Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Day - 38 : Students Summer Holidays Activities

 Day - 38 : Students Summer Holidays Activities

Day6: Students Summer Holidays Activities

 Summer Holidays Activities -  - Summer vacation- summer activities

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
☀️ఏపి పాఠశాల విద్యార్థులకు  వేస
వి సెలవుల కార్యకలాపాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులకు మార్గదర్శకాలుతో ఉత్తర్వులు విడుదల.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Day:37 Activities
Class: 1,2
38వ రోజు
To develop creativity skills

Q) Make a bullock cart/car/lorry with clay and dispaly it in your house.

తెలుగు:

Q) అక్షరాల్లో తేడాను గుర్తిస్తూ పదాలను చదవండి. రాయండి.

కొండ - కోతి
గొడుగు - గోడ
దొండ - దోమ
డొంక - డోలు
పొదలు - పోలీసు
బొంగరం - బోధన
లొసుగు - లోటు
మొసలి - మోకాలు

English:

Write the missing letters.

Write the missing letters.

S౼n        ☀️

St౼r        ⭐

S౼ake      🐍

Sc౼౼ol      🏫

S౼౼on        🥄

Maths:

Q) Do the following Subtractions.

              7   4  
           -  3   8 
           ................
           ................


              4   5 
           -  1   8 
           ................
           ................


              3   8
           -  1   9 
           ................
           ................

ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు

Heart =హృదయము,గుండె.

Sit =కూర్చొనుట.

Some = కొంత, కొన్ని.

Summer = వేసవి.

Wall = గోడ.

Forest =అడవి.

Probably = బహుశా.

Legs =కాళ్ళు.

Sat = కూర్చొనెను.

Main = ప్రధానమైన.

Winter = శీతాకాలము.

Wide =వెడల్పైన, పెద్ద.

Written =వ్రాయబడిన.

Length = పొడవు.







Class :3,4,5
38 వ రోజు 

  నక్క మరియు మేక కథ లోని కీలక పదాలను గుర్తించి ' సున్నా ' చుట్టండి. చదువుతూ 5 సార్లు  మీ నోటు పుస్తకం లో రాయండి. 

Q) Identify and circle the key words in the story The VV And the goat'. Read and write the key words 5 times in your note book.



💎నేటి ఆణిముత్యం

ఒక్కడేచాలు నిశ్చలబలోన్నతు డెంతటికార్యమైనదా
జక్కనొనర్ప గౌరవులసంఖ్యుFలు పట్టినధేనుకోటులన్
జిక్కగనీక తత్ప్రబలసేన ననేకశిలీముఖంబులన్
మొక్కపడంగజేసి తుదముట్టడె యొక్కకిరీటిభాస్కరా
భావం:

కౌరవసేనవచ్చి విరాటరాజుగోవులను తరలించుకొనిపోతున్నప్పుడు అర్జనుడొక్కడెదిరించెను.కార్యసాధకుడొక్కడుచాలు.


🤘నేటి సుభాషితం

ఆకాశానికి ఎదిగాక ఎవరైనా గుర్తిస్తారు కానీ కానీ నువ్వు నేల మీద ఉన్నప్పుడు గుర్తించిన వాళ్లే నివాళులు

🗣నేటి జాతీయం

మేతకేగాని చేతకు కొరగాడు

తినడం తప్ప పని చేయడని అర్థం. అలాంటి వారినుద్దేశించి ఈ సామెత పుట్టింది

🗣నేటి జాతీయం

అన్నం, నీళ్లు పట్టించుకోకుండా

ప్రతిరోజూ చేసే దినచర్యలోని విషయాలేవీ పట్టించుకోకుండా ఏదో ఒక్క విషయాన్నే పట్టుకుని, అదే ధ్యాసలో ఉండడం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. సాధారణంగా ఏ మనిషైనా ఎంత కష్టపడి ఏకాగ్రతతో పనిచేస్తున్నా ఏదో ఒక సమయానికి ఎంతోకొంత తినడమో, తాగడమో చేస్తుంటాడు. అలా ఆహారం స్వీకరించడానికి కూడా సమయాన్ని వెచ్చించకుండా సమయాన్నంతటినీ అనుకున్నపనికే వెచ్చిస్తున్నాడని ఒక వ్యక్తి కార్యదీక్ష గురించి చెప్పేందుకు ఈ జాతీయ ప్రయోగాన్ని చేయడం కనిపిస్తోంది. 'తిండి, నీళ్లు మాని కష్టపడి సంపాదించి పిల్లలను పైకి తెచ్చాడాయన' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

👬 నేటి చిన్నారి గీతం

చిన్ని చేప

చిన్న చిన్న చినుకురా
పెద్దవాన కురిసే రా
వాగు వంక పొంగె రా
చెరవులన్నీ నిండేరా
చెర చాప తేపెరా
చేపల్లన్ని పట్టెరా

✍🏼 నేటి కథ 

ఒంటె జాడ తెలిసిందిలా!
ఒంటె జాడ తెలిసిందిలా!

