Lost your Aadhaar Card? Forgot your number? However, it can be easily downloaded.
Aadhaar Card: మీ ఆధార్ కార్డ్ పోయిందా? నెంబర్ మర్చిపోయారా? అయినప్పటికీ ఇలా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
భారతదేశంలో ఆధార్ కార్డ్ అత్యంత కీలకమైన పత్రంగా ఉపయోగించడం జరుగుతుంది. పిల్లల స్కూల్ అడ్మిషన్ నుండి ఆస్తి కొనుగోలు వరకు, ఆసుపత్రిలో చేరడం నుండి ప్రయాణం వరకు..
దేవుడి దర్శనానికి సహా, ప్రతి చోటా ఐడి ప్రూఫ్‌గా ఆధార్ కార్డ్ అవసరం. ఇది మాత్రమే కాదు.. డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్ వంటి కీలక పత్రాల కోసం కూడా ఆధార్ అవసరం. ఈ 12 అంకెల ఆధార్ నంబర్ (ఆధార్ కార్డ్) చాలా ముఖ్యమైనది, కానీ అది కనిపించకుండా పోతే, పొరపాటున పోగొట్టుకుంటే.. ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఇలాంటి పరిస్థితిలో.. అవసరమైన వారు UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆధార్‌ను డౌన్‌లోడ్ చేయడానికి, 12 అంకెల ఆధార్ నంబర్ లేదా 28 అంకెల ఎన్‌రోల్‌మెంట్ ID నంబర్ అవసరం. ఒకవేళ ఆధార్ కనిపించకుండా పోయి, దాని నంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ID నంబర్ కూడా గుర్తులేకుంటే చాలా మంది ఆందోళన చెందుతారు. కానీ, అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రెండు నంబర్లు లేకుండా కూడా ఇ-ఆధార్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇ-ఆధార్‌ని డౌన్‌లోడ్ చేయడానికి, ముందుగా ఎన్‌రోల్‌మెంట్ IDని తిరిగి పొందాలి. అదేలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎన్‌రోల్‌మెంట్ IDని ఎలా పొందాలి?
1. ఎన్‌రోల్‌మెంట్ IDని పొందడానికి ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
2. తర్వాత మీ మొబైల్ ఫోన్‌లో గెట్ ఆధార్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
3. దీని తర్వాత ఎన్‌రోల్‌మెంట్ ఐడి రిట్రీవ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
4. ఆ తర్వాత మీ అన్ని వివరాలను నమోదు చేయాలి. Send OTP ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
5. ఆ తర్వాత మీరు నమోదు చేసిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
6. అప్పుడు మీ నంబర్‌కు ఎన్‌రోల్‌మెంట్ ID, ఆధార్ నంబర్ వస్తుంది.
ఆధార్‌ని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
1. ఆధార్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ముందుగా ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
2. ఆ తర్వాత మీరు డౌన్‌లోడ్ ఆధార్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
3. ఆ తర్వాత మీ ఆధార్ నంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ IDని నమోదు చేయండి.
4. దీని తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
5. OTPని ఎంటర్ చేయాలి.
6. ఇప్పుడు మీ ఇ-ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దాని ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.
0 Response to "Lost your Aadhaar Card? Forgot your number? However, it can be easily downloaded."
Post a Comment