Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

COOL DRINKS: An explanation of why you gain weight if you drink a cool drink.

 COOL DRINKS : కూల్ డ్రింక్ తాగితే ఎందుకు బరువు పెరుగుతారో వివరణ.

COOL DRINKS: An explanation of why you gain weight if you drink a cool drink.

 COOL DRINKS:వేడి వేడి వాతవరణంలో ఎంచక్కా చల్ల చల్లని కూల్‌డ్రింక్ తాగితే వచ్చే మజానే వేరు కదా. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు కూల్ డ్రింక్స్ అంటే తాగడానికి ఎంతో ఇష్ట పడతారు.

అయితే చాలమంది కూల్ డ్రింక్స్ తాగితే లావెక్కుతారని అనుకుంటారు. అది అందరి అభిప్రాయం మాత్రమే కానీ అసలు ఎందుకు అలా జరుగుతుంది అనే విషయం ఎవరికీ స్పష్టంగా తెలియదు. అయితే ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. అమెరికాకు చెందిన వీల్‌ కార్నెల్‌ మెడిసన్‌ శాస్త్రవేత్తలు ఈ విషయం మీద ఒక క్లారిటీ అనేది ఇచ్చారు.

కూల్‌డ్రింక్స్‌ తోపాటు అనేక ఇతర ఆహార పదార్థాల్లో వాడే హై ఫ్రక్టోస్‌ కార్న్‌ సిరప్‌ అనే పదార్ధాన్ని ఎక్కువగా వాడడం వలన అది శరీరంలో కొవ్వు నిల్వలను అధికం చేస్తుంది. ఆ సిరప్ వలన చాలా రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది. హెచ్‌ఎఫ్‌సీఎస్‌ లు చిన్నపేగుల్లోని కణాల్లో కొన్ని మార్పులకు కారణం అవుతాయని, తద్వారా పోషకాలు ఎక్కువ మొత్తంలో శరీరానికి చేరడం వలన బరువు పెరుగుతారని చెబుతున్నారు. 2019లో పేగు కేన్సర్‌ పై జరిగిన ఒక పరిశోధనలో ఫ్రక్టోస్‌ ఎక్కువ నిల్వ ఉండడం వలన అది కాస్త కేన్సర్‌ కణితి పెరుగుదలకు కారణం అయిందని తెలిసింది. దాని వెనుక ఉన్న కణస్థాయి వ్యవస్థలను తెలుసుకునే క్రమంలో తాజా పరిశోధన చేపట్టారు. ఇందులో భాగంగా చిన్నపేగుల్లోని ఇతర కణాలపై ఫ్రక్టోస్‌ ప్రభావం ఎంత ఉంది అని పరిశోధన చేపట్టారు.

ఈ పరిశోధనలో భాగంగా చిన్నపేగుల్లో వెంట్రుకల మాదిరిగా ఉండే కొన్ని కోట్ల సంఖ్యలో ‘విల్లీ’ ల వంటి పోషకాను శోషించుకునే నిర్మాణాలు ఉన్నాయని కనుకొన్నారు. ఈ ప్రయోగంలో భాగంగా ఎలుకలకు హెచ్‌ఎఫ్‌సీఎస్‌ లు ఎక్కువ మొత్తంలో ఇచ్చినప్పుడు ఈ విల్లీల పొడవు 40% వరకూ పెరగడం మాత్రమే కాకుండా వాటి బరువు కూడా పెరిగినట్లు తెలిసింది. కూల్ డ్రింక్స్ తాగడం వలన మన శరీర కణాల్లో ఫ్రక్టోస్‌-1-ఫాస్పేట్‌ ఎక్కువగా నిల్వ ఉండడం వలన బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఈ అధ్యయనం చేసిన శాస్త్రవేత్త శామ్యూల్‌ టేలర్‌ తెలిపారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "COOL DRINKS: An explanation of why you gain weight if you drink a cool drink."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0