Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Cabinet : Cabinet exercise concluded in AP.. These are the key decisions.

 AP Cabinet : ఏపీలో ముగిసిన క్యాబినెట్ కసరత్తు. ఇవీ కీలక నిర్ణయాలు.

AP Cabinet : Cabinet exercise concluded in AP.. These are the key decisions.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు


ఆంధ్రప్రదేశ్‌లో కేబినేట్ సమావేశం ముగిసింది. మూడు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో పలు ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వైసీపీ సర్కార్. ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి కేబినేట్ ఆమోదం తెలిపింది.

వైఎస్సార్ సున్నా వడ్డి పథకం అమలుకు.. ఎస్ఐపీబీ నిర్ణయాలకు కూడా ఆమోదం తెలిపింది. అలాగే జనవనరుల శాఖలో పలు నిర్ణయాలకు కూడా గ్రీన్ ఇచ్చేశారు. అసైన్డ్ భూములపై అనుభవదారులకి సర్వ హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 20 సంవత్సరాలకు ముందు కేటాయించిన భూములకు సైతం హక్కులు కల్పించేలా నిర్ణయించారు.

అయితే కేబినేట్ భేటీ అనంతరం రాష్ట్ర మంత్రులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. జగనన్న సురక్ష అనే కార్యక్రమంపై ఆయన మంత్రులతో మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

అసైన్డ్‌, లంక భూముల హక్కుల కల్పనకు ఆమోద ముద్ర

అనైన్డ్‌ల్యాండ్‌ ఉన్న రైతులకు అనుకూలంగా కేబినెట్‌ సానుకూల నిర్ణయం తీసుకుంది. అసైన్డ్‌ ల్యాండ్‌ పొందిన లబ్ధిదారులు భూమి పొందిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు అనుభవించేలా కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఇతర రైతుల మాదిరిగానే వారికి క్రయ-విక్రయాలపై పూర్తి హక్కులు దక్కుతాయి. 

మొత్తం 63,191,84 ఎకరాల అసైన్‌మెంట్‌ ల్యాండ్స్‌, లంక భూముల విషయంలో 66,111 మందికి పూర్తి హక్కులు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.  

ఒరిజినల్‌ అసైనీలకు మాత్రమే ఇది వర్తించనుంది. ఒరిజినల్‌ అసైనీలు కాలం చేస్తే.. వారి వారసులకు ఈ నిబంధన వర్తిస్తుంది. 

1966 రెవెన్యూ గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికల ఏర్పాటునకు నిర్ణయిం తీసుకుంది. 

రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్‌ పర్చేజ్‌ స్కీం కింద దళితులకు ఇచ్చిన 16,213 ఎకరాలకు సంబంధించి వారు కట్టాల్సిన రుణాలు మాఫీ. తద్వారా పూర్తి హక్కుల కల్పన. 

వైఎస్సార్‌ సున్నా వడ్డీ ఈ పథకం అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

కేంద్రం నుంచి వచ్చిన క్లియరెన్స్‌తో.. అమరావతి సీఆర్‌డీఏలో 47 వేల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన కేబినెట్‌.

వర్సీటీలో శాశ్వత అధ్యాపకుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

అలాగే.. ఎస్ఐ‌పీబీ సమా ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకూ కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.

రాష్ట్రంలో అర్చకులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించే దిశగా అడుగులు వేస్తోంది. అర్చకులకు రిటైర్‌మెంట్‌ లేకుండా చట్టసవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

  • ఇక.. ప్రభుత్వ ఉద్యోగుల్లాగే దేవాదాయ శాఖ ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్‌నిర్ణయం తీసుకుంది. 
  • టోఫెల్‌ పరీక్షలకు ప్రభుత్వ విద్యార్థులకు శిక్షణ కోసం ప్రముఖ విద్యాసంస్థ ఈటీఎస్‌తో చేసుకున్న ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం
  • కర్నూల్‌లో కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌కు 247 పోస్టులు మంజూరుచేస్తూ కేబినెట్‌ నిర్ణయం
  • జులైలో చేపట్టబోయే పలుసంక్షేమ పథకాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
  • 18న జగనన్న తోడు నిధుల జమ
  • 20న సీఆర్‌డీఏ, ఆర్‌5 జోన్‌లలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం
  • 21న నేతన్న నేస్తం నిధుల జమ
  • 26న సున్నావడ్డీ కింద డ్వాక్రా మహిళలకు డబ్బు జమ
  • 28న జగన్న విదేశీ పథకం

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Cabinet : Cabinet exercise concluded in AP.. These are the key decisions."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0