Our favorite colors reveal our personality.
మన ఫేవరేట్ రంగులే మన వ్యక్తిత్వాన్ని తెలియ చేస్తాయి.
అరుణోదయ వర్ణం హృదయాన్ని కదిలిస్తుంది. పచ్చదనం సంతరించుకున్న ప్రకృతి ఉల్లాసాన్ని ప్రసాదిస్తుంది. ఇలా రంగుల హంగులు మనిషిని ప్రభావితం చేస్తుంటాయి.
ఒక్కో వర్ణాన్ని చూసినప్పుడు ఒక్కో అనుభూతి కలుగుతుంది. అంతేకాదు, మనకు నచ్చిన రంగు మనమేంటో చెబుతుందని ఓ పరిశోధనలో తేలింది. ఆ అధ్యయనం ప్రకారం..
Colours అరుణోదయ వర్ణం హృదయాన్ని కదిలిస్తుంది. పచ్చదనం సంతరించుకున్న ప్రకృతి ఉల్లాసాన్ని ప్రసాదిస్తుంది. ఇలా రంగుల హంగులు మనిషిని ప్రభావితం చేస్తుంటాయి. ఒక్కో వర్ణాన్ని చూసినప్పుడు ఒక్కో అనుభూతి కలుగుతుంది. అంతేకాదు, మనకు నచ్చిన రంగు మనమేంటో చెబుతుందని ఓ పరిశోధనలో తేలింది. ఆ అధ్యయనం ప్రకారం..
ఎరుపు:అత్యల్ప పౌనఃపున్య అవధి కలిగిన ఎరుపు మెచ్చే మనుషులు కాస్త అధికులమనే భావనలో ఉంటారట. తొగరు రంగు ఇష్టపడేవాళ్లు చాలా విషయాల్లో పొగరుగా వ్యవహరిస్తారని అధ్యయనకారుల వివరణ. అయితే, ఈ తరహా వ్యక్తులకు పట్టుదల ఎక్కువే! చేపట్టిన పనిని ఎలాగైనా పూర్తి చేసే శక్తిసామర్థ్యాలు వీళ్లకు ఉంటాయి.
పసుపు: పవిత్రతకు చిహ్నమైన పసుపును ఇష్టపడేవాళ్లూ పవిత్రమైన మనసు కలిగి ఉంటారట. అంతేకాదు వీళ్లలో క్రియేటివిటీ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. తను ఇష్టపడిన వాళ్లను మచ్చిక చేసుకోవడంలోనూ ముందుంటారట. వ్యక్తిగత భావోద్వేగాలను అదుపుచేసుకునే ప్రయత్నంలో ఉంటారట.
ఆకుపచ్చ:ఈ రంగు సంపదకు ప్రతీక. హరిత వర్ణాన్ని ఇష్టపడేవాళ్లు లాజికల్‌గా థింక్ చేస్తారట. అయితే మొహమాటం వీరి తెలివితేటలను బయటపడనివ్వదు. పాదరసంలా చురుకైన మెదడున్నా.. ప్రదర్శించే తీరు కాదన్నమాట!
పర్పుల్:రిచ్ కలర్‌గా చెప్పే పర్పుల్‌ను ఇష్టపడేవాళ్లలో భవిష్యత్తు గురించి ఆలోచించే గుణం ఉంటుందట. అయితే, భారీగా ఊహించుకొని తాత్కాలికమైన భావోద్వేగాలకు లోనై చేయదలచిన కార్యాన్ని మధ్యలోనే వదిలేసే స్వభావం వీరిదట.
0 Response to "Our favorite colors reveal our personality."
Post a Comment