Good news for WhatsApp users.. No more short video messages
WhatsApp: వాట్సప్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై షార్ట్ వీడియో మెసేజెస్?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది వినియోగదారులు చాటింగ్ కోసం, వీడియో కాల్స్ ఇతర అవసరాల కోసం వాట్సాప్ ని ఉపయోగిస్తూనే ఉంటారు.
అంతేకాకుండా రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్యతో పాటు వాట్సాప్ వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వాట్సాప్ సంస్థ మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
వాట్సాప్ తాజాగా షార్ట్ వీడియో మెసేజెస్ స్పెసిఫికేషన్‌ను లాంచ్ చేసింది. లేటెస్ట్ వాట్సాప్ వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకొని ఈ ఫీచర్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫీచర్ సహాయంతో ఏదైనా చాట్ విండోలో నేరుగా 60 సెకన్ల పాటు రియలో టైమ్ వీడియో రికార్డ్ చేసి సెండ్ చేయవచ్చు. అయితే వాట్సాప్‌లో వీడియోలు పంపే ఫీచర్ ఎప్పటి నుంచో ఉంది. ముందు ఫోన్‌లో ఏదైనా వీడియో రికార్డ్ చేసి తర్వాత వాట్సాప్ యాప్‌లో ఏదైనా చాట్ ఓపెన్ చేసి, వీడియోలు ఎటాచ్ చేసి సెండ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చాలా పెద్దది. అయితే లేటెస్ట్ వీడియో మెసేజ్ ఫీచర్‌తో, వాట్సాప్ చాట్‌లోనే ఒక రౌండ్ షేప్‌లో కెమెరా బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది. దాని ద్వారా సింపుల్‌గా వీడియో రికార్డ్ చేసి ఫాస్ట్‌గా సెండ్ చేసుకోవచ్చు.
ఇంతకుముందు ఫెసిలిటీతో వాట్సాప్‌లో పంపించే వీడియోలు నార్మల్ వీడియో లాగా ఫుల్ స్క్రీన్‌తో సెండ్ అయ్యేవి. కానీ కొత్త ఫీచర్‌తో వీడియో మెసేజ్‌లు సర్కులర్ షేప్‌లో ఉండి షార్ట్ సైజులో సెండ్ అవుతాయి. అలా రియల్ టైమ్ వీడియో మెసేజ్‌లు చూసినంత ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తాయి. అయితే ఈ ఫీచర్‌తో ప్రీ-రికార్డెడ్ వీడియోలను పంపించడం కుదరదు. కాబట్టి అవి అప్పటికప్పుడే రికార్డ్ చేసి పంపిన మెసేజ్ అని అవతలి వ్యక్తికి సింపుల్‌గా అర్థమవుతుంది. విషెస్ చెప్పడానికి, ఏదైనా ఫన్ మూమెంట్స్ చాలా క్విక్‌గా రికార్డ్ చేసి పంపడానికి, కొత్త విశేషాలను వీడియో రూపంలో వాయిస్ నోట్స్ అంత ఈజీగా షార్ట్ వీడియో మెసేజెస్ రియట్ టైమ్‌లో షేర్ చేసుకోవచ్చు. అయితే ఈ సరికొత్త ఫీచర్ ని ఎలా ఉపయోగించాలి అన్న విషయానికి వస్తే.. ఐఫోన్ , ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లందరికీ వీడియో మెసేజెస్ లాంచ్ చేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. అందరికీ ఇప్పటికిప్పుడే ఈ ఫీచర్ రిలీజ్ కాకపోవచ్చు.
ఈ అప్‌డేట్ విడుదల క్రమంగా జరుగుతోంది కాబట్టి ఈ ఫీచర్ ఇంకా రాకపోతే మరి కొద్ది రోజులు వేచి చూడకతప్పదు. అందుకోసం మొదట వాట్సాప్ యూజర్స్ వాట్సాప్ లాంచ్ చేసి ఏదైనా చాట్ ఓపెన్ చేయాలి. తర్వాత మెసేజ్ ఇన్‌బాక్స్ పక్కనే మైక్రోఫోన్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై సింగిల్ ట్యాప్ చేయాలి. అప్పుడు అది వీడియో మోడ్ ఐకాన్‌గా చేంజ్ అవుతుంది. వీడియో రికార్డ్ చేయడానికి ఆ వీడియో ఐకాన్‌ను హోల్డ్ చేసి పట్టుకోవాలి. పైకి స్వైప్ చేసి హ్యాండ్స్ ఫ్రీ రికార్డింగ్ కొనసాగించవచ్చు. రికార్డింగ్ పూర్తయ్యాక సెండ్‌పై క్లిక్ చేస్తే మెసేజ్ సెండ్ అయిపోతుంది. చాట్ ఓపెన్ చేసినప్పుడు అందులోని వీడియో మెసేజెస్ అనేవి ఆటోమేటిక్‌గా మ్యూట్ అయి ప్లే అవుతాయి. సౌండ్ వినడానికి వాటిపై నొక్కాల్సి ఉంటుంది. అప్పుడు అవి చాట్ స్క్రీన్‌లో కాస్త పెద్దగా అయ్యి సౌండ్‌తో పాటు ప్లే అవుతాయి.
0 Response to "Good news for WhatsApp users.. No more short video messages"
Post a Comment