NEET UG Result
NEET UG Result 2023: నీట్ యూజీ ఫలితాలు విడుదల. టాపర్ మనోడే 720/720.రిజల్ట్ డైరెక్ట్ లింక్ .
నీట్ యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. మొత్తం 20,38,596 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాగా.
11,45,976 మంది అర్హత సాధించినట్లు ప్రకటించింది. తమిళనాడు కు చెందిన ప్రభంజన్, ఏపీకి చెందిన వరుణ్ చక్రవర్తి మొదటి ర్యాంకు సాధించినట్లు NTA వెల్లడించింది. ఈ ఇద్దరు 720కి గాను.. 720 మార్కులు సాధించినట్లు వెల్లడించారు. విద్యార్థులు https://neet.nta.nic.in/ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది నీట్ పరీక్షలో ఉత్తర ప్రదేశ్ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఆ తరువాత స్థానాల్లో మహారాష్ట్ర, రాజస్తాన్ రాష్ట్రాలు ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో కాంచనీ గేయంత్ రఘురామ్ రెడ్డికి అఖిల భారత స్థాయిలో 15వ ర్యాంక్, జాగృతి బొడెద్దు 49వ ర్యాంక్ సాధించి సత్తా చాటారు. తెలంగాణలో 42,654 మంది విద్యార్థులు అర్హత సాధించారు.
ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఏపీ విద్యార్థి వైఎల్ ప్రవధాన్ రెడ్డి రెండో ర్యాంకు సాధించారు. ఇంకా.. ఎస్సీ కేటగిరీలో ఏపీకి చెందిన కె. యశశ్రీ రెండో ర్యాంకు సాధించారు. NEETకు అర్హత సాధించిన వారిలో యూపీ, మహారాష్ట్ర , రాజస్థాన్ నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్నట్టు NTA వెల్లడించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 11,45,976 మంది అర్హత సాధించగా.. ఏపీ నుంచి 42,836, తెలంగాణ నుంచి 42,654 మంది అభ్యర్థులు ఉన్నారు.
దేశంలో అందుబాటులో ఉన్న వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్లకు భారత్ తో పాటు విదేశాల్లోని పలు నగరాల్లోని మొత్తం 4,097 కేంద్రాల్లో మే 7న నీట్ పరీక్షను నిర్వహించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ పరీక్షకు 20,87,449 మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్ 4న ప్రిలిమినరీ ఆన్షర్ కీని విడుదల చేసిన NTA.. దీనిపై జూన్ 6వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. వాటిని పరిగణనలోకి తీసుకున్న NTA అధికారులు తాజాగా తుది ఆన్సర్ కీతో పాటు ఫలితాలను విడుదల చేశారు.
NEET (UG) 2023 Score Card
0 Response to "NEET UG Result "
Post a Comment