jobs: 41,822 jobs with Tenth, Inter qualification. Full details
Jobs : టెన్త్, ఇంటర్ అర్హత తో 41,822 ఉద్యోగాలు. పూర్తి వివరాలివే
Indian Army MES Recruitment 2023 : ఇండియన్ ఆర్మీలో చేరాలనుకున్న వాళ్లకు గుడ్‌న్యూస్. ఇండియన్ ఆర్మీలోని మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్‌లో 41,822 పోస్టుల భర్తీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. తాజాగా ఇండియన్ ఆర్మీ షార్ట్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ ప్రస్తుతానికి ఖాళీల గురించి మాత్రమే సమాచారాన్ని మాత్రమే ఇచ్చింది. త్వరలోనే పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం.
పోస్టుల వివరాలు :
ఇండియన్ మిలిటరీ సర్వీస్ (ఎంఈఎస్)లో సూపర్‌వైజర్, డ్రాట్స్‌మన్, స్టోర్ కీపర్ వంటి పోస్టులకు సంబంధించిన రిక్రూట్‌మెంట్ త్వరలో ప్రారంభించనున్నారు.
మొత్తం ఖాళీలు - 41,822
ఆర్కిటెక్ట్ కేడర్ గ్రూప్ : 44
బ్యారక్ అండ్ స్టోర్ ఆఫీసర్ : 120
సూపర్‌వైజర్ (బ్యారాక్ అండ్ స్టోర్) : 534
డ్రాట్స్‌మ్యాన్ : 944
స్టోర్ కీపర్ : 2026
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 11,316
మేట్ : 27,920
ముఖ్య సమాచారం :
అర్హతలు : ఎంఈఎస్‌లో చేరడానికి 10వ/12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. అర్హతకు సంబంధించిన అదనపు సమాచారం పూర్తి నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
0 Response to "jobs: 41,822 jobs with Tenth, Inter qualification. Full details"
Post a Comment