Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Computer Vision Syndrome

 Computer Vision Syndrome: కంప్యూటర్, ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారా.. అయితే జాగ్రత్త?

Computer Vision Syndrome

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్లు లాప్టాప్, కంప్యూటర్ లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వస్తువుల వినియోగం విపరీతంగా పెరిగిపోయి. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లను ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగిస్తూనే ఉన్నారు.

వీటి కారణంగా చిన్న వయసులోనే కళ్లద్దాలు రావడం ఒక వయసు వచ్చేసరికి పూర్తిగా కళ్ళు కనిపించకపోవడం ఆపరేషన్ చేయించుకోవడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కంటిచూపు బాగున్నప్పుడు దాన్ని కాపాడుకోకుండా నిర్లక్ష్యం చేసి కళ్లను అనవసరమైన ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాం. కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ సమస్యను ఎదుర్కొంటున్నారు.

ఈ రోజులో ఎక్కువ భాగం సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. కంప్యూటర్లపై పనిచేసే వ్యక్తుల్లో కనీసం 50-90 శాతం మంది కొన్ని రకాల సమస్యల బారిన పడతారట. కంప్యూటర్‌ వాడకం వల్ల వచ్చే కంటి సమస్యలను కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ అని అంటారు. ఇది కంట్లో ఒత్తిడి, నొప్పిని కలిగిస్తుంది. డిజిటల్ స్క్రీన్‌ నుంచి వచ్చే లైట్‌ కళ్ల మీదు పడినప్పుడు దానికి తగినట్లుగా కళ్లు చూపును అడ్జెస్ట్‌ చేసుకుంటాయి. అప్పుడే లైట్ కంటి రెటీనాపై సరిగా పడుతుంది. దీని వల్ల వస్తువులను స్పష్టంగా చూడగలుగుతాము. కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ కారణంగా తలనొప్పి, కళ్లు పొడిబారడం, చూపు మసకగా మారడం, చదివేప్పుడు ఇబ్బందులు, ఏకాగ్రత లేకపోవడం, చిన్నపాటి కాంతిని కూడా కళ్లు తట్టుకోలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

చదివేటప్పుడు మీరు సాధారణంగా ధరించే రీడింగ్ గ్లాసెస్ ధరించకుండా ఉండటం, వృద్ధాప్యం ఇప్పటికే ఉన్న కంటి సమస్యలను పరిష్కరించకుండా, ఎక్కువసేపు స్క్రీన్‌లను చూడటం, పేలవమైన లైటింగ్, మసక, మినుకుమినుకుమనే స్క్రీన్‌లు చూడటం.. అలాంటపుడు 20-20-20 రూల్‌ పాటిస్తే కళ్లపై ఒత్తిడిని కాస్త తగ్గించవచ్చు. అంటే ప్రతి 20 నిమిషాలకోసారి బ్రేక్‌ తీసుకోండి. బ్రేక్‌ సమయంలో 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను 20 సెకన్ల పాటు చూస్తుండాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు ఉపశమనం కలుగుతుంది.స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ తీవ్రతను తగ్గించాలి. దీని వల్ల బ్లూ లైట్‌ ఎక్స్‌పోజర్‌ తగ్గుతుంది. బ్లూ లైట్‌ స్పెట్స్‌ ధరిస్తే డిజిటల్‌ స్క్రిన్‌ లైట్‌ ఒత్తిడి తగ్గుతుంది. ఏడాదికి ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలి. దాని వల్ల మీ కంటి చూపులో ఏవైనా లోపాలు ఉంటే తెలియడమే కాకుండా ఇతరత్రా కంటి సమస్యలకు రాకుండా జాగ్రత్త పడవచ్చు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Computer Vision Syndrome"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0