Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good news for phonepay users

PhonePe News: ఫోన్‌పే వాడే వారికి గుడ్ న్యూస్. రూ.950తో రూ.5 లక్షల బెనిఫిట్, కొత్త సేవలు.

దిగ్గజ యూపీఐ ప్లాట్‌ఫామ్‌గా కొనసాగుతూ వస్తున్న ఫోన్‌పే తన కస్టమర్లకు తీపికబకురు అందించింది. కొత్త సర్వీసులు తీసుకువచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అందుబాటులోకి తెచ్చింది.

ఇన్సూరెన్స్ (Insurance) కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా సమగ్రమైన ఇన్సూరెన్స్ సేవలు తీసుకువచ్చింది. అంతేకాకుండా ఫోన్‌పే మంత్లీ పేమెంట్ ఆప్షన్ కూడా ఆవిష్కరించింది. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను (Plan) నెలవారీ చెలింపుతో కూడా కొనుగోల చేయొచ్చు.

ఫోన్‌పే ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ గాలా మాట్లాడుతూ.. హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలుకు సబంధించి ఆఫర్డబిలిటీ అనేది అతిపెద్ద అడ్డంకి అని తెలిపారు. నెలవారీ చెల్లింపుల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం తీసుకువచ్చామని పేర్కొన్నారు. కాగా ఫోన్‌పే తన ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఏకంగా 56 లక్షల పాలసీలను విక్రయించింది. దేశంలో 98 శాతం పిన్‌కోడ్స్‌కు సేవలు అందుబాటులో ఉంచింది.

రూ. కోటి వరకు కవరేజ్‌తో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేయొచ్చు. పరిమితులు లేకుండా హాస్పిటల్ రూమ్ పొందొచ్చు. బోనస్ కవర్ ఆప్షన్ కూడా ఉంది. ప్రి, పోస్ట్ సేల్స్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఫోన్‌పే ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోల చేయాలని భావించే వారు ముందుగా యాప్‌లోకి వెళ్లాలి. ఇన్సూరెన్స్ సెక్షన్‌లోకి వెళ్లాలి. తర్వాత మీ వివరాలను ఎంటర్ చేయాలి. తర్వాత కోట్స్ కనిపిస్తాయి. మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. తర్వాత వివరాలను చెక్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్ చేయాలి. నెలవారీగా లేదంటే వార్షికంగా డబ్బులు చెల్లించొచ్చు. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.

ఉదాహరణకు మీరు రూ.5 లక్షల మొత్తానికి హెల్త్ పాలసీ తీసుకుంటే నెలవారీ పేమేంట్ ఆప్షన్ ఎంచుకుంటే నెలకు దాదాపు రూ.950 పడుతుంది. క్యాష్‌లెస్ ఆప్షన్ ఉంది. తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలకు ఈ పాలసీ వర్తిస్తుంది. కేర్ హెల్త్ ప్లాన్ తీసుకుంటే ఈ ప్రీమియం పడుతుంది. కాగా ఫోన్‌పే ఇటీవలనే కొత్త సేవలు తెచ్చింది. పేటీఎం , రాజోర్‌పే, పైన్ ల్యాబ్స్ వంటి వాటికి షాకిచ్చింది. పీఓఎస్ విభాగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. కొత్త పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) డివైజ్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, యూపీఐ ద్వారా మర్చంట్లు పేమెంట్లు స్వీకరించొచ్చు. ఈ కొత్త సర్వీసులు ద్వారా ఫోన్‌పే కూడా పూర్తిగా ఆఫ్‌లైన్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్‌గా మారిపోయింది.

క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా పేమెంట్లు స్వీకరించడం వల్ల వారి వ్యాపారం మరింత పెరుగుతందని ఫోన్‌పే ఆఫ్‌లైన్ బిజినెస్ హెడ్ వివేక్ లోచెబ్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఫోన్‌పేకు 3.5 కోట్లకు పైగా మర్చంట్ భాగస్వాములు ఉన్నారు. వచ్చే ఏడాది కల్లా దేశవ్యాప్తంగా 1.5 లక్షల డివైజ్‌లను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఫోన్‌పే ముందుకు వెళ్తోంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good news for phonepay users"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0