,5
36 వ రోజు 

కాకి మరియు నక్క కథను మీ సొంత మాటల్లో మీ నోటు పుస్తకం లో రాసి గ్రూప్ లో పోస్ట్ చేయండి.

Q ) Wrire the Story 'The Crow And The Fox' in your own words in your note book and post in the group.

💎నేటి ఆణిముత్యం 

ఉత్తమ గుణముల నీచున
కెత్తుఱఁగున గలుగనేర్చు నెయ్యెదలన్ దా
నెత్తిచ్చి కఱఁగి పోసిన
నిత్తడి బంగారమగునె యిలలొ సుమతీ!
తాత్పర్యం: అల్పబుద్ధి గలవానికి ఏ విధంగా సాయం చేసినా మంచి బుద్ధి రాదు, ఇత్తడికి సమానంగా బంగారాన్ని తీసుకుని ఎంత కరిగించి పోసినా- అది బంగారానికి సాటిరాదు. అలాగే నీచుడు కూడా.

👬నేటి చిన్నారి గీతం 

ఆదర్శ బాలలం

గబగబా మనమూ ఎదిగేద్దాం
ఎదుగుతు పనులూ చేసేద్దాం
విరివిగా ఆటలు ఆడేద్దాం
సొగసుగ పాటలు పాడేద్దాం!

విద్యలు ఎన్నో నేరుద్దాం
విలువల నెపుడూ పాటిద్దాం!
ఉన్నత లక్ష్యం చేరేద్దాం
ఉజ్వల భవితను పొందేద్దాం!

అమ్మా నాన్నను గెలిపిద్దాం
అడిగినవిచ్చి పూజిద్దాం
అందరి మెప్పు పొందేద్దాం
ఆనందంగా బ్రతికేద్దాం!
నేటి మంచిమాట

మనం మాట్లాడే ప్రతి పలుకూ ప్రేమతో నిండి ఉండాలి.
-మదర్ థెరెసా
🗣నేటి జాతీయం

అరికాలి మంట నెత్తికెక్కడం

అర్థం: - కోపం అధికం కావడం
వివరణ: - మితిమీరిన విద్యార్థుల అల్లరితో ఉపాధ్యాయునికి అరికాలి మంట నెత్తికెక్కింది.

🤠 నేటి సామెత 

సొట్టకాళ్లోడు సుట్టమైరాంగ..

ఉన్న సమస్యలతోనే సతమతమై ఇబ్బందులు పడుతున్న వేళ.. కొత్తగా పెను సమస్యలు వచ్చిపడితే ఆ బాధలు వర్ణనాతీతం. సరిగ్గా అటువంటి పరిస్థితులను ‘సొట్టకాళ్లోడు సుట్టమైరాంగ.. రొయ్యకాళ్లోడు రోలెక్కి తన్నిండు’ వంటి సామెతతో పోల్చుతారు. ఈ సామెత ప్రస్తుత పరిస్థితులకు సరిపోలుతుంది.

