Our national flag reigns supreme.
మన జాతీయ పతాక ప్రస్థానం.
- ఒక జాతి లేదా దేశం యొక్క అస్తిత్వానికి చిహ్నం ' జెండా '
- భారత జాతి ప్రపంచంలో గర్వంగా చెప్పుకునే చిహ్నం మన మువ్వన్నెల జెండా
- ఈ జెండా రూపకల్పనా ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిద్దాం.
1.తొలిసారిగా 1904 లో భారత జాతికి ఒక ప్రత్యేకమైన చిహ్నం ఉండాలనే ఉద్దేశ్యంతో సిస్టర్ నివేదిత ఒక పతాకాన్ని రూపొందించారు. మొదట ఆది ఎరుపు, నలుపు రంగుల్లో ఉండేది. అయితే తర్వాత ఆమె తన విద్యార్థుల సలహాతో కాషాయం, పసుపు రంగుల్లోకి మార్చారు. 1906 లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో ఈ జెండా ఎగురవేశారు.
2.1905 లో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ ను విభజించింది. ఆ విభజనను వ్యతిరేకిస్తూ పెద్ద ఉద్యమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బెంగాల్ కే చెందిన సచ్చీంద్రప్రసాద్ బోస్, సుకుమార్ లు మొదటిసారి త్రివర్ణ పతాకం రూపొందించారు. హిందూ ముస్లిం సమైక్యతను ప్రతిఫలించే విధంగా ఆ జెండా రూపుదిద్దుకుంది.
3.తర్వాత కొన్నాళ్ళకి హోం రూల్ ఉద్యమం ప్రారంభమైంది. దానికి అనీబిసెంట్, బాలగంగాధర తిలక్ లు నాయకత్వం వహించారు. అప్పుడు ఐదు రంగులతో మరో జెండా రూపుదిద్దుకుంది.
4.మహాత్మాగాంధీ ప్రభావానికి ఉత్తేజితుడైన పింగళి వెంకయ్య గారు మొదట ఒక జెండా నమూనా తయారుచేసారు. తర్వాత దానికి మధ్యలో చరఖాను కలిపారు. అయితే కాంగ్రెస్ కమిటీ ఈ నమూనా నచ్చలేదు.
5.అప్పుడు గాంధీగారి సలహాతో వెంకయ్య గారు తయారు చేసిన మరో జెండా అందరి ఆమోదం పొంది 1921 లో అహమ్మదాబాద్ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో ఎగిరింది. ఆ జెండా దేశమంతా స్వాతంత్ర్య స్పూర్తిని రగిలించింది. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులతో మధ్యలో చరఖాతో ఆ జెండా ఉండేది.
6.తెలుగు తేజం పింగళి వెంకయ్య గారు రూపొందించిన ఆ మువ్వన్నెల జెండా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశ చిహ్నంగా గుర్తించబడి కొన్ని మార్పులతో ఆమోదించబడింది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో బాటు మధ్యలో చరఖా బదులుగా అశోక చక్రం ఉంచబడింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రపంచ పటంలో భారతదేశ పతాకం రెపరెపలాడుతోంది.
త్రివర్ణ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య గారి వర్ధంతి
నేడు శ్రీ పింగళి వెంకయ్య గారి వర్ధంతి. భారత ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన జాతీయ జెండా రూపకర్త.
శ్రీ పింగళి వెంకయ్య గారు ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా మచీలీపట్నానికి సమీపాన గల భట్ల పెనుమర్రు అనే గ్రామములో ఆగస్టు 2న, 1876 న హనుమంతరాయుడు, వెంకట రత్నమ్మ దంపతులకు జన్మించాడు.
పింగళి వెంకయ్య గారు స్వాతంత్ర సమరయోధుడు మన జాతీయ పతాక రూపకర్త మన త్రివర్ణ పతాకం గాంధిజీ ప్రోద్బలంతో పుట్టింది మన తెలుగు నేలమీదే. కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లిములకు అని పేర్కొనడముతో ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ గాంధీజీ సూచనలపై ఆకుపచ్చ, కాషాయ రంగులతో పాటు తెలుపును కూడా చేర్చి త్రివర్ణపతాకాన్నిపింగళి రూపొందించాడు. మధ్యలో ఉండే రాట్నము గ్రామీణ జీవితాన్ని రైతు కార్మికత్వాన్ని స్ఫురింపచేస్తుందని అయన భావన.మన ఆశయాలకు భారతదేశము అవలంభించే సత్యము, అహింసలకు చిహ్నమే మన త్రివర్ణ పతాకం.అప్పట్లో ఈ జెండాను పింగళి కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్ర్యోద్యమములో రూపొందించాడు 1947 జులై 22 న భారత రాజ్యాంగ సభలో నెహ్రు జాతీయ జెండా గురించి తీర్మానం చేస్తూ త్రివర్ణ పతాకములోని రాట్నము స్థానములో మన పూర్వ సంస్కృతికి చిహ్నమైన సారనాద్ స్తూపములోని ఆశోకుని ధర్మచక్రాన్ని చేర్చారు ఈ మార్పు తప్పితే పింగళి రూపొందించిన జెండాకు మన జాతీయ జెండాకు తేడా ఏమి లేదు.ఆ విధముగా మన జాతీయ జెండా రూపకర్తగా పింగళి వెంకయ్య గారు మన చరిత్రలో స్థానము సంపాదించుకున్నారు.
జాతీయ జెండా రూపకర్తగా, వ్యవసాయ,ఖనిజ శాస్త్రవేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పింగళి వెంకయ్యగారూ తనకంటూ ఏమి మిగుల్చుకోలేదు చివరి రోజుల్లో దుర్భర దరిద్రాన్ని అనుభవించారు వృద్దాప్యములో ఆర్ధిక భాధలు ఆయనను చుట్టుముట్టాయి మిలిటరీలో పనిచేసినందుకుగాను ప్రభుత్వమూ ఆయనకు విజయవాడలోని చిట్టినగర్ లో ఒక ఇంటి స్థలము ఇస్తే అందులో గుడిసె వేసుకొని కాలము వెళ్లబుచ్చాడు.
కుటుంబ విషయాలకు వస్తే ఆయనకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె పెద్ద కొడుకు జర్నలిస్ట్ గా ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పని చేసాడు రెండవ కొడుకు మిలిటరీలో పనిచేసి చిన్న వయస్సులోనే చనిపోయినాడు కూతురు మాచర్లలో ఉంటారు. 1963 జులై 4 న కన్ను ముశారు అయన చివరి కోరిక అయన మృత దేహము పై జాతీయ జెండాను కప్పి శ్మశాన వాటికలో దగ్గర్లో ఉన్న రావి చెట్టుకు ఆ జెండా కట్టవలసినది కోరాడు. హైదరాబాదు లో ట్యాంక్ బండ్ మీద ప్రభుత్వమూ అయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించి అయన దర్శన భాగ్యము ప్రజలకు కలుగజేశారు. జాతీయ పతాకం ఎగురు తున్నంత కాలము గుర్తుంచు కోవలసిన మహనీయుడు పింగళి వెంకయ్య గారు.
0 Response to "Our national flag reigns supreme."
Post a Comment