Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Sim Card Changing

 Sim Card Changing: సిమ్‌కార్డ్‌ మార్చేటప్పుడు ఈ పొరపాట్లు చేయవద్దు.. వేల రూపాయలు నష్టపోతారు..!

Sim Card Changing

Sim Card Changing: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ కొనడం చాలా సులువుగా మారింది. చౌకైన ధరలలో అనువైన ఫోన్‌లు లభిస్తున్నాయి. దీంతో వినియోగదారులు తరచుగా ఫోన్లు మార్చడం మొదలుపెట్టారు.

మార్కెట్‌లోకి కొత్త ఫోన్‌ రావడంతో పాత ఫోన్‌ అమ్మేయడం లేదంటే ఎక్స్‌ఛేంజ్‌ చేయడం అలవాటుగా మారింది. ఈ క్రమంలో కొంతమంది టెలికాం కంపెనీల ఆఫర్ల కారణంగా సిమ్‌కార్డులు కూడా మార్చుతున్నారు. దీనివల్ల ఎటువంటి సమస్య ఉండదు కానీ సిమ్‌ కార్డు మార్చేటప్పుడు కొంతమంది తప్పులు చేస్తున్నారు. దీనివల్ల వేల రూపాయల ఫోన్‌ పనికిరాకుండా పోతుంది. సిమ్‌కార్డు మార్చేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఈరోజు తెలుసుకుందాం.

నిజానికి SIM కార్డ్ ట్రే చాలా చిన్నగా ఉంటుంది. దాని మెకానిజం కూడా సున్నితంగా ఉంటుంది. అందుకే సిమ్‌కార్డు ఇన్‌సర్ట్‌ చేసేటప్పుడు తప్పు చేయకూడదు. లేదంటే స్మార్ట్‌ఫోన్‌ను రిపేర్ చేయాల్సి ఉంటుంది. మీరు సిమ్ కార్డ్‌ను ఇన్‌సర్ట్ చేస్తుంటే సిమ్ ట్రే మురికిగా ఉండకూడదు. మొదట దాన్ని శుభ్రం చేయాలి. తర్వాత మాత్రమే సిమ్ కార్డ్‌ను ఇన్‌సర్ట్‌ చేయాలి. సిమ్ ట్రేలో దుమ్ము ఉంటే సిమ్‌కార్డు సరిగ్గా పనిచేయదు. రకరకాల సమస్యలు ఏర్పడుతాయి.

నీటితో శుభ్రం చేయవద్దు

సిమ్ ట్రేని శుభ్రం చేయడానికి ఏ రకమైన ద్రవాన్ని లేదా నీటిని ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల స్మార్ట్‌ఫోన్ పాడయ్యే ప్రమాదం ఉంది. అప్పుడు దీనిని సరిచేయడానికి వేల రూపాయలు ఖర్చుచేయాల్సి ఉంటుంది.

సిమ్‌ బలవంతంగా తీయవద్దు.

 SIM ట్రేని తీయడానికి ప్రయత్నించేటప్పుడు సున్నితంగా వ్యవహరించాలి. బలవంతంగా సిమ్‌కార్డు తీయడానికి ప్రయత్నిస్తే అది విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు సిమ్ ట్రేతో పాటు రీడింగ్ మెకానిజం కూడా దెబ్బతింటుంది. సులభంగా తీయడం వల్ల సిమ్ ట్రే సురక్షితంగా ఉంటుంది. మీకు కూడా ఎటువంటి ఖర్చు ఉండదు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Sim Card Changing"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0