Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APPSC Group 1, 2 Notifications

 APPSC : ఏపీలో త్వరలో గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లు విడుదల. పోస్టుల వివరాలు, పరీక్ష విధానం.

APPSC Group 1, 2 Notifications

APPSC Group 1, 2 Notifications :ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. APPSC Group 1, Group 2 సర్వీసుల్లో.. 1000 పోస్ట్‌ల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇటీవల స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా.. నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. గతేడాది జారీ చేసిన గ్రూప్‌–1 నియామక ప్రక్రియ కొనసాగుతుండగానే.. ప్రభుత్వం గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌లపై స్పష్టత ఇవ్వడంతో అభ్యర్థుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గ్రూప్‌ 1తోపాటు గ్రూప్‌–2 పోస్ట్‌ల భర్తీకి కూడా ఉపక్రమించడంతో.. అభ్యర్థులకు ఒకే సమయంలో రెండు పరీక్షలకు పోటీ పడే అవకాశం కూడా లభిస్తుంది. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో త్వరలో వెలువడనున్న గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 పోస్టుల వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం పరిశీలిస్తే.

APPSC Group 1 లో 100 పోస్టులు.. గ్రూప్‌–2లో 900 పోస్టులు:

గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ ద్వారా 100 పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందులో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, ఆర్‌టీఓ, సీటీఓ వంటి ఉన్నత స్థాయి పోస్టులు ఉంటాయి. అదే విధంగా గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌ ద్వారా 900 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో డిప్యూటీ తహశీల్దార్, ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్, సబ్‌ రిజిస్ట్రార్, ఏసీటీఓ వంటి పోస్ట్‌లు ఉంటాయి. ఈ రెండు సర్వీసులకు కూడా బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో పోటీ పడే అవకాశం ఉంది.

APPSC Group 1 పరీక్ష విధానం:

గ్రూప్‌–1 పరీక్ష రెండు దశలుగా ఉంటుంది. మొదటి దశ ప్రిలిమినరీ పరీక్ష, రెండో దశ మెయిన్‌ ఎగ్జామ్‌.

ప్రిలిమ్స్‌: తొలి దశ ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌ 1లో హిస్టరీ అండ్‌ కల్చర్, రాజ్యాంగం, పాలిటీ, సోషల్‌ జస్టిస్, అంతర్జాతీయ సంబంధాలు; భారత్, ఆంధ్రప్రదేశ్‌ ఎకానమీ, జాగ్రఫీ అంశాలు 120 మార్కులకు ఉంటాయి. పేపర్‌2లో జనరల్‌ అప్టిట్యూడ్, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు 120 మార్కులకు ఉంటాయి. ఇలా మొత్తంగా రెండు పేపర్లు 240 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి పేపర్‌లో 120 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండు గంటలు.

750 మార్కులకు మెయిన్‌: గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి మెయిన్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో అయిదు పేపర్లుగా 750 మార్కులకు ఉంటుంది.

పర్సనాలిటీ టెస్ట్‌: గ్రూప్‌–1లో మెయిన్‌లో పొంది­న మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో పర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు 75 మార్కులు ఉంటాయి. మెయిన్, ఇంటర్వ్యూ మార్కులను పరిగణనలోకి తీసుకొని విజేతలను ఖరారు చేస్తారు.

APPSC Group 2 రెండు దశలు.. మూడు పేపర్లు

గ్రూప్‌–2 పరీక్ష.. స్క్రీనింగ్‌ టెస్ట్, మెయిన్‌ ఎగ్జామ్‌.. ఇలా రెండు దశలుంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది.

మొదటి దశ స్క్రీనింగ్‌ టెస్ట్‌లో పేపర్‌–1, జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో భారత చరిత్ర, భౌగోళిక శాస్త్రం, భారత సమాజం, కరెంట్‌ అఫైర్స్, మెంటల్‌ ఎబిలిటీ అంశాలు ఉంటాయి.

రెండో దశ మెయిన్‌ ఎగ్జామినేషన్‌: స్క్రీనింగ్‌ టెస్ట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను రెండో దశ మెయిన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.

పేపర్‌ 1లో సెక్షన్‌–1 ఆంధ్రప్రదేశ్‌ సామాజిక సాంస్కృతిక చరిత్ర,సెక్షన్‌–2 భారత రాజ్యాంగం 150 మార్కులకు;పేపర్‌–2లో సెక్షన్‌–1: భారత్, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సెక్షన్‌–2: సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ 150 మార్కులకు..ఇలా మొత్తం 300 మార్కులకు మెయిన్‌ ఎగ్జామ్‌ జరుగుతుంది.

పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటుంది.

ప్రతి పేపర్‌లోనూ ఒక్కో సెక్షన్‌ నుంచి 75 ప్రశ్నలు అడుగుతారు.

గ్రూప్‌–2లో అభ్యర్థులకు కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ నిర్వహించే అవకాశం ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APPSC Group 1, 2 Notifications"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0