Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

According to Vaastu, there are many benefits of keeping Ragisurya in the house.

 Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఇంట్లో రాగిసూర్యుడిని ఉంచితే ఎన్ని ప్రయోజనాలో వివరణ.

According to Vaastu, there are many benefits of keeping Ragisurya in the house.

వాస్తు ప్రకారం ఇది సరికాదని తెలిస్తే చాలు ఎలాంటి మార్పులు చేర్పులైనా చేసేస్తారు. అయితే ఇంటి నిర్మాణం, ఆ తర్వాత ఇల్లు సర్దుకునే విషయంలో మాత్రమే కాదు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది.

అందులో ఒకటి రాగి సూర్యుడు.

ప్రతికూల శక్తిని తొలగిస్తుంది

రాగి సూర్యుడిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఇది దుష్టశక్తులను తొలగించే వాస్తు నివారణలలో ఒకటిగా పరిగణించవచ్చని వాస్తు నిపుణులు చెబుతారు. రాగితో చేసిన లోహ సూర్యుడిని అద్భుతమైన వాస్తు హార్మోనైజర్ గా భావిస్తారు. దీని నుంచి అనేక ప్రయోజనాలు పొందొచ్చు. ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యుడిని నిత్యం పూజించడం ద్వారా జీవితంలో మెరుగైన ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. సూర్యుని ఆశీస్సులు పొందిన వారు తమను తాము శారీరకంగా, మానసికంగా మెరుగుపరచుకోవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం రాగి సూర్యుడిని ఇంట్లో ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది.

రాగి సూర్యుడు ఏ దిశగా ఉండాలి

రాగి సూర్యుడు ఇంట్లో ఉంటే మంచిదే అని ఏ దిశగా అంటే ఆ దిశగా ఉంచేయకూడదు. గోడలపై నిర్దిష్ట దిశలో ఉంచాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, రాగితో చేసిన సూర్యుడిని ఇంట్లో ఉంచడం వల్ల మీరు నివసించే ఇల్లు లేదా ఆఫీసులో మిగిలిన ప్రదేశాలలో కూడా మీకు తగిన గౌరవం లభిస్తుంది. రాగి సూర్యుడు వల్ల ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాగి సూర్యుడికి బలమైన ఆకర్షణ శక్తి ఉందని, ఇది ప్రభావవంతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులను ఆకర్షిస్తుందని వాస్తు నిపుణులు అంటారు. మీ ఇంట్లో తూర్పు దిశలోని ఏదైనా మార్గంలో, తూర్పు గోడపై రాగి సూర్యుడిని ఉంచాలి. ఇలా చేయడం వల్ల లోపాలన్నింటినీ అధిగమించొచ్చు. ఇది మీ ఇంటికి శ్రేయస్సును పెంచుతుంది. అలాగే ప్రధాన ద్వారం తూర్పు దిశలో ఉంటే తలుపు వెలుపల రాగి సూర్యుడిని ఉంచడం వల్ల మీ ఇంట్లో సంపద పెరిగే సూర్యుడిని ఉంచాలి. ఇలా చేయడం వల్ల లోపాలన్నింటినీ అధిగమించొచ్చు. ఇది మీ ఇంటికి శ్రేయస్సును పెంచుతుంది. అలాగే ప్రధాన ద్వారం తూర్పు దిశలో ఉంటే తలుపు వెలుపల రాగి సూర్యుడిని ఉంచడం వల్ల మీ ఇంట్లో సంపద పెరిగే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఆఫీసులో తూర్పు గోడపై రాగి సూర్యుడిని వేలాడదీయడం వల్ల మీ కెరీర్లో పురోగతి లభిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు విజయం సాధిస్తారు.

ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్

సూర్యారాధనతో సమస్త పాపాలూ నశిస్తాయనీ, ఆరోగ్యం చేకూరుతుందనీ అనాదిగా వస్తున్న విశ్వాసం. రామాయణ కాలంలో శ్రీరామచంద్రుడు సూర్యుణ్ణి ఆరాధించి, ‘ఆదిత్య హృదయా’న్ని స్తోత్రం చేసి రావణుణ్ణి సంహరించాడు. హనుమంతుడు సూర్యుణ్ణి ఆరాధించి సకల వేదాలు అభ్యసించాడు. మహాభారతంలో ధర్మరాజు కూడా సూర్యారాధనతో అక్షయపాత్రను పొంది అరణ్యవాసంలో ఆహారానికి లోటు లేకుండా చేసుకోగలిగాడు. సత్రాజిత్తు సూర్యోపాసనతో శ్యమంతకమణి పొందాడు. సూర్యమంత్రం ప్రభావం వల్లనే కుంతీదేవికి కర్ణుడు జన్మించాడు. ఇతిహాసాల్లో, పురాణాలలో సూర్యుడి మహాత్మ్యాన్ని వెల్లడించే ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఆదిదేవుడైన సూర్యభగవానుణ్ణి నిష్టగా అర్చిస్తే, సర్వాభీష్టాలూ సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. సూర్యుడి రథానికి ఏడు అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. ఆకులు ఆరు ఋతువులు. ఏడు అశ్వాలు ఏడు కిరణాలు. సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవచన, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాడ్వసులనబడే సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్త కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి. అందుకే ‘ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్’ అనే లోకోక్తి పుట్టింది. నేరుగా సూర్యకిరణాలు పడకపోయినా రాగి సూర్యుడి ద్వారా అందులో సగానికి సగం ఫలితాలన్ని పొందొచ్చంటారు.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "According to Vaastu, there are many benefits of keeping Ragisurya in the house."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0