Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Are you feeling lethargic and dragging your arms and legs.. but take these..

  నీరసంగా ఉండి చేతులు, కాళ్లు లాగుతున్నాయా. అయితే వీటిని తీసుకోండి.

Are you feeling lethargic and dragging your arms and legs.. but take these..

ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది పని చేయడానికి శక్తి సరిపోక, నీరసం, నిస్సత్తువ, బలహీనత వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే డబ్బులు లేక అందరి వలే అన్ని రకాల బలమైన ఆహారాలను కొనుగోలు చేసి తినలేక ఇబ్బంది పడే వారు కూడా ఉన్నారు.

ఇలా బలహీనత సమస్యతో బాధపడే వారు అలాగే అందరూ కొనుగోలు చేసి తీసుకోగలిగే పంచరత్నాల వంటి విత్తనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల మాంసం కంటే ఎక్కువ బలం చేకూరుతుందని వారు తెలియజేస్తున్నారు. ప్రకృతి ప్రసాదించిన అతి బలమైన విత్తనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందరికి అందుబాటులో ఉండడంతో పాటు మిక్కిలి బలాన్ని చేకూర్చే ఆహారాల్లో పల్లీలు మొదటి స్థానంలో వస్తాయి.

అలాగే పచ్చి కొబ్బరి, పుచ్చ గింజల పప్పు, గుమ్మడి గింజల పప్పు, ప్రొద్దు తిరుగుడు పప్పు. వీటిని శరీరానికి తగినంత బలాన్ని చేకూర్చడం కోసం ఉపయోగించవచ్చు. అలాగే ఈ విత్తనాలు మనకు తక్కువ ధరలోనే లభ్యమవుతాయి. ఈ పచ్చి కొబ్బరిని ముక్కలుగా చేసి బెల్లంతో కలిపి తీసుకోవాలి. అలాగే పల్లీలను, ఇతర విత్తనాలను విడివిడిగా నానబెట్టి తీసుకోవాలి. వీటిని సుమారుగా 8గంటల పాటు నానబెట్టి తీసుకోవాలి. ఇలా నానబెట్టిన పప్పులను శుభ్రంగా కడిగి అలాగే విడివిడిగా ప్లేట్ లోకి తీసుకుని విడివిడిగా తినాలి. ఈ విత్తనాలను ఖర్జూర పండ్లతో కలిపి తింటే తినడానికి చక్కగా, రుచిగా ఉంటాయి. వీటిని తీసుకున్న తరువాత జామకాయలను లేదా అరటి పండును తీసుకోవాలి. ఇలా రోజులో ఎప్పుడైనా ఒక పూట కొబ్బరి ముక్కలను, నానబెట్టిన విత్తనాలను, పండ్లను తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల రెండు పూటలా అన్నం తిన్న దాని కంటే ఎక్కవ బలం మన శరీరానికి అందుతుంది.

వీటిని చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న రెండు రోజుల్లోనే మన శరీరంలో వచ్చిన మార్పును గమనించవచ్చు. ఇలా విత్తనాలను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత బలం చేకూరుతుంది. నీరసం, నిస్సత్తువ వంటి సమస్యలు దూరం అవుతాయి. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. అలాగే వీటిని తీసుకోవడం వల్ల కాళ్లు, చేతులు లాగడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఎముకలు ధృడంగా తయారవుతాయి. శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. విటమిన్ల లోపం, ప్రోటీన్ల లోపం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఈ విధంగా నీరసం, శరీరక బలహీనత వంటి సమస్యలతో బాధపడే వారు ఈ పంచరత్నాల వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Are you feeling lethargic and dragging your arms and legs.. but take these.."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0