A new trend in education!
విద్యారంగంలో కొత్త ఒరవడి!
- పలు సంస్థలతో కేంద్ర విద్యాశాఖ 106 ఒప్పందాలు
- తిరుపతి ఐఐటీలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్
పలు ప్రఖ్యాత కంపెనీలు, విద్యా సంస్థలతో ఆవిష్కరణ, పరిశోధన, విజ్ఞాన మార్పిడికి సంబంధించి ఆదివారం కేంద్ర విద్యాశాఖ 106 ఒప్పందాలను (ఎంవో యూలు) చేసుకుంది. పారిశ్రామిక సంస్థలతో విద్యా సంస్థల అనుసంధానంలో ఇది కొత్త ఒరవడికి నాంది పలకనుంది. నూతన విద్యా విధానం మూడో వార్షికో త్సవం సందర్భంగా నిర్వహించిన అఖిల భారతీయ శిక్షా సమాగమం ముగింపు కార్యక్రమంలో ఈ ఒప్పందాలు జరిగాయి. నైపుణ్యాభివృద్ధికి సంబంధించి సీబీఎస్ ఈ 15 ఒప్పందాలను చేసుకుంది. ఈ ఒప్పందాలు అటల్ ఇన్నో వేషన్ మిషన్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, ఐబీఎం, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ తోపాటు దుస్తుల తయారీ, హోం డెకార్, ఆటోమోటివ్, క్రీడలు, వ్యాయామ విద్య, లాజి స్టిక్స్, ఆరోగ్య రంగాల్లోని సంస్థలతో జరిగాయి. జవహర్నవోదయ విద్యాలయాల సంస్థ, ఐబీఎంల మధ్య ఒప్పందం కుదిరింది. ఎన్సీఈఆర్టీ 20 ఒప్పందాలను కుదుర్చుకుంది. ఏఐసీటీఈ పలు టెక్నాలజీ సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకుంది. పీఎం- ఉషా ఇనీషియే టివ్ కింద దేశంలోని పలు విశ్వవిద్యాలయాలు ఆమె రికా, కజక్రాన్, మలేసియా, బ్రెజిల్ దేశాల్లో వర్సిటీలతో ఒప్పందాలు చేసుకున్నాయి.
ఐఐటీ తిరుపతి ఒప్పందం
డిజిటల్ మాన్యుఫాక్చరింగ్, ఫౌండ్రీ పరిశ్రమ ఆటో మేషన్ అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్, శిక్షణ కోసం తిరు పతిలోని ఐఐటీ, ఐఐఎస్ సీఈటీల మధ్య ఒప్పందం కుదిరింది. డిప్లొమా హోల్డర్లకు, ఇంజినీరింగ్ గ్రాడ్యు యేట్లకు శిక్షణనిచ్చి వారి నాలెడ్జిని బలోపేతం చేయడం దీని ఉద్దేశం. స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్, విద్యుత్తు వాహనాల టెక్నాలజీకి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు తిరుపతి ఐఐటీ, సీమెన్స్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి.
0 Response to "A new trend in education!"
Post a Comment