Shouldn't mangoes be eaten with curd or curd rice? Do you know why? Do you know what will happen?
పెరుగు లేదా పెరుగు అన్నంతో మామిడి పండ్లును కలిపి తినకూడదు? ఎందుకో తెలుసా? ఏమౌతుందో తెలుసా?
పెరుగు ఆరోగ్యానికి మంచిదని దాదాపు చాలా మందికి తెలుసు.ప్రతిరోజు పెరుగు తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని పెద్దవారు చెబుతుంటారు. పెరుగు మంచి ప్రోబయోటిక్ కావడం వల్ల ప్రేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.అయితే పెరుగును చాలామంది ఏదో ఒక దాంట్లో కలుపుకుని తింటూ ఉంటారు.
కొన్ని ఆహార పదార్థాలు కలిపి తినడం వల్ల ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది.పెరుగు లో పండ్లు కలుపుకునే తినవచ్చు.సలాడ్, రైతా వంటివి చేసుకుని తినవచ్చు.పెరుగు( Curd ) తో పాటు కలుపుకుని తినకూడని కొన్ని ఆహారాలలో పెరుగు కూడా ఒకటి. పెరుగుతో పాటు మామిడి పండ్లు ఎందుకు తినకూడదో..తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.
పెరుగు : రోజూ పెరుగు తినడం మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలా మంది ప్రజలు వారి ఆహారంలో పెరుగు అన్నది ముఖ్యమైన దానిగా భావిస్తారు. మీ ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా పెరుగు ఎంతగానో మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడే మంచి బ్యాక్టీరియా ఇందులో ఉంటుంది. పెరుగులో ప్రోటీన్స్, కాల్షియం, రిబోఫ్లేవిన్, విటమిన్ బి 6, విటమిన్ బి -12 వంటి అనేక పోషకాలు ఉంటాయి.
ప్రతిరోజూ పెరుగు తినడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండటానికి పెరుగు ఉపయోగపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పెరుగుతో మామిడి పండును తినకూడుదు ఎందుకు?
మామిడి: మామిడి పండును ఫలాలలో రాజు అని పిలుస్తారు. వేసవి కాలంలో ఈ పళ్లను వదలకుండా తింటుంటారు. అయితే ఓవైపు మామిడి వల్ల మన శరీరంలో వేడి అధికం అవుతుంది. మరోవైపు ఈ పండు తిన్నాక కొన్ని ఆహార పదార్థాలు ముట్టవద్దని తెలియక తింటుంటాం. అయితే మామిడి పండు తిన్న వెంటనే పెరుగు తీసుకోవడానికి ఆరోగ్యానికి మంచిది కాదు. మామిడి పండ్లు, పెరుగు ఒకేసారి తిన్నా, లేక వెంట వెంటనే తీసుకున్నా కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల వెంటనే అనారోగ్యానికి గురవుతారు.
చాలామంది పెరుగులో మామిడి పండ్లు( Mangoes ) కలుపుకొని తింటారు.మామిడి పండ్లు వేడి గుణాలను కలిగి ఉంటుంది.పెరుగు చలువ గుణం కలిగి ఉంటుంది.ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి వేడి చల్లని అసమతుల్యతను కలిగిస్తుంది.ఇది చర్మ సమస్యలను కలిగిస్తుంది.చర్మంపై దద్దుర్లు, మొటిమలు ఏర్పడడం జరుగుతుంది.
మామిడి జనరల్‌గా ఆహారాన్ని బాగా జీర్ణం చేస్తుంది. ఐతే... మామిడిలో వేడి చేసే లక్షణం ఉంటుంది. పెరుగు కూడా అంతే... తక్కువ తింటే ఆరోగ్యం... ఎక్కువ తింటే వేడి చేసే ఛాన్స్ ఉంటుంది. మామిడితో గానీ, మామిడి తిన్నాక గానీ... పెరుగు తింటే... శరీరంలో నీరు బయటకు పోతుంది. లేదంటే బాగా వేడి చేసి... జ్వరం వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు స్కిన్ అలెర్జీలు కూడా రాగలవు. అందువల్ల మామిడి తిన్నాక ఓ గంట వరకూ పెరుగు తినకుండా చూసుకోవాలి.
పెరుగుతో మామిడి పండ్లు మాత్రమే కాదు మరికొన్ని పదార్థాలు కూడా తినకూడదు . అవి కూల్ డ్రింక్స్, స్పైసీ ఫుడ్స్, కాకరకాయ, పాలు, నీరు కూడా.. సో ఫ్రెండ్స్ ఇటువంటి ఆహారాలను పెరుగుతో పాటు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి
0 Response to "Shouldn't mangoes be eaten with curd or curd rice? Do you know why? Do you know what will happen?"
Post a Comment