✍🏽నేటి కథ

కోపం మనిషిని ఎలా దిగజారుస్తుందో...తెలుసుకో...
ఒక దంపతులకు చాలా ఏండ్లవరకు పిల్లలుకలుగలేదు. ఎంతమంది డాక్టర్లను సంప్రదించినా ప్రయోజనం
లేకుండా పోయింది.......బాధను కొంచెం అయినా
తగ్గించుకోవచ్చని........ వారి స్నేహితుల ఇంట్లోనుండి
అప్పుడే పుట్టిన కుక్కపిల్లనొకదాన్ని తెచ్చుకుని పసిబిడ్డలా చూసుకున్నారు......ఆ కుక్క కూడా వారిని వొదిలి ఉండేది కాదు..... కొద్దిరోజులకు వీరికి ఏ దేవుడు కరుణించాడో సంతానం కలిగింది....పుట్టిన బిడ్డను చూసుకుంటూ కుక్కను బాగా నిర్లక్ష్యం చేశారు......... పాపం కుక్క చాలా బాధతో వారు పిల్లవాడి దగ్గరకు వెళ్ళిన ప్రతిసారి తనను పట్టించుకోవడంలేదని బాగా మొరిగేది బాధతో.......
కానీ ఆ దంపతులు ఆ కుక్క తమ బిడ్డమీద ఈర్షతో అలా అరుస్తుందని అనుకునేవారు. ఒకరోజు ఆ దంపతులు ఇద్దరూ వారి బిడ్డను ఉయ్యాలలో
పడుకోబెట్టి మేడమీదికి వెళ్ళారు....కాసేపటికి కుక్క విపరీతంగా అరవడం గమనించి వచ్చి చూశారు.......
ఇంటి గుమ్మం దగ్గర కుక్క నోటినిండా రక్తాన్ని చూసి........తమ బిడ్డను ఈర్షతో చంపేసిందన్న కోపంతో ఇంట్లోకి వెళ్ళి తమ తుపాకీతో ఆ కుక్కను కాల్చి చంపేశారు...... ఇంతలోపల పిల్లవాడి ఏడుపుచూసి రూంలోకి వెళ్ళి చూసి బిడ్డ
క్షేమంగా ఉయ్యాలలోనే ఉండటం చూసి సంతోషంగా బిడ్డవద్దకు చేరుకున్నారు...
బిడ్డ ఉయ్యాలకింద రెండు పాములు రక్తపు మడుగులో పడి చనిపోయి ఉన్నాయి...
వారికి పరిస్థితి అర్థమైంది.......తన బిడ్డకు కీడు జరగకుండా
ఆ కుక్క వాటితో పోరాడి చంపేసిందని.....అది తెలుసుకుని ఆ దంపతులు విపరీతంగా ఏడ్చి,,,,,తమ తప్పును తెలుసుకున్నారు......కోపం మనిషిని ఎలా దిగజారుస్తుందో తెలుసుకోవడానికి ఇంతకంటే నిదర్శనం అవసరంలేదు కదా!
మనుషులకు ఇలాంటి పగ, ఈర్ష ఉంటాయి కానీ నోరులేని జీవాలకు కాదని తెలుసుకుందాం ...కోపాన్ని పక్కకు పెట్టి ప్రేమగా ఉండండి... మనుషులు మనుషులగా బతుకుదాం

తెలుసుకుందాం⁉️

🟥మీసాలు మగవారికేనా? Mustache are present in male only why?
🟩పుట్టుకతోనే ఆడ, మగ పిల్లల్లో ఉండే శారీరక వ్యత్యాసాలను ప్రాథమిక లైంగిక లక్షణాలు(Primary sexual characteristics)అంటారు. పిల్లలు పెరిగే క్రమంలో మరికొన్ని మార్పులు శరీరం బయట, లోపల కూడా ఏర్పడుతాయి. వీటిని ద్వితీయ లైంగిక లక్షణాలు (Secondary sexual characteristics)అంటారు. ఉదాహరణకు జంతువుల్లో కోడి గుడ్డులోంచి వచ్చే పిల్లలు ఎదిగే కొద్దీ కొన్ని ప్రత్యేకమైన ఈకలు వచ్చి పెట్టలుగా, పుంజులుగా మారడం, పుంజు మాత్రమే కొక్కొరొకో అని కూయగలగడం, అలాగే మగ నెమలికి మాత్రమే పింఛం రావడం మొదలైన లక్షణాలను గమనించవచ్చు. మనుషుల్లో గడ్డాలు, మీసాలు మగవారికి మాత్రమే ఏర్పడడం కూడా ద్వితీయ లక్షణాలలో భాగంగానే. ఇందుకు కారణం స్త్రీపురుష శరీరాల్లో కొన్ని హార్మోన్లు ప్రత్యేకంగా వృద్ధి చెందడమే. మగవారిలో టెస్టోస్టిరాన్‌ హార్మోను ఎక్కువగాను, ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ తక్కువగాను ఉంటాయి. అదే ఆడవారిలో ఈస్ట్రోజన్‌ పరిమాణం ఎక్కువగాను, టెస్టోస్టిరాన్‌ తక్కువగాను ఉత్పత్తి అవుతాయి. వీటి ప్రభావం వల్లనే ఈ తేడాలు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Day - 36 : Students Summer Holidays Activities"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0