One teacher for 252 students
252 మంది విద్యార్థులకి ఒకే ఉపాధ్యాయుడు
పాఠశాలకు తాళం వేసిన విద్యార్థుల తల్లిదండ్రులు
252 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడే పాఠం చెబుతున్నారు. తమ చదువులు కుంటుపడుతున్నాయని, ఉపాధ్యాయులను కేటాయించాలని స్పందనలో విద్యార్థులు 20 రోజులైన అధికారులు కనికరించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా హాలహర్వి మండలం నిట్రవట్టి గ్రామంలో చోటు చేసుకుంది. నిట్రవట్టి గ్రామ ఎంపిపి పాఠశాలలో 252 విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలకు ఐదుగురు ఉపాధ్యాయులు అవసరం. కానీ ప్రధానోపాధ్యాయులు ఒక్కరే పాఠం చెబుతున్నారు. ఓ వైపు విద్యార్థులు లేక చాలా పాఠశాలలు మూత తమ గ్రామంలో విద్యార్థులు ఉన్నా, ఉపాధ్యాయులు లేక మూతబడుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామంలోని పాఠశాలకు తక్షణమే ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. అంతవరకు వేసిన తాళం తీసేది లేదని తేల్చిచెప్పారు.
బాధ్యతలు చేపట్టని ఉపాధ్యాయుడు
చిత్తూరు జిల్లా వి.కోట మండల పరిధిలోని ఎంఎంకుంట ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో దాదాపు 20 మంది విద్యార్థులు చదువుతున్నారు. గురువారం ఉపాధ్యాయులు లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు పాఠశాలకు తాళం వేశారు. అరకొర ఉపాధ్యాయులతో నడుస్తున్న పాఠశాలకు నగరి నుంచి ఎంఎం కుంటకు ఉపాధ్యాయులను బదిలీ చేయగా వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని ఎంఇఒ చంద్రశేఖర్ తెలిపారు.
0 Response to "One teacher for 252 students"
Post a Comment