Bank Adire is good news for customers..Minimum balance, ATM charges waived, new account services!
Bank News: కస్టమర్లకు బ్యాంక్ అదిరే శుభవార్త.. మినిమమ్ బ్యాలెన్స్, ఏటీఎం చార్జీలు మాఫీ, కొత్త అకౌంట్ సేవలు!
ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న యాక్సిస్ బ్యాంక్ తాజాగా అదిరే శుభవార్త తీసుకువచ్చింది.
కొత్త బ్యాంక్ అకౌంట్ సర్వీసులు లాంచ్ చేసింది. ఇన్‌ఫినిటీ సేవింగ్స్ అకౌంట్ తీసుకువచ్చింది. డిజిటల్ కస్టమర్లు లక్ష్యంగా బ్యాంక్ ఈ సేవలు అందుబాటులోకి తెచ్చిందని చెప్పుకోవచ్చు.
ఈ కొత్త బ్యాంక్ అకౌంట్ ద్వారా యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు ప్రత్యేకమైన సర్వీసులు పొందొచ్చు. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ చార్జీలు చెల్లించాల్సిన పని లేదు. అలాగే కాంప్లిమెంటరీ డెబిట్ కార్డు లభిస్తుంది. అలాగే అన్ని డొమెస్టిక్ చార్జీలు కూడా మాఫీ చేస్తారు. అంటే చాలా వరకు చార్జీలు ఉండవని చెప్పుకోవచ్చు.
అయితే ఈ సర్వీసులు పొందాలని భావించే కస్టమర్లు ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. ఈ అకౌంట్ కలిగిన వారు నెలకు రూ. 150 చెల్లించాల్సి ఉంది. లేదంటే సంవత్సరానికి ఒకసారి రూ. 1650 చెల్లిస్తే సరిపోతుంది. చార్జీలు లేకుండా సేవింగ్స్ ఖాతా సర్వీసులు పొందొచ్చు.
ఇన్నోవేటివ్ ప్రొడక్టులు తీసుకురావడంపై ఫోకస్ చేశామని, అందుకే ఈ కొత్త సర్వీసులు తీసుకువచ్చామని యాక్సిస్ బ్యాంక్ రిటైల్ లయబిలిటీస్ అండ్ ప్రొడక్ట్స్, బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ రవి నారాయణన్ తెలిపారు. సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ బ్యాంక్ అకౌంట్ సర్వీసుల ద్వారా కస్టమర్లకు బెనిఫిట్ కలుగుతుందని పేర్కొన్నారు.
కస్టమర్లు ఇకపై సేవింగ్స్ ఖాతా సర్వీసులను సబ్‌స్క్రిప్షన్ రూపంలో పొందొచ్చు. ఇలా ఎవరైతే సబ్‌స్క్రిప్షన్ సర్వీసులు తీసుకుంటారో.. వారికి చార్జీల బాదుడు ఉండదు. అందువల్ల బ్యాంక్ అకౌంట్ పొందాలని భావించే వారు ఈ కొత్త సర్వీసులను ఒకసారి పరిశీలించొచ్చు. సులభంగా ఖాతా తెరవొచ్చు. చార్జీల బాదుడు నుంచి తప్పించుకోవచ్చు.
కాగా యాక్సిస్ బ్యాంక్ తీసుకువచ్చిన ఈ కొత్త సేవింగ్స్ అకౌంట్ సర్వీసులను గమనిస్తే.. మీరు ఇంటి వద్ద నుంచే బ్యాంక్ అకౌంట్ తెరవొచ్చు. వీడియో కేవైసీ ద్వారా బ్యాంక్ అకౌంట్ తెరవొచ్చు. అంటే పూర్తిగా డిజిటల్ రూపంలోనే బ్యాంక్ అకౌంట్ ప్రారంభించొచ్చు. అకౌంట్ తెరిచేసమయంలో సబ్‌స్క్రిప్షన్ పొందాల్సి ఉంటుంది.
నెలకు రూ. 150 సబ్‌స్క్రిప్షన్ అకౌంట్ తీసుకుంటే.. కనీసం 6 నెలల వరకు సబ్‌స్క్రిప్షన్ పొందాల్సి ఉంటుంది. ఆరు నెలల తర్వాత ప్లాన్ 30 రోజుల సైకిల్‌తో కొనసాగుతుంది. అంటే ప్రతి 30 రోజులకు రూ.150 కట్ అవుతుంది. అదే వార్షిక ప్లాన్ రూ.1650 తీసుకుంటే.. తర్వాత ఏడాదికి ఆటోమేటిక్‌గానే ప్లాన్ రెన్యూవల్ అవుతుంది.
మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు ఉండవు. డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ ఫీజులు ఉండవు. డెబిట్ కార్డు ఫ్రీగా వస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్ ఏటీఎం విత్‌డ్రాయెల్స్ ఫెసిలిటీ ఉంటుంది. చెక్ బుక్ చార్జీలు ఉండవు. పూర్తిగా డిజిటల్ రూపంలోనే మీర బ్యాంక్ అకౌంట్ తెరవొచ్చు.
0 Response to "Bank Adire is good news for customers..Minimum balance, ATM charges waived, new account services!"
Post a Comment