ఒకరోజు తెనాలి రామకృష్ణుడు అడవి గుండా నడుచుకుంటూ వెళుతున్నాడు. దారిలో ఒక వ్యాపారి ఆయనను ఆపి, నేను దారి తప్పిపోయిన నా ఒంటెను వెతుకుతున్నాను. దారిలో నీకు ఏమైనా కనిపించిందా? అని అడుగుతాడు. వెంటనే తెనాలి రామకృష్ణ ఆ ఒంటె కాలికి గాయమైందా! అంటాడు. అవును. అంటే మీరు నా ఒంటెను చూశారన్నమాట అంటాడు వ్యాపారి. నేను ఆ ఒంటె పాదముద్రలు మాత్రమే చూశాను. చూడండి ఆ మూడు పాద ముద్రలు. ఒక కాలికి గాయం అవడం వల్ల నాలుగో కాలి ముద్ర అస్పష్టంగా ఉంది అని ఆ వ్యాపారితో అన్నాడు. వెంటనే ఆ ఒంటె గుడ్డిదా? అని అడగగానే వ్యాపారి అవును. అవును అని బదులిచ్చాడు. ఆ ఒంటె వీపు మీద ఒకపక్క గోధుమలు, మరోపక్క చక్కెర సంచులు కట్టావా? అని రామకృష్ణుడు అడుగుతాడు. అవును. సరిగ్గా చెప్పావు. అయితే నువ్వు నా ఒంటెను చూసుంటావు అని ఉత్సాహంగా అంటాడు వ్యాపారి. అందుకు రామకృష్ణుడు నేను నీ ఒంటెను చూశానని చెప్పానా! అని ఎదురు ప్రశ్నించగానే నువ్వు నా ఒంటె గురించి అన్ని విషయాలు చెప్పావు కదా! అని వ్యాపారి వాపోతాడు. అప్పుడు రామకృష్ణుడు నేను ఒంటెను చూడలేదు. అయితే దారికి ఒకవైపున్న చెట్ల ఆకులనే మేసింది కాబట్టి ఆ జంతువు గుడ్డిదని, అలాగే గోఽధుమలు కనిపించగానే సంచీకి రంధ్రం ఉన్నదేమోనని, రెండోవైపున చీమల బారును చూసి, ఆ జంతువు చక్కెర సంచులను మోసుకెళుతుందని ఊహించాను. ఈ దారి గుండా వెళితే నీ ఒంటె దొరుకుతుంది అని చెబుతాడు. తెనాలి రామకృష్ణుడు చెప్పినట్టుగానే కొంత దూరంలోనే ఆ వ్యాపారికి తన ఒంటె కనిపిస్తుంది.

తెలుసు కుందాం

ఒకోసారి సముద్ర తీరం పక్కనే బావి తవ్వినా మంచినీరు పడుతుంది. ఒకోసారి సముద్రాలకు దూర భూముల్లో బావి తవ్వినా ఉప్పు నీరు పడవచ్చు. బావి నీటి రుచికి కారణాలేంటి?

జవాబు: బావుల్లో ఊరే నీటి రుచికి సముద్రమే కారణం కానక్కర్లేదు. చాలా మటుకు భూమి పొరల్లో ఉండే భూగర్భజలం (ground water) బావుల్లోకి ఊటలాగా చేరుతుంది. సముద్ర తీర ప్రాంతాల్లోని భూగర్భాల్లో సముద్రపు నీరే చేరి ఉంటుందనుకోకూడదు. అది నిజమైతే సముద్రాల ఉపరితలంపై ఉండే విపరీతమైన ఒత్తిడి బావుల్లో నీరు పొంగిపొర్లాలి. అలా జరగడం లేదు కదా! కాబట్టి ఆ బావుల్లోకి చేరే నీరు చాలా సార్లు అక్కడి భూమి పొరల్లో ఇంకి ఉన్న లవణాల కారణంగా ఉప్పగా ఉండే అవకాశాలున్నా, కొన్ని సార్లు మంచి నీరు కూడా ఊరుతుంది. అలాగే సముద్రాలకు దూరంగా ఉండే పీఠభూముల్లో కూడా ఉప్పు నీరు పడే అవకాశాలు లేకపోలేదు. అది అక్కడి భూముల తత్వంపై ఆధారపడి ఉంటుంది. నేలల్లోని లవణాలుంటే వాటిని కరిగించుకున్న నీరు ఉప్పగా ఉంటుంది. సాధారణంగా భూగర్భజలాల్లో లవణ శాతం, సరస్సులు నదుల్లోని నీళ్ల లవణ శాతం కన్నా ఎక్కువ ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Day - 38 : Students Summer Holidays Activities"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0