Why not cut flowers after sunset? Description
సూర్యాస్తమయం తర్వాత పూలు ఎందుకు కోయకూడదు. వివరణ.
ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే ఏవేవో చెప్తుంటారు. ఇవి చేయొద్దు, ఇలా చేయాలి, ఈ టైమ్‌లోనే చేయాలి ఇలా వాళ్లు ప్రతి దానికి చేదస్తంగా ప్రవర్తిస్తారని ఈ తరం వాళ్లు అనుకుంటారు.
దానికి వాళ్ల దగ్గర సమాధానం లేకపోవడంతో ఇదంతా సోది, మూఢనమ్మకం అనే భావనకు వచ్చేస్తున్నారు. అందుకే ఆ తరం వాళ్లు పాటించే కొన్ని నియమాల వెనుక ఉన్న అసలైన కారణాలు వెతుకుదాం. అందులో భాగంగా మీరు వినే ఉంటారు.. సూర్యాస్తమయం తర్వాత పూలు కోయకూడదు అనే ఒక కండీషన్. పెద్దోళ్లు చెప్తారు. ఎందుకు కోయొద్దు, కోస్తే ఏం అవుతుందో తెలుసుకుందామా..!
చీకటి పడ్డాక పూలెందుకు కోయకూడదని ఆలోచిస్తే వాటివెనుక ఆధ్యాత్మిక కారణాలు మాత్రమే కాదు ప్రకృతి పరమైన, శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయనని తెలిసింది. హిందూ సంప్రదాయంలో పూలకి ప్రత్యేక స్థానం ఉంది. శుభం-అశుభం- పండుగ- ఫంక్షన్ సందర్భం ఏదైనా సరే పూల ఉండాల్సిందే.
మరోకారణం ఏంటంటే చీకటి పడగానే మొక్కలు, చెట్లు కిరణజన్య సంయోగ క్రియను ఆపేస్తాయి. అలాంటప్పుడు వాటి నుంచి ఆక్సిజన్ కాకుండా కార్బన్ డై ఆక్సైజ్ విడుదలవుతుంది. ఆ గాలి పీల్చడం ఆరోగ్యానికి హానికరం కాబట్టి చీకటిపడ్డాక పూలు కోయద్దని చెబుతారు.
పెద్దలు పాటించమని చెప్పే ప్రతి విషయం వెనుకా ఓ శాస్త్రీయ కారణం ఉంటుంది. అది తెలియక అంతా చాదస్తం, మూఢనమ్మకం అనుకోని కొట్టి పారేయడం చేయొద్దని పండితులు అంటున్నారు.
0 Response to "Why not cut flowers after sunset? Description"
Post a Comment