Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good news for pensioners. RBI big relief!

పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త.ఆర్‌బీఐ భారీ ఊరట!

దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తీపికబురు అందించింది. ఆర్‌బీఐ కమిటీ కీలక సిఫార్సులు చేసింది. వీటి వల్ల బ్యాంక్ కస్టమర్లకు కూడా ప్రయోజనం కలుగనుంది.

బ్యాంక్ (Bank) నుంచి పెన్షన్ పొందే వారికి కూడా ఆర్‌బీఐ (RBI) ఊరట కలిగే ప్రతిపాదన చేసింది. లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ అంశంపై ముఖ్యమైన సిఫార్సు చేసింది. ఇది అమలులోకి వస్తే.. చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. రిజర్వు బ్యాంక్ గత ఏడాది ఆర్‌బీఐ పర్యేవేక్షణలో నడిచే సంస్థలు (బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, పేమెంట్ సర్వీస్ ఆపరేటర్లు) కస్టమర్లకు సర్వీసులు ఎలా అందిస్తున్నాయో పరిశీలించాలని ఆర్‌బీఐ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ కమిటీ పలు కీలక సిఫార్సులు చేసింది.

ఆర్‌బీఐ కమిటీ సిఫార్సు చేసిన పలు ముఖ్యమైన వాటిల్లో లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ కూడా ఒకటి ఉంది. ప్రస్తుతం బ్యాంకుల నుంచి పెన్షన్ పొందే వారు ఆ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే విధానం అమలులో ఉంది. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లలేకపోతే అప్పుడు ఆన్‌లైన్‌లో కూడా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే సర్వీసులు ఇటీవలనే అందుబాటులోకి వచ్చాయి. వీడియో కాల్ ద్వారా పెన్షనర్లు ఈ పని పూర్తి చేయొచ్చు.

అయితే ఆర్బీఐ కమిటీ మరో కీలక ప్రతిపాదన చేసింది. బ్యాంక్‌కు చెందిన ఏ బ్రాంచ్‌లో అయినా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే వెసులుబాటు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపింది. పెన్షనర్లు వారి పెన్షన్ అకౌంట్ కలిగిన బ్యాంక్‌కు చెందిన ఏ బ్రాంచ్‌లో అయినా జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించేలా సేవలు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. అంతేకాకుండా లైఫ్ సర్టిఫికెట్‌ను ఏడాదిలో ఏ నెలలో అయినా సరే అందించొచ్చనే నిబంధనలను తీసుకురావాలని సూచించింది. దీని వల్ల నిర్ణీత నెలలలో రద్దీ లేకుండా ఉంటుందని పేర్కొంది. 

Good news for pensioners. RBI big relief!

ఆర్‌బీఐ కమిటీ రూపొందించిన ఈ సిఫార్సులు అమలులోకి వస్తే.. చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆర్‌బీఐ ఇతర సిఫార్సులు కూడా చేసింది. ఫిర్యాదులు పరిష్కారం కోసం వ్యవస్థను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాల్సి ఉందని ఆర్‌బీఐ కమిటీ అభిప్రాయపడింది. కాల్ సెంటర్ల, పోర్టల్ ఏర్పాటు వంటి వాటిని సమర్థవంతగా నిర్వహించాలని తెలిపింది. బ్యాంకులు, క్రెడిట్ కార్డులకు సంబంధించిన సమస్యల ఫిర్యాదు, పరిష్కారం కోసం ఒక కామన్ పోర్టల్‌ను తీసుకువస్తే బాగుంటుందని పేర్కొంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good news for pensioners. RBI big relief!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0