Karunya' employees must pass CPT
కారుణ్య' ఉద్యోగులకు సీపీటీ ఉత్తీర్ణత తప్పనిసరి
కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారు కంప్యూటర్ నైపుణ్య పరీక్ష (సీపీటీ)లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలని సాధారణ పరిపాలనశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. 2023 ఫిబ్రవరి 24 తరువాత కారుణ్య నియామకాలు పొందిన వారికి సీపీటీ ఉత్తీర్ణత తప్పని సరి చేసింది. టైపిస్టు, లోయర్ డివిజన్ టైపిస్టు, అప్పర్ డివిజన్ టైపిస్టు, టైపిస్టు-కం-అసిస్టెంట్ పోస్టులు పొందిన వారు ఇంగ్లిష్, తెలుగు టైప్ రైటింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలనే ప్రస్తుత నిబంధనను రద్దు చేసింది. ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుంచి రెండేళ్ల లోగా సీపీటీలో ఉత్తీర్ణత సాధిస్తేనే సర్వీసును క్రమబ ధీకరిస్తామని వెల్లడించింది.
2 నుంచి శాఖాపరమైన పరీక్షలు
శాఖాపరమైన పరీక్షలను ఆగస్టు 2 నుంచి 7వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ పరీక్ష రాసేందుకు 41,501 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసు కున్నారు. దిల్లీతో కలిపి రాష్ట్రంలో 19 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని మంగళవారం విడుదల చేసిన ప్రకట నలో తెలిపింది.
0 Response to "Karunya' employees must pass CPT"
Post a Comment