A description of the types of charges the bank charges its customers
బ్యాంక్ తన ఖాతాదారుల నుండి ఏయే రకాల చార్జీలు వసూలు చేస్తున్నయో వివరణ.
Bank Charges: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా మారిపోయింది. బ్యాంకులు తమ కస్టమర్లకు మనీ ట్రాన్స్‌ఫర్, చెక్ క్లియరెన్స్, ఏటీఎం విత్ డ్రా, ట్రాన్సాక్షన్స్ ఎస్ఎంఎస్ సౌకర్యం వంటి పలు రకాల సేవలను అందిస్తుంటాయి. అందులో కొన్ని సేవలను ఉచితంగా అందిస్తుంటాయి. అయితే, మరికొన్నింటికి మాత్రం సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. కాబట్టి బ్యాంకులు ఎలాంటి సేవలు ఉచితంగా అందిస్తున్నాయి, ఏ సేవలకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయో తెలుసుకోవడం మంచిది.
మినిమం బ్యాలెన్స్: సాధారణంగా పొదుపు ఖాతాలు, సామాజిక భద్రత ప్రయోజనాలు అందించే సేవింగ్స్ అకౌంట్స్, శాలరీ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ నిర్వహించక్కర్లేదు. ఇతర సేవింగ్స్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఎంత అనేది బ్యాంకుపై ఆధారపడి ఉంటుంది. ఎస్‌బీఐ మెట్రో, అర్బన్ బ్రాంచీలోని ఖాతాదారులకు రూ.3000, సెమీ అర్బన్ బ్రాంచీల్లో రూ. 2000, రూరల్ బ్రాంచీల్లో రూ. 1000 కనీస నెలవారీ బ్యాలెన్స్ ఉండాలి.
నగదు లావాదేవీలు: సేవింగ్స్ ఖాతాలో నెలవారీ నగదు ట్రాన్సాక్షన్ల సంఖ్యను బ్యాంకులు 3 నుంచి 5 వరకు పరిమితం చేస్తున్నాయి. బ్యాంకు పేర్కొన్న సంఖ్య లేదా మొత్తం కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తే ఛార్జీలు వర్తిస్తాయి. ఐసీఐసీఐ బ్యాంకు నెలకు 4 నగదు లావాదేవీలను మాత్రమే ఉచితంగా అనుమతిస్తోంది. ఆ లిమిట్ దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ. 150 చొప్పున ఛార్జ్ చేస్తుంది.
డెబిట్ కార్డు ఛార్జీలు: సేవింగ్స్ అకౌంట్ కలిగిన వారికి బ్యాంకులు డెబిట్ కార్డును ఉచితంగానే ఇస్తాయి. కానీ, కొన్ని బ్యాంకులు కొద్దిపాటి ఫీజుతో ప్రీమియం డెబిట్ కార్డులను అందిస్తున్నాయి. కార్డు పోగొట్టుకుంటే కొత్త కార్డు జారీ కోసం కొంత మొత్తాన్ని ఛార్జ్ చేస్తారు. ఎస్‌బీఐ ప్లాటినమ్ డెబిట్ కార్డు జారీకి రూ. 300 ప్లస్ జీఎస్‌టీ, వార్షిక ఫీజు రూ. 250 ప్లస్ జీఎస్‌టీ వసూలు చేస్తుంది.
నగదు బదిలీ ఛార్జీలు: ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ వంటి విధానాల ద్వారా బ్యాంక్ బ్రాంచి నుంచి నగదు బదిలీ సేవలను పొందేందుకు ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ఛార్జీలు వివిధ బ్యాంకుల్లో వేర్వేరుగా ఉంటాయి. నెఫ్ట్ చార్జీలు రూ. 1 నుంచి రూ. 25 ప్లస్ జీఎస్‌టీ, ఆర్‌టీజీఎస్ ఛార్జీలు రూ. 5 నుంచి రూ. 50 ప్లస్ జీఎస్‌టీ, ఐఎంపీఎస్ ఛార్జీలు రూ. 1 నుంచి రూ. 15 ప్లస్ జీఎస్‌టీ ఉండొచ్చు.
ఏటీఎం ట్రాన్సాక్షన్ ఛార్జీలు: చాలా బ్యాంకులు తమ సొంత ఏటీఎంలలో నెలకు 5 సార్లు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు 3 సార్లు ఉచిత లావాదేవీలను అనుమతిస్తున్నాయి. ఈ పరిమితులు మించితే ఒక్కో లావాదేవీకి రూ. 20 నుంచి రూ. 50 వరకు ఛార్జీలు వసూలు చేస్తాయి.
డూప్లికేట్ స్టేట్‌మెంట్: బ్యాంకులు ఏడాదికోసారి స్టేట్‌మెంట్ కాపీని భౌతికంగా ఉచితంగానే అందిస్తాయి. ఒక వేళ డూప్లికేట్ స్టేట్‌మెంట్ కోసం అభ్యర్థిస్తే బ్యాంకులు రూ. 50 నుంచి రూ. 100 వరకు ఛార్జ్ చేయొచ్చు. స్టేట్‌మెంట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇతర ఛార్జీలు: చెక్ బౌన్స్, ఎస్ఎంఎస్ సర్వీస్ ఛార్జీలు, అవుట్ స్టేషన్ చెక్ హ్యాండ్లింగ్ ఛార్జీలు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు వంటి వాడిపైనా ఛార్జీలు వసూలు చేస్తాయి బ్యాంకులు.
0 Response to "A description of the types of charges the bank charges its customers"
Post a Comment